మన్మోహన్: రాహుల్ గాంధీ బరువు తూచే యంత్రం?

అధికారం, హోదా అన్నీ ఉన్నా కూడా ఏమీ చేయని/చేయలేని వ్యక్తిని ‘ఉత్సవ విగ్రహం’గా చెప్పుకోవడం పరిపాటి!అవడానికి ప్రధమ పౌరుడే అయినా ఎలాంటి కార్యనిర్వాహక అధికారాలూ లేని, కేవలం కేంద్ర మాంత్రివర్గం ఆమోదించిన నిర్ణయాలపైన సంతకం మాత్రమే పెట్టగల రాష్ట్రపతిని ‘రబ్బర్ స్టాంప్’ గా సంభోధించడమూ తెలిసిందే. ప్రధాన మంత్రి పదవి వీటికి భిన్నం. అది భారత దేశంలో అత్యున్నత అధికారం కలిగిన పదవి. ఆ పదవిని అమెరికా కంపెనీలకు తప్ప భారత దేశ ప్రజలకు ఉపయోగించని మన్మోహన్…

అందరూ దొంగలే, ఎవరికీ ఓటు వేయం -కార్టూన్

ఎన్నికల్లో ఓటు హక్కుకు సంబంధించి సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం ఒక తీర్పు ప్రకటించింది. ఒక నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్ధులందరినీ తిరస్కరించే హక్కు ఓటర్లకు ఉండాలనేది ఆ తీర్పు తాత్పర్యం. అభ్యర్ధులందరిని తిరస్కరించే హక్కు ఓటర్ కి ఉండాలనీ, అది కూడా భావ ప్రకటనా స్వేచ్చలో భాగమేననీ సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ మేరకు ఇ.వి.ఎం మిషన్లలో ‘ఎవరూ కాదు’ అనే బటన్ చేర్చాలని ఎన్నికల కమిషన్ ను ఆదేశిస్తున్నట్లు పేర్కొంది.…

జనరల్ వి.కె.సింగ్ విశ్రాంత కాలం తీరే వేరు -కార్టూన్

పదవీ విరమణ చేశాక ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ విశ్రాంత కాలాన్ని ఎంజాయ్ చేస్తారు. కానీ జనరల్ వి.కె.సింగ్ పదవీ విరమణ చేశాక తన కాలాన్ని ఎంజాయ్ చేస్తున్న తీరు మాత్రం ప్రత్యేకం అనే చెప్పుకోవాలి. ఒకసారి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా హజారే పక్కన కనిపిస్తారు. మరోసారి ఆర్మీ కుంభకోణాలపై గొంతెత్తుతారు. మరోసారేమో ఏకంగా బి.జె.పి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడి తోనే వేదిక పంచుకుంటారు. జనరల్ వి.కె.సింగ్ ఎంజాయ్ మెంటు ఎలా ఉన్న దానివల్ల…

సి.బి.ఐ సుత్తితో బాది సానపెడితే, ఆ కత్తే వైకాపా -కార్టూన్

ఈ కార్టూన్ చూసి నవ్వని, కనీసం నవ్వుకోని వారు ఎవరన్నా ఉంటే వారికి ఏదో సమస్య ఉన్నట్లే అనుకోవాలి. ‘మాట తప్పని, మడమ తిప్పని’ వంశం అని చెప్పుకున్నవారు సోనియాగాంధీ కాళ్ళు పట్టుకుని బెయిల్ ఇప్పించుకున్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక పక్క ఆరోపిస్తున్నారు. టి.డి.పి నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి అయితే ఒకడుగు ముందుకేసి వై.ఎస్.ఆర్ భార్య వై.ఎస్.విజయ నిన్న సోనియాగాంధీకి ఫోన్ చేసి ‘బెయిల్’ ఇప్పించినందుకు ధన్యవాదాలు కూడా చెప్పారని ఆరోపించారు. అదే నిజమైతే…

ధరలు తగ్గాయ్, షేర్లు కొందాం! -కార్టూన్

పత్రిక చదువరి: “ద్రవ్యోల్బణ వ్యతిరేక చర్యలు పని చేసి ధరలు కుప్ప కూలినై” గృహిణి: “భలే – ఇంకేం, ఇక షేర్లు కొనేద్దాం” మరుగుజ్జు వంత: “ఇంకేం, కేకు తినేద్దాం” రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్ద మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో ఈ కార్టూన్ తెలియజేస్తోంది. అంతేకాదు, వారి మాటలకు ఉండే ద్వంద్వార్ధాలు, ఒక్కోసారి బహుళార్ధాలు కూడా వస్తాయన్న సంగతినీ సూచిస్తోంది. ద్రవ్యోల్బణం ఆగస్టు చివరి నాటికి 6.1 శాతానికి పెరిగిందని కాబట్టి ధరల్ని కట్టడి చేయడానికి…

