బీహార్: మోడి ర్యాలీ స్ధలిలో బాంబు పేలుళ్లు

పాత మిత్రుడి రాష్ట్రాన్ని పలకరించడానికి వెళ్ళిన నరేంద్ర మోడిని బాంబు పేలుళ్లు ఆహ్వానించాయి. పాట్నాలో మోడి ప్రసంగించవలసిన వేదిక వద్దనే వరుసగా 6 బాంబు పేలడంతో ఐదుగురు చనిపోగా అరవై మందికి పైగా గాయపడ్డారని పత్రికలు చెబుతున్నాయి. పేలుళ్ళ పట్ల మోడి విచారం వ్యక్తం చేయగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రధాన మంత్రి ఆయనకు ఫోన్ చేసి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. పాలక జనతా దళ్ (యు)…

మన్మోహన్ సి.బి.ఐ ని ఆహ్వానించారు -కార్టూన్

బొగ్గు కుంభకోణం విషయంలో సి.బి.ఐ తనను విచారించదలుచుకుంటే దానికి అడ్డంకులేమీ లేవని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తొట్ట తొలిసారి నిన్న ప్రకటించారు. 2జి కుంభకోణంలో అనుమానాలు కమ్ముకున్నా ‘నాకు తెలియదు, నాకు సంబంధం లేదు’ అంటూ తప్పించుకున్న ప్రధాని బొగ్గు కుంభకోణంలో ‘విచారణకు సిద్ధం’ అని ప్రకటించినందుకు దేశ ప్రజలు సంతోషించాలా లేక ఎన్ని ఆరోపణలు వచ్చినా చూరు పట్టుకుని వేలాడుతున్నందుకు సిగ్గుపడాలా? మన్మోహన్ సింగ్, భారత దేశపు అత్యున్నత నేర విచారణ సంస్ధకు సమర్పించిన…

అబద్ధాలాడొద్దు! -అమెరికాతో జర్మనీ

జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా సెల్ ఫోన్ సంభాషణలను తాము వినడం లేదన్న అమెరికా వాదనను జర్మనీ కొట్టిపారేసింది. ‘అబద్ధాలాడొద్దు’ అని కసిరినంత పని చేసింది. తమ ఛాన్సలర్ ఫోన్ సంభాషణలను అమెరికన్లు వింటున్నారని చెప్పడానికి తమ వద్ద ‘నూతన సాక్ష్యాలు’ ఉన్నాయని తేల్చి చెప్పింది. జర్మనీ చట్టాలను ఉల్లంఘించడం లేదని చెబుతున్న ఎన్.ఎస్.ఏ వాస్తవం చెప్పడం లేదని జర్మనీ ఛాన్సలర్ వ్యవహారాల మంత్రి రొనాల్డ్ పొఫల్లా తెలిపారు. అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ అనేక దేశాల అధినేతల…

పురచ్చి తలైవి రెండాకులు ఎక్కడ పూసేను? -కార్టూన్

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలకు ‘అందని ద్రాక్ష’ ఆ ద్రాక్ష పండు భవిష్యత్తులో ఎవరికి తీపిని ఇస్తుందో ఎవరికి పుల్లదనాన్ని మిగుల్చుతుందో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. 2జి కుంభకోణం దరిమిలా ఎ రాజా, దయానిధి మారన్ లపై నమోదయిన సి.బి.ఐ కేసులు డి.ఎం.కె పార్టీని అవాంఛనీయ పార్టీగా అందరూ చూస్తుండగా అన్నా డి.ఎం.కె ఆకర్షణీయంగా మారిపోయింది. పార్టీ అధినేత్రి, పురచ్చి తలైవి, జయలలిత తన రెండాకుల గుర్తును ఏ కూటమికి కానుకగా ఇస్తుందన్నది…

ఎలాగైతేనేం, ప్రధానీ నెంబర్ 1 అయ్యారు! -కార్టూన్

భారత దేశంలో అత్యున్నత అధికార పీఠం ప్రధాన మంత్రి పదవి. రాష్ట్రపతిని ప్రధమ పౌరుడిగా చెప్పినా రాజ్యాంగం ఆయన చేతుల్లో అధికారాలు ఏమీ ఉంచలేదు. ఉన్న అధికారాలు అలంకార ప్రాయం మాత్రమే. కేబినెట్ సలహాను పాటించడమే ఆయనకి ఉన్న అధికారం. ప్రతి చట్టం పైనా ఆయన సంతకం అయితే ఉండాలి గానీ, నిర్ణయం మాత్రం కేబినెట్, దాని అధినేత అయిన ప్రధాని చేతుల్లోనే ఉంటుంది. అంటే ఆచరణ, అధికారాల రీత్యా ప్రధాన మంత్రే నెంబర్ 1. కానీ…

