కన్హైయాపై సాక్షాలు లేవుట!

“JNUSU అధ్యక్షుడు కన్హైయా కుమార్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే మేము వ్యతిరేకించం” అంటూ నిన్న ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎంతో ఔదార్యంతో ప్రకటించారు. ఎందుకని అడిగితే “వెల్ ఒక యువకుడి జీవితం” అని జవాబిచ్చారాయన. విద్యార్ధులను అరెస్టు చేసి కేసు పెట్టడంలోనూ, విలేఖరులను, విద్యార్ధులనూ చావబాదుతున్న వీడియోలు ఉన్నా హిందూత్వ గూండాలను వెనకేసుకు రావడంలోనూ ఎంతో ఉత్సాహం ప్రదర్శించిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ కి హఠాత్తుగా కన్హైయా యువ విద్యార్ధి అన్న సంగతి ఎందుకు గుర్తుకు…

పాటియాలా హౌస్ కోర్ట్: సంఘటనల క్రమం

ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో ఈ రోజు కన్హైయా కుమార్ ని పోలీసులు హాజరు పరచవలసి ఉంది. వాస్తవానికి నిన్ననే విచారణ జరగవలసి ఉండగా హిందూత్వ లాయర్ల వీరంగం వల్ల అది సాధ్యపడలేదు. ఈ రోజుకు వాయిదా వేశారు. ఈ రోజు కోర్టు సజావుగా నడవడానికి సుప్రీం కోర్టు నిర్దిష్ట ఆదేశాలు ఇచ్చింది. ఐదుగురు విలేఖరులు, ఇద్దరు కన్హైయా మద్దతుదారులు మాత్రమే హాజరు కావాలని చెప్పింది. ఈ నేపధ్యంలో మధ్యాహ్నం నుండి పాటియాలా హౌస్ కోర్టులో జరిగిన…

ఢిల్లీ కోర్టులో సుప్రీం కోర్టు ఆదేశాలకు దిక్కు లేదు!

నిన్నటి సుప్రీం కోర్టు గాండ్రింపులు పిల్లి కూతల కంటే అధ్వాన్నంగా మారిపోయాయి. ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. హిందూత్వ లాయర్ల వీరంగం ముందు భారత పార్లమెంటు, భారత న్యాయ చట్టాలు, పోలీసు వ్యవస్ధ… చేష్టలుడిగి నిలబడిపోయాయి. కన్హైయా కుమార్ ను హాజరుపరచవలసిన పాటియాలా కోర్టు ఆవరణలోకి చొచ్చుకు వచ్చిన హిందూత్వ గూండాలు -వారిలో కొందరు లాయర్లూ ఉండవచ్చు- జే‌ఎన్‌యూ విద్యార్ధులు, ప్రొఫెసర్లు, విలేఖరుల మీద మంగళవారం దాడి…

అసలు సమస్యలను తప్పించిన JNU-అఫ్జల్ రగడ!

ఏది దేశ ద్రోహం? ఏది దేశభక్తి? నిత్యం భావ సంఘర్షణలు జరిగే సమాజంలో ఉక్కు ద్రావకాన్ని పోత పోసి ఆరబెట్టినట్లుగా దేశభక్తి, దేశద్రోహం ఉండగలవా? ఉనికిలో ఉన్న మనుషులు అందరికీ ఒకటే దేశ భక్తి, ఒకటే దేశ ద్రోహం ఉండగలవా? మనిషి మెదడు వేనవేల ఆలోచనలకు నిలయం. మనిషి సామాజిక ఆచరణ ఎన్ని పోకడలు పోతుందో అన్ని పోకడలూ పొందగల వేలాది సంభావ్యతలు (probabilities) మనిషి మెదడులో వీరంగం ఆడుతుంటాయి. సమూహంలోని మనుషుల సామాజిక ఆచరణలో ఉమ్మడితనం…

పాక్ అనుకూల నినాదాలు చేసింది ఏ‌బి‌వి‌పి? -వీడియో

జవహర్ లాల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (జే‌ఎన్‌యూ‌ఎస్‌యూ) అధ్యక్షుడు కనహైయా కుమార్ పై ‘దేశ ద్రోహం’ కేసు మోపి ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇపుడీ వ్యవహారం సరికొత్త మలుపు తీసుకుంది. అఫ్జల్ గురును ఉరి తీసి 3 సం.లు పూర్తయిన సందర్భంగా ఫిబ్రవరి 9 తేదీన జే‌ఎన్‌యూ లో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్ధి సంఘం అధ్యక్షులు, మరి కొందరు విద్యార్ధులు పాక్ అనుకూల, ఇండియా వ్యతిరేక నినాదాలు చేశారని ఆరోపిస్తూ కేంద్ర…

