ప్రశ్న: భారత్ విదేశాలపై దాడి ఎందుకు చేయలేదు?

కె.బ్రహ్మయ్య: 1) ప్రాచీన క్షాత్ర పరంపర కలిగిన మన భారతీయ సమాజం నిన్న మొన్న కళ్ళు తెరిచిన విదేశీ జాతుల చేతులలో వోడి, వారికి తల వంచి వారి పరిపాలనకు లోబడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ESPECIALLY FOR MUSLIMS INVADERS. 2) గత 5000 సంవత్సరాల కాలంలో భారతదేశం ఎందుకు ఇతర దేశాల మీద దాడి చెయ్యలేదు? IS THERE NOT ENOUGH STRENTH FOR INDIA? సమాధానం: ప్రాచీన క్షాత్ర పరంపర…

GSAT, GISAT ల మధ్య తేడా ఏమిటి?

శ్రీవిద్య: GSAT మరియు GISAT ల మధ్య ఉన్న తేడా ఏమిటో వివరించగలరు? సమాధానం: GSAT అంటే జియో సింక్రొనస్ శాటిలైట్ (Geosynchronous Satellite) అని అర్ధం. GISAT అంటే GEO ఇమేజింగ్ శాటిలైట్ (GEO Imaging Satellite) అని సాధారణ అవగాహనగా చెబుతారు. అయితే శాస్త్రీయంగా ఖచ్చితంగా చెప్పాలంటే దీని పూర్తి నామం ‘Geostationary Hyperspectral Imager Satellite’. వివరాల్లోకి వెళ్తే: GSAT ఉపగ్రహాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ ISRO దేశీయంగా అభివృద్ధి చేసిందని…

మూజువాణి ఓటు అంటే?

శ్రీవిద్య: మీ సైట్ పాఠకుల్లో నేనొకరిని. సైట్ నాకు ఉపయోగంగా ఉంది. నా మొదటి ప్రశ్న-   ఇటీవల వార్తల్లో “మూజువాణి ఓటు” అని తరచుగా కనిపిస్తోంది… అంటే ఏమిటి? ఇటువంటి ఓటుతో ఇంతకుముందు ఏమన్నా ఇటువంటి తీర్పులు జరిగాయా? సమాధానం: మూజువాణి ఓటు అని పత్రికల్లో చదవడమే గానీ అదేమిటో చాలా మందికి తెలియదు. అడిగినా చెప్పేవారు తక్కువే ఉంటారు. వాణి అంటే గొంతు, పలుకు అని అర్ధం అని తెలుసు గనక అదేదో అరిచి చెప్పే…

ప్రశ్న: లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టడంపై రాద్ధాంతమేల?

ఉమేష్ పాటిల్: హాయ్ సర్, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాం అని ప్రభుత్వం, ప్రవేశపెట్టలేదు అని ప్రతిపక్షం వాళ్ళు అన్నారు కదా. 1)అసలు దానికి అంత రాద్ధాంతం ఎందుకు? 2) ప్రవేశపెట్టింది మళ్ళీ ప్రవేశపెట్టలేమా? 3) అసలు ప్రవేశపెడితే ఏమి జరుగుతుంది? 4) మళ్ళీ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం తెలిపింది? సమాధానం: 1) ప్రవేశపెట్టడం పైనే అంత రాద్ధాంతం చేయడానికి ప్రధాన కారణం వివిధ పార్టీలకు ఉన్న రాజకీయ స్వార్ధ ప్రయోజనాలు. తెలంగాణ వ్యతిరేకులు బిల్లును…

ప్రశ్న: వోట్-ఆన్-అకౌంట్ అంటే?

ప్రశ్న (మల్లిఖార్జున్): సాధారణ బడ్జెట్ కీ, వోట్-ఆన్ అకౌంట్ బడ్జెట్ కీ తేడా చెప్పండి? సమాధానం: క్లుప్తంగా చెప్పాలంటే తాత్కాలికంగా ఖర్చులు గడుపుకోవడానికి ప్రతిపాదించే బడ్జెట్ నే వోట్-ఆన్-అకౌంట్ అంటారు. సాధారణంగా ఎన్నికల సంవత్సరంలో వోట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ అవసరం వస్తుంది. పూర్తి స్ధాయి సాధారణ బడ్జెట్ ఆమోదించాలంటే సభల్లో సంతృప్తికరంగా చర్చలు జరగాలి. ఈ చర్చలన్నీ ముగియాలంటే సమయం తీసుకుంటుంది. కొత్త బడ్జెట్ సంవత్సరం వచ్చేస్తుంది. ఈ లోపు ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావచ్చు. పాత ప్రభుత్వం పూర్తి…

‘పాపులిస్టు అనార్కి పాలనకు ప్రత్యామ్నాయం కాదు’ అంటే?

