మోడి వేవ్ అయింది, ఇక బేడీ వేవ్ మిగిలింది!

బి.జె.పికి సంబంధించి ఢిల్లీ ఎన్నికల ప్రచార సరళిని పట్టిచ్చే కార్టూన్ ఇది. లోక్ సభ ఎన్నికలకు చాలా రోజుల ముందు నుండే దేశంలో మోడి గాలి వీస్తోందని హిందూత్వ అభిమాన గణం విస్తృతంగా ప్రచారం మొదలు పెట్టింది. కొన్ని ప్రాంతీయ, జాతీయ పత్రికలు, ఛానెళ్లు కూడా దానికి సహకరించాయి. ‘తెలుగు దేశం’లో కూడా ప్రధాన పత్రికలు కొన్ని ‘గుజరాత్ అభివృద్ధి నమూనా’ను ఆకాశానికి ఎత్తేస్తూ వరుసగా స్టోరీలు ప్రచురించాయి. సామాజిక వెబ్ సైట్లలోనైతే ఇక చెప్పనవసరం లేదు.…

ఢిల్లీ ఎన్నికలు: ఫోటోలు, కార్టూన్లు, ఫిర్యాదులు…

ఢిల్లీ ఎన్నికలు వేడెక్కాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో సహ ఉద్యమకారిణి కిరణ్ బేడీని తమ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బి.జె.పి ప్రకటించింది. ఈ దెబ్బతో ఏఏపి నేత కేజ్రీవాల్ దూకుడుకు పగ్గం వేయవచ్చని బి.జె.పి భావించి ఉండవచ్చు. కానీ వాస్తవంలో కిరణ్ బేడి అభ్యర్ధిత్వం సానుకూలం కావడం అటుంచి ప్రతికూలం అవుతున్నట్లుగా పత్రికల వార్తల ద్వారా తెలుస్తోంది. ఈ నేపధ్యంలో బి.జె.పి అతిరధ మహారధులందరూ రంగంలోకి దిగి చెమటోడ్చుతున్నారు. ఎన్నికల పోటీ పోటాపోటీగా జరుగుతుందని పార్టీలు భావిస్తుండడంతో ప్రచారంలో…

బి.జె.పి రోజులివి! -కార్టూన్

“అమిత్ షాజీ! మన సొంత తెల్లపావుల భావాలను కాస్త ఉపశమనపరచండి…” ********* ఇప్పుడు దేశంలో భారతీయ జనతా పార్టీ ఆకర్షక కేంద్రంగా మారింది. ఇతర పార్టీల్లోని ఛోటా మోటా నాయకులతో పాటు బడా నేతలు సైతం బి.జె.పిలో చేరిపోవడానికి ఆతృత ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్షంలోని ప్రత్యర్ధులు అనేకులు తమ సొంత రంగు మార్చుకుని బి.జె.పి రంగు పూసుకుంటున్నారన్న సంగతిని చదరంగం బల్ల ద్వారా కార్టూనిస్టు ప్రతిభావంతంగా చెప్పారు. ఒకప్పుడు అంటరాని పార్టీగా ఉన్న బి.జె.పి ఆకర్షక పార్టీగా మారడానికి…

గాల్లోంచి ఢిల్లీ పీఠంపైకి బేడీ -కార్టూన్

“ఇదేదో మన పీకల మీదికే వచ్చేట్లుంది….” ************ అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం పస ఏమిటో, అది ఎందుకు ఎవరి ప్రోద్బలంతో మొదలై చివరికి చప్పగా ముగిసిందో జనానికి బహుశా ఇప్పుడు తెలిసి ఉండాలి. అలాగే, అవినీతి వ్యతిరేక ఉద్యమం లోక్ పాల్ చట్టాన్ని సాధించలేని పరిస్ధితుల్లో ఇక రాజకీయాల్లోకి దిగుదామని కొత్త పార్టీ పెడదామని అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించినప్పుడు ఆయన కొలీగ్ కిరణ్ బేడీ ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకించారో కూడా ఇప్పుడు జనానికి…

సునంద పుష్కర్: ఆత్మహత్య కాదు హత్యే!

