తప్పు లేదని నిర్ధారించినా సస్పెన్షన్ ఎందుకు?

ఏ‌ఎస్‌ఏ విద్యార్ధులు ఏ తప్పూ చేయలేదనీ, వారు తప్పు చేశారని చెప్పేందుకు ఎలాంటి సాక్షాలూ లేవని యూనివర్సిటీ నియమించిన కమిటీ నిర్ధారించింది. అయినప్పటికీ ఆ అయిదుగురినీ యూనివర్సిటీ కౌన్సిల్ ఎందుకు సస్పెండ్ చేసింది? యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పి అప్పారావు నియమితులు కావడానికి ముందు నియమించబడిన కమిటీ దళిత విద్యార్ధులది ఎలాంటి తప్పూ లేదని తేల్చింది. దానితో వారిపై ఎలాంటి చర్యకూ ఆస్కారం లేదు. కనుక సస్పెన్షన్ నన్ను రద్దు చేశారు. కానీ ఆ తర్వాతే…

అధికారుల సస్పెన్షన్: ఢిల్లీ ఐ‌ఏ‌ఎస్ ల సామూహిక సెలవు

ఢిల్లీ ఐ‌ఏ‌ఎస్ అధికారులు ఏ‌ఏ‌పి ప్రభుత్వంపై సమ్మె ప్రకటించారు. వందల మంది అధికారులు మూకుమ్మడిగా సెలవుపై వెళ్లారు. కొందరు రోజంతా సెలవు తీసుకోగా మరికొందరు ఒక పూట సెలవులో వెళ్లారు. ఇదంతా తమలో ఇద్దరు అధికారులను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసినందుకు! అధికారుల సెలవు వల్ల ఢిల్లీ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా తలపెట్టిన బేసి-సరి సంఖ్యల (నంబర్ ప్లేట్లు) వాహన పధకం అమలుకు ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం తలెత్తింది. ఢిల్లీ ప్రభుత్వం తరపున వాదించే కౌన్సెళ్ళకూ పబ్లిక్…

చూడు చూడు నీడలు.. మూసాహార్ వాడలు -ఫోటోలు

వీళ్ళు మూసాహార్ అనబడే ఎలుకాహారులు. భోజ్ పురిలో ముసాహార్ అంటే ఎలుకల్ని తినేవారు అని. అదే వారి సమూహానికి పెట్టిన కులం పేరు. బీహార్ రాష్ట్రంలో నాగరికత నుండి దూరంగా వెలివేయబడ్డ ఈ కులం ప్రజలను భారత దేశ హిందూ సమాజం పంచములుగా గుర్తించి శతాబ్దాలు దాటిపోయింది. ఆధునిక భారతావని, సర్వ స్వతంత్ర గణతంత్ర సామ్యవాద లౌకికవాద రాజ్యంగా అవతరించాక  వారు షెడ్యూల్డ్ కులంగా గుర్తించ బడ్డారు. కానీ ఎన్ని పేర్లు పెట్టినా, ఓటు చట్టాలు చేసి…

వివేకరహిత సోదా, రుచివిహీన ఫలితం -ది హిందు

[ఈ రోజు -డిసెంబర్ 17, 2015- ‘Tactless raid, unsavoury fallout’ శీర్షికన ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం ఈ ఆర్టికల్. -విశేఖర్] *********** ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంపై సి.బి.ఐ జరిపిన సోదాలు యోగ్యమైనవేనా అన్న విషయమై కొన్ని ప్రశ్నలు తలెత్తవచ్చు. అంతమాత్రాన అది ఆమ్ ఆద్మీ పార్టీ, బి.జె.పిల మధ్య, నిజానికి ఢిల్లీ మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య రుచి విహీనమైన  రాజకీయ యుద్ధం చెలరేగడానికి దారితీయవలసిన అవసరం లేదు.…

జైట్లీ రక్షణకే సి.బి.ఐని ఉసిగొల్పారు -ఢిల్లీ సి.ఎం

కేంద్ర ఆర్ధిక మంత్రి, ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ మాజీ ప్యాట్రన్ కూడా అయిన అరుణ్ జైట్లీని క్రికెట్ అవినీతి కేసు నుండి రక్షించడానికే తన కార్యాలయంపై సి.బి.ఐ దాడి జరిగిందని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రధాని మోడిని ‘పిరికిపంద’ అనీ, ‘సైకోపాత్’ అనీ నిందించినందుకు విమర్శలు ఎదుర్కొంటున్న అరవింద్ తన నిందలను ఉపసంహరించుకునేందుకు నిరాకరించారు. ట్విట్టర్ పోస్టుల ద్వారా సాగించిన నిందలకు క్షమాపణ చెప్పాలన్న బి.జె.పి డిమాండ్ కు బదులుగా “మోడి…

