క్లుప్తంగా… 05.05.2012
జాతీయం వేచి చూస్తాం -రాష్ట్రపతి ఎన్నికపై లెఫ్ట్ పార్టీలు రాష్ట్ర పతి ఎన్నికకు సంబంధించి వేచి చూడడానికి నిర్ణయించుకున్నామని లెఫ్ట్ పార్టీలు తెలిపాయి. సి.పి.ఐ, సి.పి.ఎం, ఆర్.ఎస్.పి ఫార్వర్డ్ బ్లాక్ న్యూఢిల్లీలో సమావేశమై మాట్లాడుకున్న అనంతరం తమ నిర్ణయం ప్రకటించాయి. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్.సి.పి పార్టీ మాత్రం ఉప రాష్ట్రపతి ‘హమీద్ అన్సారీ’ కంటే ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ యే తమకు ఆమోదయోగ్యమని ప్రకటించింది. అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ‘సెక్యులర్’ పార్టీల అభిప్రాయం…