కేంద్ర మాజీ మంత్రి, ఐరాస సెక్రటరీ జనరల్ కి పోటీ పడిన భారతీయుడు శశిధరూర్ మరోసారి చిక్కుల్లో పడ్డట్లు కనిపిస్తోంది. ఆయన భార్య సునంద పుష్కర్ ది ఆత్మహత్య కాదని, ఎవరో ఆమెకు విషం ఇచ్చి చంపారని ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు సునంద పుష్కర్ మరణం విషయమై హత్య కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఆదేశించారు. రష్యాలో తయారయిన విషం ఇచ్చి సునందను చంపారని, ఈ సంగతి శశి ధరూర్ కు…

సి.బి.ఐ విశ్వసనీయత ప్రశ్నార్ధకం! -ది హిందు (అమిత్ షా తీర్పు)

(1.1.2015 తేదీన ది హిందూలో ప్రచురితం అయిన ‘CBI’s credibility impugned’ సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్) ********* సోహ్రాబుద్దీన్ షేక్ బూటకపు ఎన్ కౌంటర్ కేసులో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, గుజరాత్ మాజీ మంత్రి అమిత్ షా ను ముంబై లోని ప్రత్యేక కోర్టు విముక్తి చేయడం బి.జె.పికి ఉత్సాహం అందిస్తుంది. కానీ సి.బి.ఐ కి మాత్రం గట్టి ఎదురు దెబ్బ. తన రాజకీయ యాజమానులను సంతృప్తిపరిచేందుకు ఎప్పుడూ ఆతృతగా ఉండే సి.బి.ఐ తన…

షొరాబుద్దీన్ ఎన్ కౌంటర్: ఓ పనైపోయింది!

‘గజం మిధ్య పలాయనం మిధ్య’ అని ముంబైలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సి.బి.ఐ కోర్టు తీర్పు చెప్పేసింది. కేసులో అన్యాయంగా ఇరికించారని, తనపై కేసు కొట్టివేయాలని అమిత్ షా విన్నవించుకోగా ‘సరే, కానీండి!’ అని రాసేసింది. దేశవ్యాపితంగా సంచలనం సృష్టించిన ఎన్ కౌంటర్ కేసు చివరికి దూదిపింజలా తేలిపోయింది. ఎన్ కౌంటర్ సంగతి తర్వాత, అసలు షొరాబుద్దీన్ అన్న గ్యాంగ్ స్టర్ ఉన్నాడా లేదా అని రేపు కోర్టులు విచారణ మొదలు పెట్టినా ఆశ్చర్యం లేదేమో! షొరాబుద్దీన్,…

మోడి చాతుర్యం: దొడ్డిదారిన భీమా బిల్లు -కార్టూన్

అరుణ్ జైట్లీ: “ఇన్సూరెన్స్ పాలసీలోని ఫైన్ ప్రింట్ కి అనుగుణంగానే అది ఉంది” ********* బి.జె.పి ప్రతిపక్షంలో ఉండగా భీమా రంగంలో ఎఫ్.డి.ఐ ల వాటా పెంపుదల బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. నిండా లాభాలు పండిస్తున్న భీమా రంగాన్ని విదేశీ కంపెనీలకు అప్పగిస్తారా అంటూ జాతీయవాద ఫోజులు పెట్టి ప్రశ్నించింది. ఇంకా ఎన్నాళ్లు ఇలా దేశాన్ని విదేశీ కంపెనీలకు అప్పగిస్తారు అని ఆగ్రహించింది. మేము అధికారంలోకి వచ్చాక బిల్లును చెత్త బుట్టలో వేస్తామని జనానికి హామీ ఇచ్చింది.…

నాకు బస్సు, నా గార్డులకు కార్లా? -యశోదాబెన్ ఆర్.టి.ఐ

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఈ దేశ ప్రధాని భార్య మండి పడుతోంది. ప్రోటో కాల్ పేరుతో తన రక్షణ కోసం 10 గార్డులను నియమించి వారి ప్రయాణానికి కార్లు ఇచ్చారని, తనకు మాత్రం ప్రభుత్వ ప్రయాణ వాహనం బస్సులో మాత్రమే వెళ్ళే అవకాశం దక్కిందని ఇదెక్కడి విడ్డూరమని ఆమె ప్రశ్నిస్తున్నారు. అసలు ప్రోటోకాల్ అంటే ఏమిటో చెప్పాలని ఆమె సమాచార హక్కు చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తనకు గార్డులను నియమించిన ఆదేశాలు…

వాజ్ పేయికి భారత రత్న సుపరిపాలనేనా? -కార్టూన్

“అయితే, మోడీజీ – మీ సుపరిపాలన బాగా సాగుతున్నట్లేనా?” ********* మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కి మోడి ప్రభుత్వం ‘భారత రత్న’ ప్రకటించింది. ఆయనతో పాటు హిందూ మహా సభ నాయకుడు మదన్ మోహన్ మాలవీయకు కూడా, ఆయన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారని చెబుతూ ‘భారత రత్న’ ప్రకటించారు. (మాలవీయ 4 సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా పని చేయడం విశేషం.) మాలవీయకు భారత రత్న ప్రకటించడం అనవసరం అనీ,…