హాంగ్ కాంగ్ గొడుగు ఉద్యమం ఏడాది తర్వాత.. -ఫోటోలు

గత సంవత్సరం సెప్టెంబర్ లో హాంగ్ కాంగ్ లో విద్యార్ధులు, యువకులు ఒక ఉద్యమం నడిపారు. ఈ ఉద్యమానికి ‘ప్రజాస్వామ్య హక్కుల కోసం జరిగిన ఉద్యమం’గా పశ్చిమ పత్రికలు చెప్పుకుని సంతోషిస్తుంటాయి. పశ్చిమ దేశాలు ప్రవేశపెట్టిన అరబ్ వసంతం లిబియాను కుక్కలు చింపిన విస్తరి చేసినట్లే, ఈజిప్టును తిరిగి మిలట్రీ చీకటి కొట్టంలోకి విసిరి కొట్టినట్టే, సిరియాను అల్లకల్లోలం కావించి ముక్కలు ముక్కలుగా విడదీయడానికి ఉద్దేశించినట్లే… హాంగ్ కాంగ్ లో జరిగిన సొ కాల్డ్ ‘ప్రజాస్వామిక ఉద్యమం’…

సల్మాన్ కో న్యాయం, అఫ్జల్ కో న్యాయం! -2

“అప్పీలుదారు ఎలాంటి అనుమానం లేకుండా దోషియే అని నిర్ధారించ గల స్ధాయిలో ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్ష్యం, ఈ కోర్టు దృష్టిలో, లేదు. అనుమానం అన్నది, అది ఎంత బలంగా ఉన్నప్పటికీ, ఎవరినైనా సరే దోషిగా నిర్ధారించడానికి సరిపోదు. “కీలక సాక్ష్యాలను నమోదు చేయక పోవడంలో ప్రాసిక్యూషన్ లో లోపాలు ఉన్నాయి. గాయపడిన వారి సాక్ష్యాలలో విడుపులు (omissions), వైరుధ్యాలు ఉన్నాయి. సాక్ష్యాల సేకరణలో దొర్లినట్లుగా కనిపిస్తున్న లొసుగులు నిందితునికే లాభం చేకూర్చుతాయి. “ప్రజల అభిప్రాయం ఏమిటో మాకు…

సల్మాన్ కొక న్యాయం, అఫ్జల్ కొక న్యాయం?! -1

భారత దేశ పార్లమెంటరీ రాజకీయార్ధిక వ్యవస్ధను కంటికి రెప్పలా కాపాడుతున్న భారతీయ కోర్టులు తాము, రాజ్యాంగ చట్టాలు చెబుతున్నట్లుగా, అందరికీ ఒకటే న్యాయం అమలు చేయడం లేదని మరోసారి రుజువు చేసుకున్నాయి. సల్మాన్ ఖాన్ హిట్ & రన్ కేసు విషయంలో అంతిమ తీర్పు ప్రకటిస్తూ ముంబై హై కోర్టు చేసిన వ్యాఖ్యలు, పొందుపరిచిన సూత్రాలకూ అఫ్జల్ గురు కేసు విషయంలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు, సూత్రాలకూ మధ్య తేడాను గమనిస్తే ఈ సంగతి తేలికగా…

8 నెలల్లో 111 లాకప్ హత్యలు!

పోలీసుల కస్టడీలో ఉండగా పోలీసుల చేతుల్లో దెబ్బలు తిని చనిపోతే ఆ చావులను లాకప్ హత్యలు అంటారు. (ఇది పాఠకులకు తెలియదని కాదు. కానీ రాయడంలో ఒక పద్ధతిని పాటిస్తే చెప్పదలిచిన విషయం స్పష్టంగా ఉంటుందని.) గత 8 నెలల్లో భారత దేశంలోని పోలీసులు తమ నిర్బంధంలో తీసుకున్నవారిలో ఏకంగా 111 మందిని చంపేశారు. ‘నిజం’ రాబట్టడానికి అని చెబుతూ పోలీసులు ధర్డ్ డిగ్రీ పద్ధతుల్ని పాటిస్తారు. ధర్డ్ డిగ్రీ పద్ధతులు వాస్తవానికి చట్టబద్ధం కాదు. అనగా…

ఢిల్లీ ఎ.సి.బి అదుపుకు కేంద్రం ప్రయత్నాలు!

అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిత్వంలో, ఎ.ఎ.పి-1 పాలనలో, భారత దేశంలో అత్యధిక ధనికుడైన ముఖేష్ అంబానీపై ఢిల్లీ ఎ.సి.బి అవినీతి కేసు నమోదు చేసింది. అప్పటి కేంద్ర చమురు మంత్రి వీరప్ప మొయిలీ, ఇంకా ఇతర అధికారులపై కూడా అప్పటి ప్రభుత్వం అవినీతి కేసు నమోదు చేసింది. పలువురు ప్రముఖులు చేసిన ఫిర్యాదు ఆధారంగా అప్పటి ఎ.ఎ.పి ప్రభుత్వం ముఖేష్ అంబానీ, వీరప్ప మొయిలీ, మురళి దియోరా, వి.కె.సిబాల్ లపై నమోదు చేసిన కేసు వివరాల కోసం కింది…

కాశ్మీర్ లో ఉక్కు పాదం -ది హిందు ఎడిట్..