రాకేష్: Hi Sir, ”Populist anarchy no substitute for governance”, “rising trend of hypocrisy in public life” ఈ రెండు స్టేట్ మెంట్స్ ని స్పష్టంగా వివరించగలరా? సమాధానం: (ఇది వాస్తవానికి రాకేష్ అనే పాఠకుడికి, నాకూ జరిగిన సంభాషణ. ఈ ప్రశ్నలో మోదటి భాగం వరకు మా మధ్య చర్చ జరిగింది. అందులో నా సమాధానం వరకూ కొన్ని మార్పులు చేసి ప్రచురిస్తున్నాను. -విశేఖర్) “POPULIST ANARCHY IS NO SUSTITUTE…

ప్రశ్న: ఆర్టికల్ 370 కాశ్మీర్ కి అవసరమా?

ఉమేష్ పాటిల్: ఆర్టికల్ 370 గురించి వివరించండి. కాశ్మీర్ కి అది అవసరమా? సమాధానం: జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించినదే ఆర్టికల్ 370. 1949 నుండి ఇది ఉనికిలో ఉన్నప్పటికీ ఈ ఆర్టికల్ నిజంగా ఊపిరి పీల్చుకుని సజీవంగా నిలిచిన రోజులు మాత్రం చాలా తక్కువే. వివిధ ఒప్పందాల పేరుతోనూ, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారానూ ఈ ఆర్టికల్ ద్వారా కాశ్మీర్ కు కల్పించిన అధికారాలు అన్నింటిని కత్తిరించేశారు. ఆర్టికల్ 370 జీవచ్ఛవంగా…

ప్రశ్న: గూఢచర్యం అన్ని దేశాలు చేస్తాయిగా?

ప్రశ్న (నరేంద్ర): గూఢచర్యం అన్ని దేశాలు చేసే పనే కదా? ఒక్క అమెరికానే తప్పు పట్టడం అన్యాయం కదా? జవాబు: ఈ ప్రశ్న వేసి చాలా రోజులు అయింది. సమాధానం బాగా ఆలస్యం అయింది. ఇలా సమాధానం ఆలస్యం అయిన ప్రశ్నలు ఇంకా ఉన్నాయి. ఇచ్చే సమాధానం వివరంగా సంతృప్తికరంగా ఉండాలన్న ఆలోచన చేస్తాను. ఈ ఆలోచన సమాధానాన్ని మరింత ఆలస్యం చేస్తోంది. అందుకు చింతిస్తూ… నిజమే. గూఢచర్యం అన్ని దేశాలూ చేస్తాయి. ఇండియా కూడా గూఢచర్యం…

పోలార్ వర్టెక్స్ అంటే?

పోలార్ వర్టెక్స్ వలన అమెరికాలో అత్యంత కనిష్ట స్ధాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దానితో అక్కడ ప్రజా జీవనం దాదాపు స్తంభించిపోయింది. -56 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయని పత్రికలు చెబుతున్నాయి. ది హిందూ పత్రిక ఈ ఉష్ణోగ్రతలను సెంటీ గ్రేడ్ లలో చెప్పగా రష్యా టుడే ఫారెన్ హీట్ లలో తెలిపింది. –50o C వరకు కనిష్ట ఉష్ణోగ్రత నమోదయిందని ది హిందూ తెలిపింది. రష్యా టుడే మాత్రం 56o F కనిష్ట ఉష్ణోగ్రత నమోదయినట్లు తెలిపింది.…

ఇజ్రాయెల్, పాలస్తీనాల వైషమ్యాలకు కారణం?

ప్రశ్న (ఉమేష్ పాటిల్): ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య వైషమ్యాలకు కారణం వివరించండి. సమాధానం: ఇది అమెరికా, ఐరోపా (ప్రధానంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలు) సృష్టించిన సమస్య. యూదు ప్రజలకు చారిత్రక న్యాయం చేసే పేరుతో సొంత ప్రయోజనాలను నెరవేర్చుకునే కుట్రతో ఇజ్రాయెల్ ను ఈ దేశాలు సృష్టించాయి. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ నియంత హిట్లర్ యూదులను వెంటాడి వేటాడనీ, గ్యాస్ ఛాంబర్లలో పెట్టి సామూహికంగా చంపాడని ఆరోపించి, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా యూదులకు సొంత రాజ్యం…

ప్రశ్న: లుక్ ఈస్ట్ పాలసీ అంటే?