అస్సాం మారణకాండ -ది హిందు ఎడిటోరియల్

(ది హిందు, 25.12.2014 నాటి Carnage in Assam ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం.) జాతుల హింసాకాండ దిగ్భ్రాంతికర రీతిలో తిరిగి జడలు విప్పడంతో నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ఎన్.డి.ఎఫ్.బి) – సాంగ్ బిజిత్ ముఠా కు చెందిన సాయుధ మిలిటెంట్లు సోనిట్ పూర్, కొక్రాఝర్ మరియు ఇతర జిల్లాల్లో సాగించిన వరుస దాడుల్లో 67 మంది ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారు. (ఈ ఆదివాసీలు ఇప్పటికీ గిరిజన హోదా కోసం పోరాడుతున్నారు.) మూడు…

అస్సాంలో మళ్ళీ హింస, 70 మంది బలి

అస్సాం రాష్ట్రంలో, ముఖ్యంగా బోడో స్వయం ప్రతిపత్తి ప్రాంతంలో మరోసారి హింస ప్రజ్వరిల్లింది. బోడో మిలిటెంట్ సంస్ధల్లో ఒకటయిన నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ [ఎన్‌డి‌ఎఫ్‌బి(ఎస్)] కు చెందిన మిలిటెంట్లు హింసాకాండకు పాల్పడ్డారు. అత్యధికంగా స్త్రీలు, పిల్లలు చనిపోయిన హత్యాకాండలో 67 మంది ఆదివాసీ పౌరులు చనిపోగా, పోలీసు కాల్పుల్లో మరో ముగ్గురు ఆదివాసీలు చనిపోయారు. బోడో హత్యలకు ప్రతీకారంగా ఆదివాసీలు కొందరు బోడోల ఇల్లు తగలబెట్టారు. దాదాపు వంద సంవత్సరాల క్రితం అస్సాంలోని ఇతర…

గాడ్సేకు బదులు మూడు కోతుల విగ్రహం బెటర్! -కార్టూన్

“దానికి బదులు మనం మూడు కోతులకు విగ్రహం కట్టాలి” ********* బి.జె.పి పాలన ప్రారంభం అయింది లగాయితు గాంధీ హంతకుడు నాధూరామ్ గాడ్సే ను ప్రశంసించేవారు ఎక్కువయ్యారు. సాక్ష్యాత్తు బి.జె.పి ఎం.పి లే బహిరంగంగా గాడ్సేను పొగిడి తమ భావజాలం నిజ స్వరూపం ఏమిటో చాటుకున్నారు. ఇప్పుడు ఏకంగా గాడ్సేకు దేశ రాజధానిలోనే విగ్రహం కట్టాలని అఖిల భారత హిందూ మహా సభ డిమాండ్ చేస్తోంది. మహాత్మా గాంధీ నిజంగా మహాత్ముడా కాదా అన్నది తర్వాత సంగతి.…

బొగ్గు, భీమా ప్రైవేటీకరణ: ఆర్డినెన్స్ ఆలోచనలో కేంద్రం?

వచ్చే మంగళవారంతో శీతాకాలం పార్లమెంటు సమావేశాలు ముగింపుకు రానున్నాయి. మళ్ళీ పార్లమెంటు సమావేశం అయ్యేది బడ్జెట్ కే. భీమా ప్రయివేటీకరణ, బొగ్గు గనుల ప్రయివేటీకరణ బిల్లులను శీతాకాలం సమావేశాల్లోనే మోడి ఆమోదింపజేస్తారని స్వదేశీ, విదేశీ కంపెనీలు, బహుళజాతి కంపెనీలు గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. కానీ సమావేశాలు ముగింపుకు వస్తున్నా బిల్లుల అతీగతీ లేదని కంపెనీలు బెంగ పెట్టుకున్నాయి. ఈ నేపధ్యంలో మోడి ప్రభుత్వం నుండి కంపెనీల ఆశలను ఈడేర్చే శుభవార్త అందింది. పార్లమెంటు ఆమోదంతో సంబంధం లేకుండా…

అతి చిన్న శవ పేటికలు అత్యంత బరువైనవి -ఫోటోలు

“SMALLEST COFFINS ARE THE HEAVIEST” పెషావర్ పాఠశాలపై తాలిబాన్ జరిపిన పైశాచిక మృత్యు క్రీడకు నిరసనగా జరుగుతున్న ప్రదర్శనలో ఒక యువతి పట్టుకున్న ప్లకార్డ్ పై రాసి ఉన్న ప్రకటన ఇది. “అతి చిన్న శవపేటికలు, అత్యంత బరువైనవి” ఈ ఐదు పదాల ప్రకటనకు ఎంత లోతైన అర్ధం! మానవ మాత్రుల సామాన్య దృష్టికి అందని లోతు అది. బహుశా మానవుడి సాధారణ భావోద్వేగానికి కూడా అందని లోతు కావచ్చు. ప్లకార్డు పట్టుకున్న ఆ యువతికి…