ఫాసిజం: జే‌ఎన్‌యూ విద్యార్ధి నేత అరెస్ట్

హిందూత్వ ఫాసిజం తన ఫాసిస్టు ప్రయాణంలో మరో అడుగు వేసింది. ఈసారి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పంజా విసిరింది. విద్యార్ధుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అపహాస్యం చేస్తూ యూనివర్సిటీ విద్యార్ధి సంఘం అధ్యక్షుడు కన్హైయా కుమార్ పైకి ఢిల్లీ పోలీసులను ఉసి గొల్పింది. యూనివర్సిటీ విద్యార్ధులపై కఠిన చర్య తీసుకోవాలని తానే ఆదేశించానని కేంద్ర హోమ్ మంత్రి సగర్వంగా చాటుకున్నారు. యూనివర్సిటీ విద్యార్ధులు ‘జాతీయ-వ్యతిరేక’ భావోద్వేగాలు వ్యక్తం చేశారని కేంద్ర హోమ్ మంత్రి ఎకాఎకిన నిర్ధారించేశారు.…

మోడి పాస్ పోర్ట్: యశోదాబెన్ ఆర్‌టి‌ఐ దరఖాస్తు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తన భార్యగా ఎన్నికల నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న శ్రీమతి యశోదా బెన్ కు తమ పెళ్లి నిజంగానే జరిగిందని రుజువు చేసుకోవాల్సిన అవసరం వచ్చిపడింది. శ్రీమతి యశోదా బెన్ ను తన భార్యగా ప్రధాన మంత్రి పేర్కొన్న సంగతి పత్రికల ద్వారా తెలియడమే. అంతే తప్ప వాస్తవంగా పెళ్ళి జరిగిందని రుజువు చేసే రికార్డులు శ్రీమతి యశోదా బెన్ వద్ద లేవని ఆమెకు ఎదురయిన తాజా పరిస్ధితి ద్వారా అర్ధం అవుతున్నది.…

ఆసాంజే నిర్బంధం నిరంకుశం -ఐరాస

వికీలీక్స్ వ్యవస్ధాపక ఎడిటర్ జులియన్ ఆసాంజే నిర్బంధం చట్ట విరుద్ధంగా ఐక్యరాజ్యసమితి నిర్ధారించింది. ఆసాంజే దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ఐరాస కమిటీ ఈ మేరకు ఒక నిర్ధారణ వచ్చిందని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. అయితే కమిటీ నిర్ణయాన్ని అధికారికంగా శుక్రవారం ప్రకటిస్తారని పత్రిక తెలిపింది. స్వీడన్ లో దాఖలయిన ఒక తప్పుడు కేసు దరిమిలా లండన్ లోని ఈక్వడార్ ఎంబసీలో గత నాలుగు సంవత్సరాలుగా లండన్ పోలీసు నిర్బంధంలో ఆసాంజే గడుపుతున్నాడు. ఆసాంజేను…

రోహిత్, రాధిక: అచ్చమైన దళిత కధ! -3

MA MEd చదివిన ఉపాధ్యాయురాలు తన ఆడ పిల్లలను BSc-BEd, BCom-BEd లు చదివించుకుంది. అందులో తప్పు పట్టాల్సింది ఏ కోశానా లేదు. కానీ ‘నా సొంత కూతురు లాంటిది’ అని చెప్పిన రాధికకు మాత్రం అత్తెసరు చదువుతో ముగించేయడం ఎలా అర్ధం చేసుకోవాలి, ఉపాధ్యాయురాలు అయి ఉండి కూడా! అదీ కాక, తన ‘సొంత కూతురుతో సమానం’ అయినప్పుడు 14 సంవత్సరాలకే పెళ్లి చేసి పంపేయడం ఎలా సాధ్యం! బాల్య వివాహాలు చట్ట విరుద్ధం అన్న…

అచ్చమైన దళిత కధలో పాత్రలు రోహిత్, రాధిక -2

మొదటి భాగం తరువాత……………….. – రాధిక ఎదుర్కొంటున్న హింసను చూసి ఆమెను ‘దత్తత’ తెచ్చుకున్న అంజని, బహుశా, తన తప్పు సవరించుకునే పనిలో పడ్డారు. మణి నుండి తన కూతురు, మనవళ్లను రక్షించుకున్నానని ఆమె చెప్పారు. “వాళ్ళు మణిని వదిలిపెట్టి వచ్చేశారు. 1990లో వాళ్ళను మళ్ళీ మా ఇంట్లోకి ఆహ్వానించాను” అని అంజని చెప్పారు. అయితే రాధిక చెప్పింది అది కాదు. ఈ విషయాలు హిందూస్తాన్ విలేఖరికి చెబుతున్నప్పుడు రాధిక, అంజని పక్కనే ఉన్నారు. అంజని స్పష్టమైన…

