గాయపడింది నేను, నా గౌరవం కాదు -సొహైలా అబ్దులాలి

(న్యూయార్క్ టైమ్స్ పత్రికలో జనవరి 7, 2013 తేదీన ప్రచురించబడిన ఆర్టికల్ కి ఇది యధాతధ అనువాదం. సొహైలా అబ్దులాలి రచన ఇది. 17 సంవత్సరాల వయసులో అత్యాచారానికి గురై, పోలీసుల సహకార నిరాకరణవల్ల దోషులకు శిక్ష పడకపోయినా, తల్లిదండ్రుల మద్దతుతో పరిపూర్ణ రచయితగా, కార్యకర్తగా, వక్తగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన సొహైలా అబ్దులాలి మొత్తం సమాజానికి స్ఫూర్తిమంతురాలు. అత్యాచారం జరిగిన మూడేళ్ల తర్వాత అత్యాచారం గురించి వివరిస్తూ తానే ‘మానుషి’ పత్రికకు వ్యాసం రాసి శీలం…

అత్యాచారాలపై ఎలా స్పందించాలి? ఓ బాధితురాలి మాటల్లో… -వీడియో

ఈ వీడియోలో మాట్లాడుతున్న వక్త పేరు సునీతా కృష్ణన్. స్వచ్ఛంధ సంస్ధగా ఎందరో పాపలను, బాబులను, అమ్మాయిలను, మహిళలను కాపాడిన ఈమె స్వయంగా చిన్నతనంలో జరిగిన సామూహిక అత్యాచారానికి బాధితురాలు. పేగులు బైటికి వచ్చే విధంగా అనేకమంది చేత అత్యాచారం చేయబడిన నాలుగేళ్ల పాప గురించీ ఇంకా అనేకమంది గురించీ ఈమె చెబుతుంటే మనుషుల మానవత్వంపై గట్టి అనుమానం రాకతప్పదు. ఫ్లెష్ ట్రేడ్ బాధితులకు ధైర్యం ఇవ్వడానికి టన్నుల కొద్దీ సానుభూతి ఇచ్చినా అది అక్కరకు రాదనీ…

బుద్ధి జీవులు ఆగ్రహోదగ్రులైన వేళ -ఫోటోలు

అనేకానేక ప్రభుత్వ, ప్రవేటు ఆఫీసులు, కాల్ సెంటర్లు, ఐ.టి కంపెనీలు తదితర ఆధునిక రంగాల్లో పనిచేస్తున్న మేధోవర్గ ప్రజలు రోడ్డు మీదికి రావడం అరుదు. వారు తమను తాము భద్రజీవులుగా భావించుకోవడం దానికి ఒక కారణం కావచ్చు. డిసెంబరు 16 తేదీన జరిగిన దారుణకృత్యం తర్వాత తమకు కూడా భద్రత లేదని వీరికి తెలిసివచ్చింది. ఆర్ధిక భద్రత అనేది జీవితంలో ఒక భాగమేననీ, సామాజిక భద్రత కావాలంటే రోడ్డు మీదికి రాక తప్పదని వారి అవగాహనలోకి వచ్చింది.…

కూతుళ్ళకి కాదు, కొడుకులకు కాపలా కాయండి!

(రచన: రమ) ఢిల్లీ బస్సులో జరిగిన సామూహిక అత్యాచార దుర్ఘటన ఎన్నడూ లేనివిధంగా ప్రజాగ్రహానికి గురయింది. మధ్య తరగతి యువతీ యువకులు వీధుల్లోకి వచ్చి రోజుల తరబడి తీవ్రస్ధాయిలో ఉద్యమించారు. వీరివెనుక ఎలాంటి రాజకీయ పార్టీలుగానీ, విద్యార్ధి సంఘాలుగానీ, ఇతరేతర సంఘాలుగానీ ఉన్న ధాఖలాలు కనపడలేదు. 1975లో హైదరాబాదులో జరిగిన రమీజాబీ అత్యాచార దుర్ఘటన తరువాత యింత ఉధృతమైన ప్రజాప్రతిఘటన అత్యాచారాల విషయంలో ఇదేనని చెప్పవచ్చు. రమీజాబీ విషయంలో విద్యార్ధి సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు ఒక…

