కల్లోల జలాలు -ద హిందూ…

  ఇండస్ నీటి ఒప్పందం (IWT) పైన సమావేశం నిర్వహించి, పాకిస్తాన్ కు MFN (మోస్ట్ ఫెవర్డ్ నేషన్ -అత్యంత సానుకూల దేశం) హోదా ఇవ్వడం పైన మరో సమావేశాన్ని వచ్ఛే వారం ఏర్పాటు చేయాలని తలపెట్టడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, యూరి దాడికి ప్రతిస్పందనగా మిలటరియేతర అవకాశాలన్నింటిని పరిశీలిస్తున్నామన్న సంకేతాలను పంపారు. “నెత్తురు, నీళ్లు కలిసి మెలిసి ప్రయాణం చేయలేవు” అని ఆయన అన్నట్లుగా తెలుస్తున్నది. అయినప్పటికీ, సమావేశం తర్వాత, కనీసం ప్రస్తుతానికి…

పాక్ పై ఇండియా ఎకనమిక్ వార్!

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
యూరి దాడికి ప్రతీకారంగా ఇండియా, పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించింది; భౌతిక మిలటరీ యుద్ధం కాదు, ఆర్ధిక యుద్ధం! అమెరికా నుండి భారత ప్రధాని నరేంద్ర మోడీ బాగానే పాఠాలు నేర్చుకుంటున్నారు సుమీ! ఎకనమిక్ వార్ అని భారత ప్రభుత్వం సూచిస్తున్న చర్యలలో కొన్ని అంశాలు:  1. సాప్తా ఒప్పందం కింద ఇచ్చిన రాయితీలను ఉపసంహరించడం: సాప్తా (SAPTA ) అంటే దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం అని అర్ధం. సార్క్ కూటమి…

అమెరికా ఇక ప్రపంచ పోలీసు కాజాలదు -ట్రంప్

  తదుపరి అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య మొదటి చర్చ అమెరికాలో ప్రారంభం అయింది. అమెరికా ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగబోయే లోపు అధ్యక్ష పదవికి పోటీ లో ఉన్న అభ్యర్థులు బహిరంగ చర్చ (డిబేట్) లో మూడు సార్లు పాల్గొనవలసి ఉంటుంది.   ఈ చర్చలలో అభ్యర్థులు తమ ఆర్ధిక, రాజకీయ, విదేశాంగ విధానాలతో పాటు దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తాము ఎలా పరిష్కరిస్తామో…

సిక్సర్ సిద్దు: బ్యాట్ లేకుండా బ్యాటింగ్

పాపం నవ జ్యోత్ సింగ్ సిద్ధూ! పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుదామని ఆశపడి ఏ‌ఏ‌పి లో జొరబడబోయారు. కానీ సి‌ఎం పదవి అప్పగించేందుకు ఏ‌ఏ‌పి ఒప్పుకోకపోవడంతో ఆవాజ్-ఏ-పంజాబ్ పేరుతో కూటమి పెడుతున్నట్లు ప్రకటించారు. కానీ తమ ఫ్రంటు ఒక ఫోరంగా మాత్రమే ఉంటుందని ఎన్నికల్లో పోటీ చేయబోదని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచేశారు. తాను పార్టీ పెడితే అకాలీ వ్యతిరేక ఓట్లు చీలి మళ్ళీ అకాలీకే లాభిస్తుందని అందుకని పోటీ చేయడం లేదని ప్రకటించారు. ప్రకటించిన కారణం…

జర్మనీ సిక్కులపై ఇండియా కోసం గూఢచర్యం, అరెస్టు!

ఆయన జర్మనీ దేశస్ధుడే. వయసు 58 యేళ్ళు, ఉద్యోగం ఇమిగ్రేషన్ ఆఫీస్ లో. తన ఉద్యోగం ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను ఒక (పేరు వెల్లడి కాని) భారత ప్రభుత్వ గూఢచార సంస్ధ కోసం గూఢచర్యం చేస్తూ పట్టుబడిపోయాడు. విదేశీ గూఢచార సంస్ధల తరపున లేదా ఆ సంస్ధల కోసం గూఢచర్యం చేయడం జర్మనీలో నేరం. ఒక్క జర్మనీలోనే కాదు, ఏ దేశంలోనైనా అది నేరమే. జర్మనీలో అలాంటి వారికి కనీసం 10 యేళ్ళు జైలు శిక్ష…