అద్వానీ స్ధానం అదే! -కార్టూన్

“చివరికి ఈ పరిస్ధితి వచ్చిందా! మన గురువుగారు అద్వానీజీని గురువు స్ధానంలోనే ఉండమని నచ్చజెప్పడానికి ఒక రధయాత్ర చేయాల్సివచ్చిందన్నమాట!” మొత్తం మీద బి.జె.పి పార్టీకి ఒక యజ్ఞం పూర్తయింది. ప్రధాన మంత్రి పదవి కుర్చీలో కూర్చోవాలన్న అద్వానీ కలను నరేంద్ర మోడి గద్దలా వచ్చి తన్నుకుపోయారు. రధయాత్రతో మత ఘర్షణల మంటలు రేపి పార్లమెంటులో సీట్ల చలి కాచుకున్న గురువు గారికి, దేశచరిత్రలో మచ్చగా మిగలాల్సిన కరసేవకుల దహనాన్ని ముస్లింల దహనకాండతో మాపుకున్న శిష్యుడు! గురువును మించిన…

ప్రవేశపెడ్తున్నాం, మోడి ఫిడేల్ సింఫొనీ -కార్టూన్

బి.జె.పి ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడిని ప్రకటించే రోజు ‘ఇదిగో ఈ రోజే’ అనీ, ‘కాదు, కాదు రేపే’ అనీ పత్రికలు, ఛానెళ్లు ఒకటే రచ్చ! కానీ ఆ రోజు మాత్రం రావడం లేదు. సెప్టెంబరు 17 లోపు ప్రకటిస్తారని తాజాగా పత్రికల కధనం. కానీ అద్వానీని మె(ఒ)ప్పించడమే బి.జె.పి, ఆర్.ఎస్.ఎస్ సంస్ధలకు మహా కష్టం అయిందని వార్తలు చెబుతున్నాయి. ఆర్.ఎస్.ఎస్ పనుపున, ఆర్.ఎస్.ఎస్ రాయబారిగా మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ అద్వానితో చర్చలు జరపడం ఒకసారి…

యు.పి: మంటలు ఆర్పు తున్నట్లా? ఎగదోస్తున్నట్లా?

ఉత్తర ప్రదేశ్ లో మరొకసారి మత విద్వేషపు మంటలు రగిలాయి. కాదు, రగల్చబడ్డాయి. బి.జె.పి ఒక ప్రణాళిక ప్రకారం కుట్ర చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టిందని సమాజ్ వాదీ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ కూడా అదే ఆరోపణలు చేస్తోంది. జరిగిన సంఘటనలు కూడా ఆ వాదనను నిజం చేస్తున్నాయి. బి.కె.యు అనే రైతు సంఘం నిర్వహించిన భారీ బహిరంగ సభలో బి.జె.పి నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లనే భారీ సంఖ్యలో (ఇప్పటివరకూ 40 మంది చనిపోయారని…

నేను తప్పిపోతే బావుడ్ను -కార్టూన్

రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది అనడిగితే మౌనమే సమాధానం! ‘బిల్లుల ఆమోదానికి సహకరించం’ అని ప్రతిపక్షాలు మొండికేస్తే అప్పుడు కాస్త నోరు పెగుల్చుకుని ‘స్వదేశీ, విదేశీ రెండు కారణాలు పని చేస్తున్నాయి’ అని చెప్పి ఊరుకున్నారు. గట్టిగా అడిగితే మరిన్ని సంస్కరణలు తెస్తే మళ్ళీ మొదలు పెట్టొచ్చు అంటూ ‘పెనం మీంచి పొయ్యిలోకే దూకుతాం’ అని చెబుతారు, ప్రధాని మన్మోహన్.

