ఇండియా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిన మన్మోహన్ అమెరికాల సంబంధం – 3

ఇరాన్ విషయంలో ఇండియా అమెరికాకి అనుకూలంగా ఓటు వేయడం సరైందా, కాదా, అన్న అనుమానాల భారత సీనియర్ అధికారులను వెంటాడిన విషయం డిసెంబరు 15, 2005 నాటి కేబుల్ బయటపెట్టింది. విదేశీ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్న కె.సి.సింగ్ వ్యాఖ్యలు కేబుల్ లో ఉదరించబడ్డాయి. ఈయన సెప్టెంబరు 2005లో ఇండియా తరపున ఇరాన్ లో రాయబారిగా ఉన్నాడు. అమెరికా భావించినట్టుగా ఇరాన్ పై ప్రభావం పడేయడానికి ఇండియాకు ఇక ఏ మాత్రం అనుకూలత లేదని కె.సి.సింగ్…

ఇండియా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిన మన్మోహన్ అమెరికాల సంబంధం – 2

తర్వాత నవంబరులో జరిగిన ఐ.ఏ.ఇ.ఏ సమావేశంలో ఇరాన్ పై ఏ నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేశారు. సీక్రెట్ వర్గీకరణతో డిసెంబరు 12 న పంపిన కేబుల్లో అమెరికా రాయబారి ఇరాన్-ఇండియా ల విషయం లేవనెత్తాడు. “మధ్యప్రాచ్యం కి సంబంధించి సమగ్రమైన విధానం రూపొందించుకోవడంలో ఇండియా సమర్ధతను చూపలేక పోయింది” అని రాశాడు. (ఇరాన్ నుండి ఇజ్రాయెల్ వరకు ఉన్న అరబ్, ముస్లిం దేశాలను కలిపి ‘మధ్యప్రాచ్యం’ గా సంభోధిస్తారు.) అంటే అమెరికా, ఇజ్రాయెల్ లకు అనుకూలంగా విదేశీ…

ఇండియా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిన మన్మోహన్ అమెరికాల సంబంధం – 1

మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యు.పి.ఏ కూటమి అధికారం చేపట్టినప్పటినుండీ అమెరికా దోస్తీ కోసం ఇండియా వెంపర్లాడింది. అమెరికాతో “వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం” కుదుర్చుకోవడం వలన భారత ప్రజల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం వికీలీక్స్ బయట పెట్టిన “డిప్లొమేటిక్ కేబుల్స్” ద్వారా వెల్లడవుతున్నది. అమెరికా, తన ప్రయోజనాలను నెరవేర్చడం కోసం తన రాయబారుల ద్వారా, ఐ.ఏ.ఇ.ఏ, ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ వేదికల ద్వారా ఇండియాపై నిరంతరం ఎలా ఒత్తిడి చేసిందీ తెలుసుకుంటున్న కొద్దీ ఒళ్ళు గగుర్పొడుస్తోంది. అమెరికా…

ఇటలీ అమెరికా సంబంధాలను దెబ్బతీసిన ఇండియా శాటిలైట్ ప్రయోగం -వికీలీక్స్

ఇండియాలో మానవ నిర్మిత ఉపగ్రహాన్ని (శాటిలైట్) ప్రయోగిస్తే అది ఇటలీ, అమెరికాల సంబంధాలను సంవత్సరం పాటు వేడెక్కించింది. మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లుగా ఇటలీ అమెరికాల సంబంధాల బలం ఇండియాలోని రాకెట్ ప్రయోగ కేంద్రం శ్రీహరి కోట లో నిక్షిప్తం అయి ఉండటం నిజంగా ఆశ్చర్యకరమే. ఇటలీలోని అమెరికా రాయబారి అమెరికా ప్రభుత్వానికీ, ఇండియాలోని అమెరికా రాయబారికీ మే 26, 2007 తేదీన పంపిన కేబుల్ లో ఈ వివరాలు ఉన్నాయి. ఏప్రిల్ 23, 2007…

