సెల్ ఫోన్ లో ఫేస్ బుక్ తో జర జాగ్రత్త!

ఫేస్ బుక్ కూడా గూగుల్ కంపెనీ ఎత్తుగడలను అనుసరిస్తోంది. యాండ్రాయిడ్ మొబైల్ ఫోన్ వినియోగదారుల ఎస్.ఎం.ఎస్ లను, ఇతర వ్యక్తిగత రహస్య సమాచారాన్ని రికార్డు చేసి భద్రపరచుకోడానికి తమ వినియోగదారులకు ఫేస్ బుక్ వల వేస్తోందని ప్రముఖ కంప్యూటర్ భద్రతా కంపెనీ ‘కాస్పరస్కీ’ అధినేత కాస్పరస్కీ హెచ్చరించారు. యాండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ లోని తన అప్లికేషన్ (యాప్) ను ఫేస్ బుక్ తాజాకరించి, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు వీలయిన అంశాలను చొప్పించిందని ఆయన వివరించారు.  అమెరికా…

ఢిల్లీ విద్యుత్: కాగ్ ఆడిట్ పితలాటకం

ఢిల్లీ రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ మూడు ప్రైవేటు కంపెనీల ఆధీనంలో ఉన్నది. షీలా దీక్షిత్ రెండో ప్రభుత్వం, తన ఆధీనంలో ఉన్న విద్యుత్ పంపిణీని ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పిన పుణ్యం కట్టుకున్నారు. దానికి ఆమె చెప్పిన బృహత్కారణం విద్యుత్ ప్రసార నష్టాలను తగ్గించడం, విద్యుత్ దొంగతనాలను అరికట్టడం. ఆ రెండూ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నపుడు ఎందుకు జరగవో ఆమె చెప్పినట్లు లేదు. చెప్పినా, చెప్పకపోయినా ఈ కారణాలు చెప్పడం ద్వారా తమ ప్రభుత్వం చేతగానితనాన్నే ఆమె చాటుకున్నారు.…

ఎఎపి పాలన: లక్ష ఉద్యోగాలు, కానిస్టేబుళ్ల అవినీతి

ఢిల్లీలోని ఎఎపి ప్రభుత్వ పాలనలో మరో రెండు అసాధారణ అంశాలు నమోదయ్యాయి. నిజానికి అసాధారణం కాదు. మన ప్రభుత్వాల విధానాల ప్రజా వ్యతిరేక స్వభావంలోని సాధారణత్వం వలన ఎఎపి తీసుకుంటున్న సాధారణ చర్యలు కూడా అసాధారణంగా కనిపిస్తున్నాయి. వాహనదారుల పర్సు లాక్కొని డబ్బు వసూలు చేసిన ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాల్సిన పరిస్ధితికి కేంద్ర ప్రభుత్వాన్ని నెట్టడం ఒక అంశం. కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న లక్షకు పైగా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని విధాన నిర్ణయం తీసుకోవడం…

అమెరికా ఎంబసీ: పన్ను ఎగేస్తుంది, స్పైలను పోషిస్తుంది…

దేవయాని ఖోబ్రగదే వ్యవహారంలో భారత పాలకులు కాస్త తల ఎత్తిన ఫలితంగా ఇండియాలో అమెరికా ఎంబసీ సాగించిన చట్ట విరుద్ధ కార్యకలాపాలు కొద్దిగా ఐనా వెలుగులోకి వస్తున్నాయి. భారత దేశంలో అమెరికా దౌత్యాధికారులు, రాయబార ఉద్యోగులు, వారి అనుబంధ సంస్ధలు దశాబ్దాలుగా అనుభవిస్తున్న సౌకర్యాలకు తోడు దేశ ఆదాయానికి కూడా గండి కొట్టే కార్యాలు వాళ్ళు చాలానే చక్కబెట్టుకున్నారు. అమెరికన్ ఎంబసీకి అనుబంధంగా నిర్వహించే క్లబ్ కార్యకలాపాలకు చెక్ పెట్టిన కేంద్రం ఇప్పుడు ‘అమెరికన్ ఎంబసీ స్కూల్’…

క్వాంటమ్: ఆఫ్-లైన్ కంప్యూటర్లపైనా అమెరికా నిఘా

అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ ఆన్-లైన్ కంప్యూటర్ల పైనే కాకుండా ఆఫ్-లైన్ కంప్యూటర్లపైన కూడా నిఘా పెట్టే సామర్ధ్యం కలిగి ఉందని వెల్లడి అయింది. ఇంటర్నెట్ తో కనెక్షన్ లేకపోయినా నిఘా పెట్టగల పరికరాలను తయారు చేసుకున్న ఎన్.ఎస్.ఏ ప్రపంచవ్యాపితంగా వివిధ దేశాలకు చెందిన అత్యంత ముఖ్యమైన లక్షకుపైగా కంప్యూటర్లపై వాటి సాయంతో గూఢచర్యం నిర్వహించిందని తెలిసింది. లక్ష్యిత కంప్యూటర్లలో రేడియో తరంగాలను వెలువరించే పరికరాలను, తగిన సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ లను ఇన్ స్టాల్ చెయ్యడం…

