దుర్గ, ఐ.ఎ.ఎస్: ఇసుక మాఫియాకు చెక్ పెట్టినందుకు సస్పెన్షన్
ఈమె పేరు దుర్గ శక్తి నాగపాల్. వయసు కేవలం 28 సంవత్సరాలు. పంజాబ్ కేడర్ ఐ.ఎ.ఎస్ గా ఉత్తర ప్రదేశ్ లో గౌతమ్ బుద్ధ నగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా నియమితురాలయింది. పదవి చేపట్టింది లగాయితు గ్రేటర్ నొయిడా ప్రాంతంలో యమున, హిందోన్ నదుల వెంట ఇసుకను అక్రమంగా తవ్విపోస్తున్న మాఫియాల గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచింది. రాజకీయంగా అత్యున్నత స్ధాయి సంబంధాలు కలిగి ఉన్న ఇసుక మాఫియా తన సర్వశక్తులు ఒడ్డిన ఫలితంగా మతపరమైన…