ఏ‌పిని ప్రత్యేకం చేయడం -ద హిందు ఎడిట్…

‘ప్రత్యేకం’ అయినది ఏ విధంగా ప్రత్యేకం అవుతుంది? విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం నుండి ఆపన్న హస్తం అందించాల్సిన అగత్యం ఏర్పడింది అనడం ఎన్నడూ సందేహం కాలేదు. కానీ రాష్ట్రం ఏ రీతిలో ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్నదన్న అంశంలోనే కృషి జరగవలసి వచ్చింది. దానిని ప్రత్యేక తరగతి హోదా కలిగిన రాష్ట్రంగా ప్రకటించవచ్చా లేక ప్రత్యేక తరగతి హోదాకు తప్పనిసరిగా నెరవేర్చవలసిన అవసరాలను తీర్చే బాధ్యత లేని ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ వరకు…

సింగూరు తీర్పు: వ్యవసాయమా, పరిశ్రమలా? -2

రైతులు కలకత్తా హై కోర్టుకు వెళ్ళినప్పటికి టాటా కంపెనీ ఫ్యాక్టరీ నిర్మాణం కొనసాగించింది. జనవరి 18, 2008 తేదీన తీర్పు ప్రకటిస్తూ కలకత్తా హై కోర్టు టాటా కంపెనీకి వత్తాసు వచ్చింది. సింగూరు భూముల స్వాధీనం చట్టబద్ధమే అని ప్రకటించింది. దానితో రైతులు, వారి తరపున కొన్ని ఎన్‌జి‌ఓ సంస్థలు హై కోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మమతా బెనర్జీ మరోసారి కారు ఫ్యాక్టరీ ముందు నిరవధిక ధర్నాకు దిగడంతో…

సోవియట్ రష్యాయే మెరుగు -మాజీ సోవియట్ రాజ్యాలు

  USSR విచ్చిన్నం అయినప్పుడు ఎంతో మంది కమ్యూనిస్టు విద్వేషులు రాక్షసానందాన్ని అనుభవించారు. పెట్టుబడిదారీ పశ్చిమ దేశాల ప్రభుత్వాలు పండగ చేసుకోగా పశ్చిమ దేశాలను గుడ్డిగా ఆరాధించే వాళ్ళు తాము ఎందుకు ఆనందిస్తున్నామో తెలియకుండానే పిచ్చి ఆనందం పొందారు. గట్టిగా అడిగితె సోవియట్ రష్యా అంటే ‘ఇనప తెర’ అని, అక్కడ ‘వ్యక్తి స్వేచ్ఛ’ మృగ్యం అనీ, ‘నియంతృత్వ పాలన’ అనీ… ఇంకా ఇలాంటివి ఏవేవో అక్కడా ఇక్కడా విన్నవి అప్పజెపుతూ తమకే అన్ని తెలిసిపోయాయన్న ఫోజులు…

నెం. 1 టెస్ట్ క్రికెట్ టీం: పాకిస్తాన్ -కార్టూన్

    “అబ్బే, పాకిస్తాన్ టాప్ టీం అని అన్నది నేను కాదు. నా పైన దేశ ద్రోహం పెట్టకండి దయ చేసి…”   *********   హిందుత్వ కాపలాదారుల మానక స్ధితిని ఈ కార్టూన్ సరిగ్గా వెల్లడి చేస్తున్నది.    హిందుత్వ మూకలు పాల్పడుతున్న విజిలెంటిజం ఆ మూకలతో మొదలై వారితోనే ముగిసేది కాదు. అది నేరుగా సంఘ్ పరివార్  అత్యున్నత నాయకత్వం నుండి కింది స్ధాయి కార్యకర్త వరకు ప్రవహిస్తూ వస్తోంది. అందుకే ప్రధాన…

‘పాకిస్ధాన్ నరకం కాదు’ అన్నా దేశద్రోహమేనా?

  “అసహనం ఎక్కడుంది?” అని ప్రశ్నిస్తూ  ఢిల్లీలో ఊరేగింపు నిర్వహించిన హాలీ వుడ్ నటుడు ‘అనుపమ్ ఖేర్’ ఓ సారి కర్ణాటక వఛ్చి చూడాలి. హిందుత్వ మూకలు ఏమి చేసినా అది దేశ భక్తే అనో లేదా సహన సహితమే అనో ఆయన తేల్చిపారేస్తే తప్ప, ‘అసహనం’ రుచి ఏమిటో ఆయనకు తెలుస్తుంది.  “పాకిస్తాన్ నరకం ఏమి కాదు. అది ప్రజలు నివసించే దేశం” అని రాజకీయవేత్తగా మారిన ఒక సినిమా నటి ప్రకటించారు. “పాకిస్ధాన్ అంటే…