ఎఎపి పాలన: చిల్లర వర్తకం ఎఫ్.డి.ఐకి నో

ఢిల్లీ ప్రభుత్వం పాత నిర్ణయాన్ని తిరగదోడింది. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలన్న షీలా ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. తాము ఎఫ్.డి.ఐ లకు వ్యతిరేకం కాదని కానీ తమ పార్టీ ఇచ్చిన ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రిటైల్ వర్తకం ఎఫ్.డి.ఐ చట్టం ప్రకారం బహుళ బ్రాండుల చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను అనుమతించేదీ లేనిదీ…

మరో ప్రతీకారం: అమెరికా రాయబారి వెళ్లిపోవాలని ఆదేశం

దేవయాని దేశం విడిచి వెళ్లాలని అమెరికా ఆదేశించడంతో ఇండియా మరో ప్రతీకార చర్య ప్రకటించింది. దేవయాని ర్యాంకుకు సమానమైన అమెరికా రాయబార అధికారిని ఇండియా విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఐరాసలోని భారత శాశ్వత కార్యాలయంలో దేవయాని ప్రస్తుతం నియమితురాలయిన సంగతి తెలిసిందే. ఐరాసలో భారత తరపు అధికారిగా దేవయాని పూర్తిస్ధాయి రాయబార రక్షణకు అర్హురాలు. రెండు రోజుల క్రితమే (జనవరి 8) దేవయానికి ఈ హోదా ఇస్తూ అమెరికా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దేవయాని…

సహారా: డబ్బెక్కడిదో చెప్పు లేదా సి.బి.ఐని పిలుస్తాం

సహారా కంపెనీల మోసం కేసులో సుప్రీం కోర్టు మళ్ళీ కొరడా విదిలించింది. సుప్రీం ఆదేశాల మేరకు మదుపుదారులకు 22,000 కోట్లు చెల్లించేశానని సహారా కంపెనీ చెప్పడంతో సుప్రీం కోర్టు మోసం శంకించినట్లు కనిపిస్తోంది. అంత డబ్బు ఎక్కడి నుండి తెచ్చి చెల్లించారో వివరాలు ఇవ్వాలని కోరింది. ‘డబ్బు ఎక్కడిదో మీకు అనవసరం’ అని సెబికి బదులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డబ్బు ఎక్కడిదో చెప్పాలని లేదా సి.బి.ఐ విచారణకు ఆదేశిస్తామని సహారా అధినేత సుబ్రతో రాయ్…

ఎలక్షన్ కమిషన్: భద్రతా భయంతో గూగుల్ ఒప్పందం రద్దు

భారత ఎలక్షన్ కమిషన్ ఒక భేషయిన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాల వల్ల కాని పని తనకు చేతనవునని చాటుకుంది. ఓటర్ల సేవల నిమిత్తం గూగుల్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. జాతీయ భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం ప్రకటించింది. అమెరికా, బ్రిటన్ గూఢచార సంస్ధలు ఎన్.ఎస్.ఏ, జి.సి.హెచ్.క్యూ లు ప్రపంచ ఇంటర్నెట్ వినియోగదారులందరి పైనా గూఢచర్యం సాగిస్తున్నాయని, దీనికి గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్ తదితర అమెరికన్ ఇంటర్నెట్…

జిఎస్ఎల్‌వి-డి5 విజయంతో క్రయో క్లబ్ లో ఇండియా

ఆదివారం జి.ఎస్.ఎల్.వి-డి5 ప్రయోగం విజయవంతం అయింది. దీనితో ఇండియా కూడా క్రయోజనిక్ ఇంజన్ సామర్ధ్యం గల దేశాల సరసన నిలిచింది. ఇప్పటివరకూ క్రయోజనిక్ సాంకేతిక పరిజ్ఞానం ఐదు దేశాలకు మాత్రమే సొంతం. జి.ఎస్.ఎల్.వి -డి5లో మూడో దశ కోసం అమర్చిన దేశీయ క్రయోజనిక్ ఇంజన్ విజయంవంతంగా పని చేయడంతో అమెరికా, రష్యా, జపాన్, చైనా, ఫ్రాన్స్, ఈ.యు ల సరసన ఇండియా కూడా చేరింది. గత సంవత్సరం ఆగస్టులో జరగవలసిన ప్రయోగం చివరి క్షణాల్లో ఇంధనం లీకేజీని…