రాధిక, రోహిత్: అచ్చమైన దళిత కధలో పాత్రలు -1

పాలక పార్టీ తాజాగా మరో కేంద్ర మంత్రిని రంగంలోకి దించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్ధుల ఆందోళనను పరిష్కరించేందుకు కాదు. రోహిత్, మరో నలుగురు దళిత విద్యార్ధులపై మరింత బురద జల్లేందుకు. యూనివర్సిటీ పాలకవర్గం ద్వారా తాము సృష్టించిన సమస్య నుండి దళిత కోణాన్ని తొలగించడానికి స్మృతి ఇరానీ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో విదేశాంగ మంత్రిని కేంద్రం ప్రవేశపెట్టింది. “నాకు అందుబాటులో ఉన్న సంపూర్ణ సమాచారం మేరకు రోహిత్ అసలు దళితుడే కాదు. ఆయన దళితుడని…

రోహిత్: చట్టం ఉల్లంఘన కాదు, అణచివేతకు ప్రతిఘటన!

“మొదట దళిత సమస్య, ఆ తర్వాతే విద్యార్ధి సమస్య” శీర్షిక గల ఆర్టికల్ కింద వ్యాఖ్యాతల అభిప్రాయాలకు సమాధానం ఈ టపా. ********* మీ ప్రశ్నల రీత్యా నేను చెప్పవలసినవీ, అడగవలసినవి కొన్ని ఉన్నాయి. విషయం మొత్తాన్ని ‘చట్టం పాటించడం లేదా అతిక్రమించడం’ లోకి మీరు కుదించివేశారు. ఆ పరిధి వరకే మీ దృష్టి ఉన్నట్లయితే అది మీ యిష్టం. కానీ ఈ అంశం కేవలం చట్టం అనుసరణ/ అతిక్రమణ వరకే పరిమితం అయిందని నేను భావించడం…

రోహిత్: అబ్బే మేము తాకనిదే! -కార్టూన్

రోహిత్ వేముల ఆత్మహత్యకు తాము బాధ్యులం కాదని బాధ్యులైన వారంతా వివిధ మాటల్లో ప్రకటించారు. “ఇది దళిత-దళితేతర సమస్య” కాదు అనీ “శిక్షించిన కమిటీ నేత దళిత ప్రొఫెసరే” అనీ  ప్రకటిస్తూ కేంద్ర మానవ వనరుల మంత్రి దూరం జరిగారు. “ఐదు రిమైండర్ లు రాయడం మామూలే. ఒత్తిడి కాదు” అని కూడా ఆమె నిరాకరించారు. “ఇది నేను తీసుకున్న చర్య కాదు. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీసుకున్నది” అంటూ వైస్ ఛాన్సలర్ అప్పారావు గారు నిరాకరణ…

రోహిత్ వేముల దళితుడు కాదా?

యూనివర్సిటీ ఆఫ్ హైదారాబాద్ లో సస్పెన్షన్ కు గురై ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల కులం గురించి ఈ నాలుగు రోజుల్లోనే అనేక కాకమ్మ కధలు ప్రచారంలో పెట్టారు. అనేక ఆడియోలు, వీడియోలు (డాక్టర్డ్) ప్రదర్శించారు. ఈ పుకార్లు, కధలు, వీడియోలు ప్రచారం చేసిపెట్టడంలో ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉన్న వార్తా ఛానెళ్లు, ముఖ్యంగా ఆంగ్ల వార్తా ఛానెళ్లు తలమునకలుగా సహకరించాయి. రోహిత్ ఆత్మహత్య దేశవ్యాపితంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన దళితుడు కావడం వల్లనే…

రోహిత్ ఆత్మహత్య: సస్పెన్షన్ ఎత్తివేత

కేంద్ర ప్రభుత్వ విశ్వ విద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రోహిత్ మిత్రులు నలుగురు రీసర్చ్ స్కాలర్ విద్యార్ధులపై స్పస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సస్పెన్షన్ ఎత్తివేత తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. సస్పెన్షన్ ఎత్తివేసినందున విద్యార్ధులంతా సాధారణ విద్యా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని వైస్ ఛాన్సలర్ పి అప్పారావు కోరారు. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నియమించిన సబ్ కమిటీ గురువారం సమావేశమై సస్పెన్షన్ ను బేషరతుగా ఎత్తివేయడానికి నిర్ణయించిందని పాలకవర్గం ఒక ప్రకటనలో పేర్కొంది. “యూనివర్సిటీలో నెలకొన్న అసాధారణ…