నా కూతురి పేరు ప్రపంచానికి తెలియాలి -బద్రిసింగ్ పాండే

“ప్రపంచానికి నాకూతురు పేరు తెలియాలి. నాకూతురు తప్పేమీ చేయలేదు. తననుతాను కాపాడుకునే ప్రయత్నంలో ఆమె చనిపోయింది… నా కూతురంటే నాకు గర్వంగా ఉంది. ఆమె పేరు వెల్లడిస్తే ఇలాంటి దాడులు ఎదుర్కొని బైటపడినవారికి ధైర్యంగా ఉంటుంది. నాకూతురినుండి వారు శక్తిని పొందుతారు” అని 53 సంవత్సరాల బద్రిసింగ్ పాండే చెప్పడాని బ్రిటన్ పత్రిక ‘సండే పీపుల్’ తెలిపింది. మరో ప్రఖ్యాత పత్రిక ‘డెయిలీ మిర్రర్’ కి ఇది అనుబంధం. అమ్మాయి పేరును కూడా పత్రిక వెల్లడించింది. ఉత్తర…

ఉరి వద్దు, సజీవ దహనం చెయ్యండి -అమానత్ కోరిక

అమానత్/దామిని/నిర్భయ మిత్రుడు మౌనం వీడి కొన్ని చేదు నిజాలు చెప్పాడు. సాయం కోసం అరిచినా 45 నిమిషాల సేపు ఒక్క వాహనంగానీ, ఒక్క వ్యక్తిగానీ ఆగకుండా వెళ్లిపోయారని అతను తెలిపాడు. తన స్నేహితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో పోలీసులు విపరీతమైన ఆలస్యం చేశారనీ, నగ్నంగా ఉన్న తనకుగానీ, తన స్నేహితురాలికిగానీ కనీసం కప్పుకోవడానికి ఒక గుడ్డ ఇచ్చిన పాపాన పోలేదనీ అతను ఆరోపించాడు. విపరీతంగా రక్తం కారుతున్న తన స్నేహితురాలిని తానొక్కడినే ఎత్తుకుని పి.సి.ఆర్ (పోలీస్ కంట్రోల్ రూమ్)…

ఢిల్లీ అత్యాచారం: కొనసాగుతున్న గోప్యత ఎవరి ప్రయోజనాలకు?

మరిన్ని రక్షణలతో రూపొందనున్న కొత్త అత్యాచార నిరోధ చట్టానికి ఢిల్లీ అత్యాచారం బాధితురాలి పేరు పెట్టడానికి సూచన వచ్చింది. కేంద్ర మంత్రి శశిధరూర్ ఈ సూచన చేశాడు. అమ్మాయి పేరుని ఇంతవరకూ బైటపెట్టకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన శశిధరూర్ అమ్మాయి తల్లిదండ్రులు, సోదరులు అంగీకరిస్తే నూతన సవరణలతో కూడిన చట్టానికి అమ్మాయి పేరే పెట్టాలని ఆయన కోరాడు. బాధితురాలి తల్లిదండ్రులు, సోదరులు అందుకు తమకు అభ్యంతరం లేదని తెలియజేశారని ‘ది హిందూ’ తెలిపింది. ప్రభుత్వానికి ఈ ఆలోచన…

అమ్మాయిల గౌన్లు అశ్లీలమా? వీళ్ళు కదా రేపిస్టులకు కాపలాదార్లు!