మెడల్స్ క్రెడిట్ ఆటగాళ్లదేనా? -కార్టూన్

యూ‌పి‌ఏ ఏలుబడిలో ఎలాంటి సానుకూల పరిణామం జరిగినా అది రాహుల్ గాంధీకో, సోనియా గాంధీకో క్రెడిట్ అయ్యేది. ఏమన్నా (ఒప్పుకోవలసిన) తప్పులు జరిగితే మాత్రం అవి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఖాతా లోకి వెళ్లిపోయేవి. ఎన్‌డి‌ఏ-2 ఏలుబడిలోనూ అంతే. పాత్రధారులు మారారు గానీ సీన్ మారలేదు. జి‌డి‌పి వృద్ధి రేటు పెరిగినా, చమురు ధరలు తగ్గి ద్రవ్యోల్బణం తగ్గినా, ఉప ఎన్నికల్లో గెలిచినా… అవన్నీ మోడి గాలి + అమిత్ షా చాణక్య ఎత్తుల ఫలితంగానే…

అమరావతి రాజధాని ప్లాట్ల కేటాయింపు ఒక మోసం

– అమరావతి రాజధాని ప్లాట్ల కేటాయింపు ఒక మహామోసం //.….. మరో మోసానికి తెరతీసిన చంద్రబాబు ప్రభుత్వం..! “తాత్కాలిక కేటాయింపు” అంటూ మరో లిటిగేషన్. ! >> ప్రస్తుతం కేటాయించిన ప్లాట్లపై భూయజమానులకు ఎటువంటి యాజమాన్య హక్కూ ఉండదు..>> రాజధానికోసం “ల్యాండ్ పూలింగ్” పేరిట సేకరించిన భూముల్లో, భూయజమానులకు ప్లాట్లు కేటాయింపులో బయటపడ్డ మరోమోసం.. ఇది ముమ్మాటికీ నయవంచనే..!!  మిగిలిన భాగం కోసం “తిరుమల ప్రసాదీయం” బ్లాగుకు కింది లంకె ద్వారా వెళ్ళండి. అమరావతి రాజధాని ప్లాట్ల కేటాయింపు…

గో రక్షణ క్రిమినల్ ముఠాలను శిక్షించరా?!

“అహో! మొదట ఈ గందరగోళమునందేల ప్రవేశించవలే?! ప్రవేశించితిపో…!” ********* ఇంతకీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నోరు తెరవడం కూడా మహా భాగ్యమే అన్నమాట! దేశంలో చెలరేగుతున్న ఆందోళనలకు, మండుతున్న మంటలకు ప్రధాన మంత్రి స్పందన ‘ప్రధాని కూడా స్పందించారు’ అని చెప్పుకోవడానికా లేక ఆ స్పందన కార్యరూపం లోకి దాల్చుతుంది అని జనం నమ్మడానికా? “ప్రధాని స్పందించారు. ఇంకేం కావాలి? స్పందనపై గొడవ చేయడం ఎందుకు?” అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు ప్రశ్నిస్తుంటే…

టర్కీ సైనిక కుట్ర: ఇండియా, మోడి కనెక్షన్!

[Disclaimer: టర్కీ సైనిక కుట్రకు, ఇండియా & మోడిలకూ మధ్య కనెక్షన్ ఉన్నదని చెప్పడం ఈ ఆర్టికల్ ఉద్దేశం కాదు.] జులై 15, 16 తేదీల్లో టర్కీలో సైనిక కుట్ర చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జరిగింది కుట్ర కాదనీ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, అధికారాలను తన చేతుల్లో కేంద్రీకరింపజేసుకోవడానికి తనపై తానే కుట్ర చేయించుకుని ఆ నెపాన్ని విరోధులపై నెడుతున్నాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజానికి కుట్ర అనంతరం జరిగిన, జరుగుతున్న పరిణామాలు రెండో అంశానికే…

అరుణాచల్: మాజీ ముఖ్యమంత్రి ఆత్మహత్య

గత ఏడెనిమిది నెలలుగా కాంగ్రెస్, బిజెపిల పదవీ రాజకీయాలకు కేంద్రంగా వార్తల్లో నిలిచిన అరుణాచల్ ప్రదేశ్, అనూహ్య సంఘటనను చవి చూసింది. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో తిరుగుబాటుకు నేతృత్వం వహించి, అనంతరం బిజెపి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి కలిఖో పల్, ముఖ్యమంత్రి నివాసంలో శవమై కనిపించాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు తెలియజేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కలిఖో పల్ ఆత్మహత్య చేసుకున్నారని రాష్ట్ర పోలీసులు ప్రకటించారు. ఆయన  తాడుతో మెడకు ఉరి వేసుకుని…