గాజా స్ట్రిప్‌: రక్తం ఓడుతున్న అరబ్బుల గాయం -పార్ట్ 2

Gaza people are forced to migrate throught the Gaza strip due to continous bombing by Israel military —–మాతృక అక్టోబర్ నెల సంచిక నుండి (రచన: సుమన) పార్ట్ 1 తరువాత భాగం……. బాల్ఫర్‌ డిక్లరేషన్‌ పశ్చిమాసియా చరిత్రలో బాల్ఫర్‌ డిక్లరేషన్‌ అత్యంత ప్రాముఖ్యత కలిగినది. వాస్తవానికి ప్రాధాన్యతగానీ, చట్టబద్ధత గానీ లేని ఒక చిన్న లేఖ బాల్ఫర్‌ డిక్లరేషన్‌కి పునాది. దీనిపై బ్రిటిష్‌ పార్లమెంటులో చర్చ కూడా జరిగింది లేదు.…

గాజా స్ట్రిప్‌: రక్తం ఓడుతున్న అరబ్బుల గాయం -పార్ట్ 1

– —–మహిళా పత్రిక ‘మాతృక’ అక్టోబర్ నెల సంచిక నుండి. (రచన: సుమన) ఈ జాత్యహంకార దుర్గంధం ఎచటిదంటే గాయాల గాజా వైపు చూపండి! పెట్రో డాలర్లు వెదజల్లుతున్న ఈ కర్బన ఉద్గారాల కమురు వాసన గాలులు ఎక్కడివంటే గాజా తీరాన్ని చూపండి! మానవతా చూపులను మసకబార్చుతున్న ఆ గంధకపు పేలుళ్ల పొగల మేఘాలు ఎక్కడ వర్షిస్తున్నాయంటే పుడమి తల్లి రాచపుండుగా మారిన గాజాలో సొమ్మసిల్లుతున్న మానవ దేహాలను చూపండి. మన ఇంటిపై కమ్మిన ఉప్పు భాష్పాల…

ఉపాధి పొందే హక్కు ప్రతి ముస్లిం సొంతం -ఆర్ఎస్ఎస్ చీఫ్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ అయిన మోహన్ భగవత్ ముస్లింల పట్ల దయ తలిచారు. హిందువులు, ముస్లింలు అన్న తేడా కూడదనీ, వాళ్ళిద్దరూ ఇప్పటికే ఒక్కటయ్యారని తేల్చి చెప్పారు. భారత దేశంలో ఉపాధి పొందే హక్కు ప్రతి ఒక్క ముస్లిం వ్యక్తికీ ఉన్నదని కూడా చాటారు. ఆర్ఎస్ఎస్ సంస్థ రెండవ గురువు, సిద్ధాంత కర్తగా పేర్కొనే గురు గోల్వాల్కర్ గారు ముస్లిం లకు అలాంటి స్వేచ్ఛ ఉందన్న సంగతి నిరాకరించారు. ముస్లిం మతావలంబకులు…

బిజెపి గెలవటానికి ఇతర రాష్ట్రాల నుండి వోటర్లను తరలించాం -బిజెపి

బిజెపి గత పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధంగా గెలిచిందో ఆ పార్టీ నాయకుడే స్వయంగా వెల్లడి చేశాడు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి కి చెందిన సురేశ్ గోపి (సినీ నటుడు) త్రిస్సూర్ నియోజక వర్గం నుండి లోక్ సభ సభ్యుడుగా ఎన్నికయ్యాడు. సురేశ్ గోపి ని గెలిపించటానికి తాము ఇతర రాష్ట్రాల నుండి ఓటర్లను త్రిస్సూరు పార్లమెంటు నియోజక వర్గానికి తరలించామని కేరళ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి గోపాల కృష్ణన్ వెల్లడి చేశాడు. తాము…

మర్రి చెట్టు నీడ నుండి రావి చెట్టు నీడ లోకి ఇండియా!

India NSA Ajit Doval with Russian President Vladimir Putin ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్! అన్న సామెత అందరికీ తెలిసిందే. 1947 నుండి భారత సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, ఆయుధ సరఫరా, ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన మరియు అభివృద్ధి, మిసైళ్ల సరఫరా మరియు అభివృద్ధి, ఆధునిక నౌకల సరఫరా మరియు అభివృద్ధి మొదలైన రంగాలలో మునుపటి సోవియట్ రష్యా, ఇప్పటి రష్యన్ ఫెడరేషన్ భారత దేశానికి…

బీహార్ ఎస్.ఐ.ఆర్: అసలేం జరుగుతోంది?