బి.జె.పి… బోడి మల్లయ్య -కార్టూన్

“ఒడ్డు చేరేదాకా ఓడ మల్లయ్య, ఒడ్డు చేరాక బోడి మల్లయ్య!” ఈ సూత్రాన్ని కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బి.జె.పి పైన ప్రయోగించిందని కార్టూన్ సూచిస్తోంది. కాని, అది నిజమేనా? ఉప్పు-నిప్పుగా ప్రజలకు కనిపించే కాంగ్రెస్, బి.జె.పిలు ఒక్కటై ఆహార భద్రతా బిల్లు, భూ స్వాధీన బిల్లు లను ఆమోదించాయి. బిల్లులు ఆమోదం పొందేవరకు ఇరు పక్షాలు ఒకరినొకరు బాగా సహకరించుకున్నాయి. ఆహార భద్రతా బిల్లులో బి.జె.పి చేసిన కొన్ని సవరణలను ఆమోదించేవరకు కాంగ్రెస్ వెళ్లింది. కొన్ని సవరణలను…

మబ్బుల్లో నీళ్ళు చూసి…. -కార్టూన్

మబ్బుల్లో నీళ్ళు చూపించి ఓటు అడగబోతున్నారా కాంగ్రెస్ వాళ్ళు? ఆహార భద్రతా బిల్లును చారిత్రాత్మకంగా అభివర్ణించిన కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, ఈ బిల్లును ప్రవేశ పెట్టడం తన అదృష్టంగా చెప్పుకున్నారు. ఈ పధకం ద్వారా దేశంలో 70 కోట్ల మందికి ఆహార భద్రత లభించనున్నదని ఆమె లోక్ సభలో బిల్లు ప్రవేశపెడుతూ ప్రకటించారు. 67 యేళ్ళ స్వతంత్ర భారతంలో ఇప్పటివరకూ 70 కోట్ల మందికి ఆహార భద్రత లేదని కాంగ్రెస్ నాయకురాలు పరోక్షంగా అంగీకరించారు. బిల్లు…

పరిక్రమ: మోడి వోటు బ్యాంకుకు రూటు -కార్టూన్

– బి.ఎజే.పి ప్రచార రధ సారధి మోడితో: మన పైలట్ వాహనం దెబ్బతిని కూలిపోయింది! – ఉత్తర ప్రదేశ్ లో విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన ‘చౌరాసి కోసి పరిక్రమ యాత్ర’ దాదాపు అభాసుపాలయింది. ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం వి.హెచ్.పి యాత్రపై విరుచుకుపడడంతో యాత్ర లాంఛనప్రాయంగా ప్రారంభం అయినట్లు ప్రకటించి ఊరుకున్నారు. అసలు పరిక్రమ యాత్ర ఇప్పటికే సాంప్రదాయ బద్ధంగా నిర్దిష్ట కాలంలో తాము పూర్తి చేయగా వి.హెచ్.పి తలపెట్టిన యాత్ర…

అవినీతికి హక్కు లేదా? -కార్టూన్

– “మా సొంత ఇంధనాన్ని ఉత్పత్తి చేసుకునే హక్కు కూడా మాకు లేదా?” – సమాచార హక్కును ప్రవేశ పెట్టిన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వమే ఆ చట్టానికి తూట్లు పెట్టే కృషిలో నిమగ్నం అయింది. సమాచార హక్కు చట్టం ప్రవేశపెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ తనను తాను అభినందించుకుంటుంది. ప్రజాస్వామ్య సూత్రాలకు తాను గొప్పగా కట్టుబడి ఉన్నానని చెప్పుకోడానికి ఆర్.టి.ఐ చట్టాన్ని ఆ పార్టీ తరచుగా ఉదహరిస్తుంది. కానీ ఆ చట్టం ద్వారా పాలకుల అవినీతి వెల్లడి అవుతుండేసరికి…

రూపాయి-పార్లమెంటు: పతనం దేనిది? -కార్టూన్

నాయకుడు: అది పార్లమెంటే! సామాన్యుడు: కాదది రూపాయే! ఒక పక్క రూపాయి విలువ పతనం అవుతుండగా ఆర్ధిక వ్యవస్ధ తీరుతెన్నులను చర్చించి సవరించవలసిన చట్ట సభల సభ్యులు మాత్రం సంకుచిత రాజకీయ ప్రయోజనాలే పరమార్ధంగా రకరకాల సర్కస్ ఫీట్లు సాగిస్తున్నారు. ‘ఆహార భద్రతా బిల్లు,’ ‘ఇన్సూరెన్స్ ఎఫ్.డి.ఐ బిల్లు,’ తదితర ప్రజా వ్యతిరేక బిల్లులకు ఆమోదం పొందడానికి పాలక పక్షం చిత్రవిచిత్రమైన ఎత్తుగడలు వేస్తుండగా, పాలక పక్షం పరువు తీసి వీలైనన్ని ఓట్ల మార్కులు తమ ఖాతాలో…