డబ్బు పరుపు కల తీర్చుకున్న మార్క్సిస్టు కాంట్రాక్టర్

అవటానికి ఆయన మార్క్సిస్టు పార్టీ నాయకుడు. ఆయన కలలు మాత్రం డబ్బు చుట్టూ తిరుగుతాయి. బాగా డబ్బు సంపాదించాలని, సుఖంగా బతకాలనీ దాదాపు అందరూ కనే కలే కావచ్చు. కానీ సమాజాన్ని మార్చడానికి కంకణం కట్టుకున్నవారు ఎలాంటి కలలు కనాలి? విప్లవం వచ్చేసిందన్న కల కాకపోయినా కనీసం విప్లవోద్యమం పురోగమిస్తోందన్న కల లేదా కోరిక కలిగి ఉండాలి. కానీ త్రిపుర సి.పి.ఏం పార్టీ నాయకుడు మాత్రం ఏనాటికయినా డబ్బు పడక పై పడుకోవాలన్న కాలతో ఎన్నాళ్లుగానో వేగిపోతున్నాడట.…

విభజన అధికారం పార్లమెంటుదే – ప్రొ.కె.నాగేశ్వర్ (10టివి)

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్ కొన్ని ముఖ్యమైన విషయాలను తెలిపారు. కార్మికులు, ఉద్యోగుల భాగస్వామ్యంతో ఏర్పడిన 10టి‌విలో ఆయన నిన్న మాట్లాడుతూ రాష్ట్రాల విభజనపై రాజ్యాంగం ఏమి చెబుతోందో వివరించారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ తలా ఒక ప్రకటన చేస్తూ జనాన్ని రకరకాలుగా మభ్య పెడుతూ  గందరగోళంలో పడేస్తున్న పరిస్ధితుల్లో నాగేశ్వర్ గారు ఇచ్చిన వివరణ చాలా ఉపయోగంగా ఉంది. అందులో కొంత భాగం: ” ప్రస్తుతం రాష్ట్ర విభజనపై నేతలు…

కాణీ విలువ లేని చంద్రబాబు దీక్ష? -కార్టూన్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఆమరణ దీక్ష ఎందుకు చేస్తున్నట్లు? రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి నిరసనగా దీక్ష చేస్తున్నట్లు ఆయన ఒకసారి చెప్పుకున్నారు. కానీ ఆ దీక్షకు నిర్దిష్ట డిమాండ్ అంటూ ఏమీ లేదు. దీక్ష చేస్తున్నాను అనిపించుకుని సీమాంధ్ర ప్రజల్లో ఓటు విలువ పొందడానికే ఆయన దీక్ష తలపెట్టారన్నది అర్ధం అయ్యే విషయమే. కానీ ఉద్దేశ్యం ఏదయినా దీక్షకు ఒక డిమాండ్…

రాష్ట్రపతి పాలన ఎత్తుగడ? -కత్తిరింపు

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, సీమాంధ్ర ఉద్యమం, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వక అయోమయ సృష్టి ఇత్యాది అంశాలపై కాస్త వాస్తవానికి దగ్గరగా విశ్లేషణలు, విమర్శలు, సూచనలు ప్రచురిస్తున్నది ఆంధ్ర జ్యోతి దిన పత్రికే అనుకుంటాను. సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి ని ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఇతర పత్రికలు, ఛానెళ్ల కంటే ఒక అడుగు ముందే ఉన్నది ఆ పత్రిక. ‘రాష్ట్రపతి పాలన ఎత్తుగడ?’ శీర్షికతో వచ్చిన ఈ విశ్లేషణ ఈ రోజు (అక్టోబర్ 11, 2013) జ్యోతిలో…

లక్షల దళిత నాయకుల్ని సృష్టించే మంత్రదండం! -కార్టూన్

రాహుల్: ఒకరో ఇద్దరో కాదు, దళితుల కోసం లక్షల నాయకులు ఉద్భవించాలి… రాహుల్ నీడలోని కాంగ్రెస్ నేత: ఆ సూత్రం మనక్కూడా వర్తించడం ఎలాగో… – ఒకరూ, ఇద్దరూ కాదు; పదులూ, వందలూ కూడా కాదు; వేలు అసలే కాదు; ఏకంగా లక్షలాది దళిత నాయకుల్ని తయారు చేసే మంత్రదండం ఉన్న సంగతి ఎవరికైనా తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. ఆ మంత్రదండం మన యువ రాజా రాహుల్ గాంధీ వద్ద భద్రంగా ఉంది. ఆయన దాన్ని త్వరలో…