బీహార్ లో ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ గురించి పూర్వ రంగం గురించి కాస్త తెలుసుకుంటే ఉపయోగం. మూలం ఏమిటో తెలియకుండా బీహార్ ఎస్.ఐ.ఆర్ అంటూ ఎన్ని పోస్టులు రాసినా వృధాయే కదా! బీహార్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం జనవరి 2025 లో బీహార్ వోటర్ల జాబితాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ‘సమ్మరీ రివిజన్’ పేరుతో సవరించింది. సవరించి వోటర్ల జాబితా తుది నిర్ధారిత జాబితాను…

తొలగించిన ఓటర్ల జాబితా ఇచ్చే బాధ్యత మాది కాదు -ఇసిఐ

Special Intensive Revision in Bihar బీహార్ లో భారత ఎన్నికల కమిషన్ (లేదా భారత ప్రభుత్వం) నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) దరిమిలా, కమిషన్, ఆగస్టు 1వ తేదీన వోటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించింది. ఈ జాబితాలో గతంలో చోటు చేసుకున్న వోటర్లలో మొత్తం సుమారు 65 లక్షల మంది వోటర్లను తొలగించి మిగిలిన వారితో ముసాయిదాను కమిషన్ ప్రచురించింది. తొలగించిన 65 లక్షల మంది జాబితాను బూత్ ల వారీగా తమకు కూడా…

బీహార్ ఎస్ఐఆర్ చట్ట వ్యతిరేకం అని రుజువు చేస్తే, రద్దు చేసేస్తాం! -సుప్రీం కోర్టు

“స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్” (ఎస్ఐఆర్) పేరుతో బీహార్ వోటర్ల జాబితా మొత్తాన్ని తిరగ రాసేందుకు తెగబడ్డ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఇసిఐ), సుప్రీం కోర్టులో అగ్ని పరీక్ష ఎదుర్కుంటున్నది. బీహార్ ఎస్ఐఆర్ చట్ట విరుద్ధం అంటూ యోగేంద్ర యాదవ్ లాంటి స్వతంత్ర పరిశీలకులు, ఏడిఆర్ (అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్) లాంటి ఎన్.జి.ఓ లు, టిఎంసి ఎంపి మహువా మొయిత్రా లాంటి రాజకీయ నాయకులు సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా…

పహల్గామ్ దాడి గురించి ప్రధానికి ముందే తెలుసు! -ఖార్గే సంచలనం

పహల్గామ్ టెర్రరిస్టు దాడి, అనంతరం ఇండియా – పాకిస్థాన్ దేశాల 4 రోజుల యుద్ధం అంశాలపై పార్లమెంటులో రెండు రోజులుగా తీవ్రమైన చర్చ నడుస్తోంది. లోక్ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, హోమ్ మంత్రి అమిత్ షా లపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయి ప్రశ్నలతో నిలదీస్తుండగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గే ప్రధాన మంత్రి మోడి పైన విరుచుకు పడ్డారు. పహల్గామ్ టెర్రరిస్టు దాడి తదనంతరం జరిగిన నాలుగు రోజుల…

ట్రంప్ దెబ్బకు అనిశ్చితిలో ఆర్ధిక వ్యవస్థలు!

Deportees entering the U.S. military plane అధ్యక్ష పగ్గాలు చేపట్టక ముందే గాజా యుద్ధాన్ని చిటికెలో ముగిస్తానన్న డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత మిత్ర దేశాలు శత్రు దేశాలు అన్న తేడా లేకుండా అన్ని దేశాలతో వాణిజ్య యుద్ధం ప్రారంభించాడు. ముఖ్యంగా ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోడిని పొగిడాడో, తిట్టాడో తెలియని వ్యాఖ్యలతో అయోమయం సృష్టించి ఇండియాను మాత్రం “అతి భారీ వాణిజ్య సుంకాలు మోపే దేశం” అని ప్రతికూల వ్యాఖ్యలతో భారత…