రైతుల భూములు లాక్కొని తిరిగివ్వని కోకొకోల

ఉత్తర ప్రదేశ్ లో రైతులపై కోకొకోల కంపెనీ సాగిస్తున్న దౌర్జ్యన్యం ఇది. గ్రామ రైతులు ఉమ్మడిగా వాడుకునే భూమిని అక్రమంగా ఆక్రమించిన కంపెనీ రైతులు ఆందోళన చేసినా ఆక్రమించిన భూమిని వెనక్కి ఇవ్వలేదు. చివరికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కంపెనీకి నోటీసు ఇచ్చి గడువు విధించింది. గడువు ముగిసినా ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయని కోలా కంపెనీ రైతులపై ఎదురుదాడికి తెగబడింది. ఆక్రమించిన భూమిని కొన్న భూమిగా వాదిస్తోంది. కోకోకోలా నీటి చౌర్యానికి వ్యతిరేకంగా దాదాపు 15…

యూరో జోన్ ఒడిలో లాత్వియా

బాల్టిక్ రిపబ్లిక్కుల్లో ఒకటయిన లాత్వియా యూరో జోన్ తీర్ధం పుచ్చుకుంది. తద్వారా 18 వ యూరో జోన్ సభ్య దేశంగా అవతరించింది. లాత్వియా ఇప్పటికే యూరోపియన్ యూనియన్ (ఈ.యు) సభ్యురాలు. ఉమ్మడి ‘యూరో’ కరెన్సీ కలిగిన ఈ.యు దేశాలను యూరో జోన్ గా వ్యవహరిస్తారు. 20 లక్షల జనాభా కలిగిన లాత్వియాను ఆర్ధికంగా కూడా కలుపుకోవడం ద్వారా ఈ.యు ప్రభావం మరింత తూర్పుకు జరిగినట్లయింది. లాత్వియా ప్రభుత్వం యూరో జోన్ లో చేరడానికి నిర్ణయించినప్పటికీ అక్కడి ప్రజలు…

మరో వాగ్దానం: ఢిల్లీ వాసులకు సగం ధరకే విద్యుత్

ఎఎపి ప్రభుత్వం మరో వాగ్దానం నెరవేర్చింది. గృహ విద్యుత్ వినియోగదారులకు ఛార్జీలు సగానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నెలకు 400 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపింది. అంటే సబ్సిడీ ఇచ్చిన మేరకు ప్రభుత్వమే విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తుంది. 400 యూనిట్లకు పైగా వినియోగించుకునేవారు పూర్తి ఛార్జీలు చెల్లించాల్సిందే. ధరలను యధావిధిగా కొనసాగిస్తూనే సబ్సిడీ ఇవ్వడం ద్వారా కింది తరగతులకు విద్యుత్ భారాన్ని ఎఎపి ప్రభుత్వం తగ్గిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా…

ఉచిత నీరు వాగ్దానం నెరవేర్చిన కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ఎన్నికల వాగ్దానాల్లో ఒక ముఖ్యమైనదాన్ని నెరవేర్చారు. ప్రతి కుటుంబానికి ఉచితంగా రోజుకు 700 లీటర్ల త్రాగు నీరు అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీని నెరవేరుస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఢిల్లీ జల్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం మీటర్ ఉన్న ప్రతి ఇంటికీ ఇంటి వాడకం నిమిత్తం 667 లీటర్ల నీరు ఉచితంగా అందిస్తారు. ఘజియాబాద్ లోని కౌసాంబి లోని తన…

బాలి సదస్సు: పశ్చిమ దేశాల ఒత్తిళ్లకు లొంగిన ఇండియా

(బాలి సదస్సు గురించి రాసిన ఆర్టికల్ పై మరింత వివరించాలని ఉమేష్ పాటిల్ అనే పాఠకులు కోరారు. ఆ కోరికను కూడా ఈ ఆర్టికల్ నెరవేర్చగలదు. ) దోహా రౌండ్ చర్చలను పునఃప్రారంభించే రందిలో ఉన్న భారత ప్రభుత్వం ‘గేమ్ ఛేంజర్’ గా చెప్పుకుంటున్న ఆహార భద్రతా చట్టానికి తానే తూట్లు పొడిచేవైపుగా వ్యవహరించింది. ఇండోనేషియా నగరం బాలిలో ఈ నెలలో  ‘దోహా రౌండ్’ చర్చలు పునః ప్రారంభం అయ్యాయి. అభివృద్ధి చెందిన దేశాల భారీ వ్యవసాయ సబ్సిడీలను తగ్గించాలన్న డిమాండ్…