[మే 21 తేదీన ఉత్తర కాశ్మీర్ లోని పల్హాలాన్ గ్రామంలో గ్రామ ప్రజలు మీర్వాయిజ్ మౌల్వీ ఫరూక్ 25వ వర్ధంతి సందర్భంగా ఊరేగింపు జరుపుతుండగా పోలీసులు ఊరేగింపు పైకి పంప్ గన్ పెల్లెట్లు పేల్చారు. నాన్-లెధల్ వెపన్ పేరుతో కాశ్మీర్ భద్రతా బలగాలు ప్రయోగిస్తున్న ఈ ఆయుధాల వల్ల వందలమంది తీవ్ర గాయాలపాలై కంటి చూపు కోల్పోతున్నారు. నాన్-లెధల్ అని చెప్పినప్పటికీ పదుల సంఖ్యలో వీటి బారినపడి మరణించారు. మే 21 తేదీన ట్యూషన్ కి వెళుతూ…

ఢిల్లీ కోర్టు రూలింగ్: మోడిపై ఎఎపి గెలుపు

ఒక హెడ్ కానిస్టేబుల్ అవినీతి కేసులో ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఢిల్లీలోని ఎఎపి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎఎపి మొదటి గెలుపు నమోదు చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ద్వారా ఎఎపి ప్రభుత్వం చేతుల్లో నుండి అధికారాలు గుంజుకోవడానికి గత కొద్ది వారాలుగా మోడి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలకు ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తాజా తీర్పు కళ్ళెం వేసింది. ఢిల్లీ పోలీసులపై…

మావోయిస్టు అవడం నేరం కాదు -చారిత్రక తీర్పు

కేరళ హై కోర్టు చరిత్రాత్మక తీర్పు ప్రకటించింది.  జస్టిస్ చిన్నపరెడ్డి (కిష్టయ్య, బాలాగౌడ్ కేసు), జస్టిస్ తార్కుండే (ప్రభుత్వోద్యోగుల రాజకీయ భావాలు) లాంటి గొప్ప న్యాయమూర్తుల తీర్పుల సరసన చేర్చగల ఈ తీర్పు ప్రకారం కేవలం మావోయిస్టుగా ఉండడమే నేరం కాదు. దేశంలో అమలులో ఉన్న చట్టాలకు విరుద్ధంగా ఎలాంటి చర్యకు పాల్పడనంతవరకు మావోయిస్టు భావజాలం ఒక వ్యక్తిని నేరస్ధుడిగా చేయబోదని తీర్పు పేర్కొంది. మావోయిస్టు భావజాలం దేశంలో ఉనికిలో ఉన్న రాజ్యాంగబద్ధ రాజ్యపాలన (constitutional polity)…

అమెరికా నిరంతర ఆరాటం -ది హిందు ఎడిటోరియల్

[America’s perennial angst శీర్షికన మే 2 నాటి ది హిందులో ప్రచురితం అయిన ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం. -విశేఖర్] ఆర్ధిక అగ్రరాజ్యం అయినప్పటికీ దరిద్రం, వెలివేత, నేరాలు… మొ.న అంశాలతో ముడివేయబడిన తీవ్ర స్ధాయి స్వదేశీ సమస్యలు అమెరికాను పట్టి పీడిస్తున్న సంగతిని ఇటీవల బాల్టిమోర్ లో నిరసనలుగా ప్రారంభమై అల్లర్లుగా రూపుదాల్చిన ఆందోళనలు పట్టిచ్చాయి. గత ఏప్రిల్ నెలలో నగర పోలీసుల చేతుల్లో ఒక ఆఫ్రికన్-అమెరికన్ యువకుడు, ఫ్రెడ్డీ గ్రే, ప్రాణాలు కోల్పోయిన…

ఆత్మహత్య రైతులు పిరికిపందలు, నేరస్ధులు -బి.జె.పి

భూ సేకరణ చట్టం సవరణల ద్వారా తన రైతు వ్యతిరేక, ప్రైవేటు బహుళజాతి కంపెనీ అనుకూల స్వభావాన్ని చాటుకున్న బి.జె.పి ఇప్పుడు ఏకంగా రైతులపై నేరుగా దాడి చేసేందుకు సైతం వెనుదీయడం లేదు. ఢిల్లీలో ఎఎపి నిర్వహించిన రైతుల ర్యాలీలో ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడడాన్ని ‘నాటకం’గా అభివర్ణించిన హర్యానా వ్యవసాయ మంత్రి, ఆత్మహత్యకు పాల్పడే రైతులు ‘పిరికిపందలు’ అనీ, ‘నేరస్ధులు’ అనీ తిట్టిపోసాడు. “భారత చట్టం ప్రకారం ఆత్మహత్యకు పాల్పడడం నేరం. ఆత్మహత్యకు పాల్పడే ఏ…