అలా అయితే నేను బలమైన ప్రధానిని కాను -డా. మన్మోహన్

యుపిఏ 2.0 ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అన్ని వైపుల నుండీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. 2జి సెక్ట్రమ్ స్కాం, బొగ్గు గనుల కేటాయింపుల స్కామ్, హెలికాప్టర్ స్కాం, ఇలా అనేక స్కాం లు వరస బెట్టి వెలుగు చూడటం వలన అసలు దోషులకు బదులు ప్రధాన మంత్రి పదవిలో ఉన్న డా. మన్మోహన్ సింగ్ పైనే విమర్శలు ఎక్కుపెట్టబడ్డాయి. ఎన్ని విమర్శలు వచ్చినా చాలా కాలం వరకు డా. మన్మోహన్ సింగ్…

బ్రిక్స్ దేశాలకు ఉమ్మడి కరెన్సీ?

– బ్రిక్స్ కూటమి 16వ సమావేశాల్లో రష్యా అధ్యక్షుడు పుటిన్ కు బ్రిక్స్ కరెన్సీ పేరుతో ఒక నమూనా నోట్ ను బహూకరించటం ఇండియాలో కలకలం రేగటానికి కారణం అయింది. కరెన్సీ నోట్ నమూనా పైన భారత దేశం తరపున భారత జాతీయ పతాకంతో పాటు తాజ్ మహల్ బొమ్మ కూడా ఉండటం ఈ కలకాలానికి ప్రధాన కారణం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి 2014 లో అధికారం చేపట్టిన తర్వాత వివిధ ముస్లిం మత నిర్మాణాలకు,…

బ్రిక్స్: ద్రవ్య ఏకీకరణ జరగాలి -మోడి

రష్యా నగరం కాజన్ లో జరుగుతున్న ‘బ్రిక్స్ కూటమి’ 16వ సమావేశాల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ద్రవ్య ఏకీకరణ (Financial Integration) జరగాలని, ద్రవ్య ఏకీకరణకు ఇండియా మద్దతు ఇస్తుందని ప్రకటించాడు. బుధవారం అక్టోబర్ 23 తేదీన సమావేశాల్లో ఆయన పాల్గొంటూ అంతర్జాతీయ ఉగ్రవాదం విషయమై తయారు చేసిన పత్రాన్ని ప్లీనరీ సెషన్ లో ప్రవేశ పెట్టాడు. అంతర్జాతీయ ఉగ్రవాదం విషయంలో ఇండియా రాజీలేని ధోరణి అవలంబిస్తుందని మోడి…

బ్రిక్స్: ఇండియాపై అమెరికా ఆశలు నిలిచేనా?

పశ్చిమాసియాలో అరబ్ పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ జరుపుతున్న సామూహిక దారుణ మారణకాండ, ఉక్రెయిన్-రష్యా యుద్ధంల పుణ్యమాని ఇరుగు పొరుగు దేశాలైన ఇండియా, చైనాల మధ్య సంబంధాలు మెరుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవి కేవలం సూచనలేనా లేక వాస్తవ రూపం దాల్చేనా అన్న సంగతి మాత్రం ఇప్పుడప్పుడే తెలిసే అవకాశం మాత్రం లేదు. రష్యన్ నగరం కాజన్ లో ఈ రోజు (అక్టోబర్ 23) బ్రిక్స్ కూటమి దేశాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. విశ్లేషకులు ఊహించినట్లుగానే ఇండియా, చైనా…

హర్యానాలో అనూహ్య ఫలితాలు!

హర్యానా రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం ఒక మాయగా కనిపిస్తున్నాయి. దాదాపు ఎగ్జిట్ పోల్ నిర్వహించిన ప్రతి ఒక్క సంస్థా ఎలాంటి అనుమానం లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి తీరుతుందని ఢంకా బజాయించాయి. తీరా ఫలితాలు చూస్తే సరిగ్గా ఎగ్జిట్ ఫోల్ ఫలితాలకు పూర్తి భిన్నంగా వాస్తవ ఫలితాలు ఉండటం ఒక అర్ధం కానీ వ్యవహారంగా ఉండిపోయింది. సాయంత్రం 4 గంటల 4 నిమిషాల సమయానికి బిజెపి 17 స్థానాలు గెలుచుకోగా 33 స్థానాల్లో లీడింగ్…