అమెరికా మేలు కోసం కేబినెట్ మంత్రుల్ని మార్చిన భారత ప్రధాని -వికీలీక్స్

“భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అమెరికా ఇష్టాయిష్టాలకు అనుగుణంగా కేబినెట్ మంత్రులను నియమించడం, మార్చడం చేస్తున్నాడు” ఇది ఏ వామపక్షాలో, విప్లవకారులో చేసిన ఆరోపణ కాదు. ఇండియాలో అమెరికా రాయబారిగా నియమితుడైన డేవిడ్ మల్ఫోర్డ్ అమెరికా స్టేట్ డిపార్ట్ మెంటుకు పంపిన ఓ కేబుల్ (టెలిగ్రాం ఉత్తరం) సారాంశం. భారతదేశ విప్లవ పార్టీలు భారత పాలకులు భారత ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా తమకు ఎంగిలి మెతుకులు విసిరే విదేశీ పాలకుల ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని…

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ‘ఓటుకు నోటు’ సర్వసాధారణం -వికీలీక్స్

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో నోట్లతో ఓట్లు కొనడం సర్వసాధారణమని అమెరికా డెప్యుటీ రాయబారి అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ కి పంపిన కేబుల్ లో పేర్కొన్నాడు. 2009 లోక్ సభ ఎన్నికల్లో రాజకీయ నాయకులు వారి అనుచరులు డబ్బులు పంచామని రాయబారి దగ్గర అంగీకరించినట్లుగా వికీలీక్స్ బైట పెట్టిన కేబుల్ ద్వారా తెలిసింది. నోట్లే కాకుండా వినియోగ సరుకులు, సేవలు కూడా ఓట్ల సంపాదనకి వినియోగించారు. చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఏక్టింగ్ ప్రిన్సిపల్ ఆఫీసర్ గా పనిచేసిన…

‘ది హిందూ’ చేతిలో ఇండియాకి సంబంధించిన ‘వికీ లీక్స్’ డాక్యుమెంట్లు

అమెరికా తరపున ప్రపంచవ్యాపితంగా నియమించబడిన రాయబారులు తాము నియమించబడిన దేశాల్లో గూఢచర్యం నెరుపుతూ సంపాందించిన వివరాలను కేబుల్ ద్వారా అమెరికా స్టేట్ డిపార్ట్ మెంటుకు పంపిస్తారు. 1960 నుండి 2010 ఫిబ్రవరి వరకూ అలా పంపిన కేబుల్స్ ‘వికీ లీక్స్’ సంస్ధకు అందిన విషయం తెలిసిందే. వికీ లీక్స్ సంస్ధ తనకు అందిన ‘డిప్లొమాటిక్ కేబుల్స్’ ను 2010 నవంబరు నెలాఖరు నుండి తన వెబ్ సైట్ లో ప్రచురిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు ఇండియాకు…

జులియన్ అస్సాంజ్ అప్పగింత కేసులో వాదనలు ప్రారంభం

లైంగిక అత్యాచారం కేసులో జులియన్ ను ఇంగ్లండ్ నుండి స్వీడన్ కు అప్పగించాలంటూ స్వీడన్ పోలీసులు బనాయించిన కేసులో వాదనలు సోమవారం ఫిబ్రవరి 7 నుండి ప్రారంభమయ్యాయి. జులియన్ లాయర్లు రెండు ప్రధాన అంశాల మీద ఆధారపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకటి సాంకేతిక కారణాలు కాగా రెండోది మానవ హక్కుల ఉల్లంఘన. స్వీడన్ పోలీసులు ఇంతవరకు జులియన్ పైన ఛార్జ్ ఏ నేరమూ మోపలేదు. లైంగిక అత్యాచారం ఆరోపణలపై అతనిని ప్రశ్నించటానికి మాత్రమే తమకు అప్పంగించాలని స్వీడన్ పోలీసులుకోరుతున్నారు.…