స్కూళ్ళు, కాలేజీల అమ్మాయిలు గౌనులు ధరించడం వల్లనే వారికి సమస్యలు వస్తున్నాయనీ, కనుక విద్యార్ధినులు గౌను ధరించడం నిషేధించాలనీ రాజస్ధాన్ కి చెందిన ఒక ఎమ్మెల్యే తమ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖరాసి కలకలం సృష్టించాడు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ఆగ్రహించిన విద్యార్ధినులు ఆయన ఇంటిముందు నిరసన నిర్వహించడమే కాకుండా ఆయనాకొక గౌను బహూకరించారు. అమ్మాయిల దుస్తుల ధారణపై ప్రతికూల వ్యాఖ్యలు చేసి అప్రతిష్టపాలవుతున్న వారి జాబితాలో ఆళ్వార్ నగర నియోజకవర్గ ఎమ్మెల్యే బన్వరీలాల్ సింఘాల్ చేరిపోయాడు.…

ప్రజా ప్రతిఘటనకు ప్రతిరూపంగా హైవే నడిబొడ్డున నిలిచిన చైనా ఇల్లు

ప్రజల కనీస అవసరాలపై కూడా ఆధిపత్యం చెలాయించే ధనికవర్గ ప్రభుత్వాలకు ప్రజాసామాన్యం ఇచ్చే ప్రతిఘటనకు సంకేతాత్మక రూపం ఈ ఇల్లు. ఝెజియాంగ్ రాష్ట్రంలోని వెన్ లింగ్ పట్టణంలో నూతనంగా నిర్మించిన రోడ్డు కోసం ప్రజల ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. జీవితం అంతా కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇటీవలే నిర్మించుకున్న తన ఇంటిని కూల్చడానికి అంగీకరిస్తూ సంతకం పెట్టడానికి ఓ వృద్ధ జంట నిరాకరించడంతో ప్రధాన రోడ్డు నడి మధ్యలో ఈ ఇల్లు ఇలా నిలబడిపోయింది. యాజమానుల అంగీకారం…

తమిళనాడులో ప్రమాదకర ధోరణి, దళితుల అణచివేతకు ఐక్యమవుతున్న కులశక్తులు

ధర్మపురి జిల్లాలో జరిగిన కులాంతర వివాహం, అనంతరం జరిగిన గృహ దహనాలు దళిత వ్యతిరేక కులదురహంకార శక్తుల ఐక్యతకు మార్గం వేసినట్లు కనిపిస్తోంది. అత్యంత వెనుకబడిన కులం (ఎం.బి.సి) గా తమిళనాడు ప్రభుత్వం గుర్తించిన వన్నియార్ కులసంఘాన్ని పునాది చేసుకుని దళితుల ఆత్మగౌరవ ప్రతిఘటనను అణచివేసేందుకు కులరాజకీయ శక్తులు కుట్రలు చేస్తున్నాయి. వన్నియార్ కులతత్వం ఆధారంగా ఆవిర్భవించి బలపడిన పి.ఎం.కె అనే రాజకీయ పార్టీ ఇటువంటి తీవ్ర అభివృద్ధి నిరోధకమైన ఎజెండాను తమిళనాడులో ప్రవేశపెట్టి సమాజ ప్రగతిని…

తీవ్ర సామాజిక సంక్షోభంలో అమెరికా

2007-08లో వాల్ స్ట్రీట్ కంపెనీలు తెచ్చిపెట్టిన ఆర్ధిక సంక్షోభం అమెరికన్ ప్రజలను పట్టి పల్లార్చుతోంది. పెట్టుబడిదారీ కంపెనీలు తమ సంక్షోభాన్ని కార్మికవర్గం పైకీ, ప్రజా సామాన్యం పైకీ బదలాయించడంలో విజయవంతం కావడంతో అమెరికన్ ప్రజానీకం సామాజిక సంక్షోభంతో అతలాకుతలం అవుతోంది. సంక్షోభం తెచ్చిన ‘టూ బిగ్ టు ఫెయిల్’ కంపెనీలు ఎప్పటిలా భారీ లాభాలతో అలరారుతుండగా కార్మికులు, ఉద్యోగులు నిరుద్యోగం, దరిద్రం, ఆకలి, రోగాలతో సతమతం అవుతోంది. గత మూడున్నర సంవత్సరాలలోనే కోట్లాది మంది అమెరికన్లు పని…