ఎ.సురేష్: ‘లుక్ ఈస్ట్ పాలసీ’ అంటే ఏమిటి? సమాధానం: సురేష్ గారూ ఈ ప్రశ్నకు సమాధానం గతంలో రాశాను. ‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడం ఎలా?’ అన్న శీర్షికన ఈనాడు చదువు పేజీలో వచ్చిన వ్యాస పరంపరలో మూడో భాగంలో ఈ పాలసీ గురించి చర్చించాను. సదరు ఆర్టికల్ ను ఈ బ్లాగ్ లో కూడా ప్రచురించాను. ప్రచురించడం అంటే ఈనాడులో వచ్చిన ఆర్టికల్ పి.డి.ఎఫ్ కాపీ ని ఇక్కడ పోస్ట్ చేయడం. ఒకవేళ మీకు…

ప్రశ్న: ప్రపంచీకరణ అంటే…?

కె.బ్రహ్మం: ప్రపంచీకరణ అంటే ఏమిటి? సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధిల విషయంలో అమెరికా, ఐరోపాలు ప్రత్యేకంగా ఎందుకు ఉన్నాయి? సమాధానం: రెండో అంశాన్ని వివరిస్తూ మొదటి అంశానికి వస్తాను. ప్రపంచీకరణ (Globalization) కు నిర్దిష్ట నిర్వచనం ఒక వాక్యంలో చెప్పడం తగదు. ప్రపంచీకరణ అనేది మానవ సమాజం అభివృద్ధి చెందుతున్న దశలో ఏర్పడిన ఒక అనివార్య దశ. ఈ దశకు మూలాలు క్రీస్తు పూర్వం మూడో మిలీనియంలోనే ఉన్నాయని చెప్పేవారు లేకపోలేదు. అంత వెనక్కు కాకపోయినా 15వ శతాబ్దంలో…

ప్రశ్న: జి.డి.పి, ప్రపంచీకరణ వగైరా…

కె.బ్రహ్మం: జి.డి.పి, గ్లోబలైజేషన్ అంటే ఏమిటి? సాంకేతిక పరిజ్ఞానం, వృద్ధిల విషయంలో అమెరికా, ఐరోపాలు ప్రత్యేకంగా ఎందుకు ఉన్నాయి? సమాధానం: బ్రహ్మం గారు ప్రశ్న వేసి దాదాపు రెండు వారాల పైనే అయింది. ఇంకా ఐదారుగురు మిత్రులకు నేను సమాధానం బాకీ ఉన్నాను. ఆలస్యానికి విచారిస్తున్నాను. బ్రహ్మం గారి ప్రశ్నకు మొదట సమాధానం ఇస్తున్నాను. జి.డి.పి: Gross Domestic Product అనే పదబంధానికి జి.డి.పి పొట్టిరూపం. తెలుగులో స్ధూల జాతీయోత్పత్తి అని అంటారు. స్ధూల దేశీయోత్పత్తి అన్నా…

కరెంటు ఖాతా లోటు, రెవిన్యూ లోటు అంటే?

ప్రశ్న (చందు అరవింద్): … … మీ బ్లాగ్ ని నేను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను. మీ విశ్లేషణలు చాలా అర్ధవంతంగా ఉంటాయి. మీరు ఇటీవల రేపో రేటు, సి.ఆర్.ఆర్ ని తెలుగులో సాధారణ వ్యక్తికి కూడా అర్ధం అయ్యే విధంగా వివరించారు. అలాగే CURRENT ACCOUNT DEFICIT, REVENUE DEFICIT, LIQUIDITY ADJUSTMENT FACILITY ల గురించి కూడా వివరించగలరని నా మనవి. నేను… … సమాధానం: అరవింద్ గారు మీ ప్రశ్నలో అవసరం…

సి.ఆర్.ఆర్, రెపో, రివర్స్ రెపో రేట్లు అంటే?

ప్రశ్న: రెపో  రేటు, రివర్స్ రెపో రేటు గురించి వివరించగలరా? జవాబు: ఈ ప్రశ్నకు సమాధానం వివిధ సందర్భాల్లో వివరించాను. కానీ అలాంటి సందర్భం మళ్ళీ వస్తే గుర్తు తెచ్చుకోడానికి పాఠకులకు ఇబ్బంది ఉన్నట్లు కనిపిస్తోంది. బహుశా వివరణలో కాకుండా, టపాలోనే ఈ పేర్లు ఉన్నట్లయితే వెతుక్కోడానికి కొంత సులభంగా ఉండవచ్చని మళ్ళీ వివరిస్తున్నాను. గతంలో ఇచ్చిన వివరణను విస్తృతం చేస్తున్నాను. రిజర్వ్ బ్యాంకు నియంత్రణలో ఉండే వడ్డీ రేట్లను దేశంలో ద్రవ్య చలామణిని అదుపులో ఉంచడానికి…