రాష్ట్ర విభజన: గతితర్క వివరణ –కార్టూన్

రాహుల్ గాంధీకి ప్రధాని పదవిని పళ్లెంలో పెట్టి అప్పగించడానికే సోనియా గాంధీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకు తలపెట్టిందని కానీ సీమాంధ్ర ఉద్యమం వలన అది ఆమెకు కష్టంగా మారిందని ఈ కార్టూన్ సూచిస్తోంది. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత టి.ఆర్.ఎస్ తో పొత్తు లేదా విలీనం ద్వారా తెలంగాణలో, వైకాపాతో పొత్తు లేదా విలీనం లేదా ఎన్నికల అనంతర కూటమి ద్వారా సీమాంధ్రలోనూ మెజారిటీ లోక్ సభ స్ధానాలను గెలుచుకోవచ్చని, తద్వారా రాహుల్ గాంధీ ని ప్రధానిగా…

సి.ఎం పై మాజీ డి.జి.పి దినేష్ రెడ్డి సంచలన ఆరోపణలు

తన పదవీ కాలాన్ని పొడిగించాలని విజ్ఞప్తి చేసి విఫలమయిన మాజీ డి.జి.పి దినేష్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన సంచలన రీతిలో ఆరోపణలు చేశారు. పదవీ కాలాన్ని పొడిగించలేదన్న అక్కసుతోనే అబద్ధపు ఆరోపణలకు దిగారని మంత్రులు దినేష్ ఆరోపణలను తిప్పి కొట్టడానికి ప్రయత్నించినప్పటికీ వారి సమాధానాల్లో పెద్దగా విషయం లేదు. దానితో కిరణ్ కుమార్ రెడ్డి పనితీరుపై పలు అనుమానాలు ముసురుకున్నాయి. ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి దినేష్ కృషి చేశారని తెలంగాణ వాదులు…

తెలంగాణ: 10 మంది మంత్రుల కమిటీ, నెలన్నర గడువు

  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 10 మంది కేంద్ర మంత్రులతో ‘మంత్రుల కమిటీ’ ని ఏర్పాటు చేయనున్నట్లు హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఆర్ధిక, న్యాయ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రులతో పాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. సరిహద్దుల నిర్ణయం, ఆస్తులు-అప్పుల పంపకం, నీటి పంపకం తదితర అంశాలను ఈ కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి తగిన సూచనలు, సిఫారసులు చేయాలి. ఆరు వారాల గడువులో…

కేబినెట్ ఆమోదంతో తెలంగాణ ప్రక్రియ ప్రారంభం

ఎట్టకేలకు తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. గురువారం సాయంత్రం సమావేశమయిన కేంద్ర కేబినెట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై హోమ్ మంత్రి ప్రవేశ పెట్టిన నోట్ ను తీర్మానంగా ఆమోదించింది. టి.వి ఛానెళ్లు చెబుతున్నదాని ప్రకారం సి.డబ్ల్యూ.సి తీర్మానాన్ని కేబినెట్ యధాతధంగా ఆమోదించింది. హైద్రాబాద్ 10 యేళ్లపాటు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. కొత్త రాజధాని ఎక్కడన్నదీ కేబినెట్ నియమించే మంత్రుల బృందం నిర్ణయిస్తుందని హోమ్ మంత్రి సుశీల్ కుమార్…

కొత్త బట్టలు కాదు, కొత్త రాజునే నేయగల నేర్పరులు! -కార్టూన్

కొత్త బట్టలా? కాదులే – ఇది మన కొత్త మహారాజు గారిని తయారు చేయడానికి… – మహారాజు గారి కొత్త బట్టల కధ అందరికీ తెలిసిందే. తమ పదవులకు, హోదాకు తగని వ్యక్తులకు తప్ప అందరికీ కనిపించే బట్టలు నేసి తెస్తామన్న నేతగాళ్ల చేతిలో రాజు, మంత్రి, వారి పరివారం అంతా ఫూల్స్ అయిన కధను కార్టూనిస్టు జ్ఞప్తికి తెస్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నేతలు నేస్తున్నది యువరాజు వారి కొత్త బట్టలను కాదు. పాత మహారాజు…