ఫేస్ బుక్ అరెస్టు: ఎస్.పి సస్పెన్షన్, జడ్జి బదిలీ

ఫేస్ బుక్ వ్యాఖ్యలను పట్టుకుని ఇద్దరు అమ్మాయిలను అరెస్టు చేసిన కేసులో తలలు తెగిపడుతున్నాయి. సుప్రీం కోర్టు మాజీ జస్టిస్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జు బహిరంగ హెచ్చరిక పర్యవసానంగా దేశ వ్యాపితంగా న్యాయ వర్గాలలో కూడా కాక పుట్టించిన ఫేస్ బుక్ అరెస్టు భారత ప్రజాస్వామ్య సౌధం బండారాన్ని బైటపెట్టే పరిస్ధితి తలెత్తడంతో బలి పశువుల తలలు దొర్లి పడుతున్నాయి. ధాణే జిల్లా ఎస్.పి (రూరల్) తో పాటు ఇద్దరు…

పొదుపు విధానాలపై ఆందోళనలతో అట్టుడుకుతున్న యూరప్ -ఫోటోలు

గత రెండున్నర సంవత్సరాలుగా యూరోపియన్ దేశాలు అమలు చేస్తున్న పొదుపు ఆర్ధిక విధానాలు దాదాపు అన్నివర్గాల ప్రజలను వీధుల్లోకి తెస్తున్నాయి. ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రవేటీకరణ వల్ల లక్షలాది ఉద్యోగాలు రద్దవుతున్నాయి. ఉద్యోగుల వేతనాల్లో భారీగా కోత విధించారు. పెన్షన్లను కూడా వదలకుండా దోచుకుంటున్నారు. వేతనాలు కోత పెట్టడమే కాకుండా ఉద్యోగులు, కార్మికుల సంక్షేమ సదుపాయాలను కూడా రద్దు చేస్తున్నారు. దానితో ఆరోగ్య భద్రత కరువై వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఒకవైపు వేతనాలు తగ్గిస్తూ మరోవైపు పన్నులు…

అమెరికా రాయబారి హత్యతో ఉనికిని చాటుకుని పురోగమిస్తున్న గడాఫీ అనుకూల ‘గ్రీన్ రెసిస్టెన్స్’ -1

ప్రపంచ వాణిజ్య సంస్ధ జంట టవర్లపై దాడులు జరిగి సెప్టెంబర్ 11, 2012 తో 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. అదే రోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు లిబియాలో రెండో అతి పెద్ద పట్టణమైన బెంఘాజిలో అమెరికా రాయబారి కార్యాలయంపై విధ్వంసకర దాడులు జరిగాయి. దాడిలో అమెరికా రాయబారి క్రిస్టఫర్ స్టీవెన్స్ దుర్మణం చెందాడు. సంవత్సరం పైగా లిబియా ప్రజలపైనా, ప్రభుత్వంపైనా నాటో యుద్ధ విమానాల సాయంతో ముస్లిం టెర్రరిస్టు సంస్ధలు సాగించిన విధ్వంసకాండకీ, సామూహిక జనహననానికీ క్రిస్టఫర్…

గ్వాంగ్జూ హత్యాకాండ నిర్మాతకు రాయబార హోదా, కొరియా చీకటిగాధ మరోసారి

దక్షిణ కొరియా ప్రజలు భయోత్పాతంతో గుర్తుకు తెచ్చుకునే గ్వాంగ్జూ సామూహిక హత్యాకాండ బాధ్యుడు ప్రభుత్వం ఇచ్చిన డిప్లొమేటిక్ ట్రావెల్ పాస్ పోర్ట్ తో దర్జాగా ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడు. ప్రజాస్వామిక ఉద్యమకారులను చంపినందుకు కొరియా ప్రభుత్వం చేత మరణ శిక్ష కూడా విధించబడిన మాజీ కరకు నియంత ‘చున్ దూ-హ్వాన్’ ఇపుడు ప్రభుత్వ మర్యాదలు అనుభవిస్తున్నాడు. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో నియంతృత్వ పాలన అంతం కావడానికి కారణమయిన ప్రజాస్వామిక ఉద్యమాన్ని చున్ రక్తపుటేరుల్లో ముంచెత్తాడు. అమెరికా రాయబారి ప్రత్యక్ష…