అవినీతి నేతల చిట్టా -కార్టూన్

“ఈసారి నుండి సారూ, అవినీతికి పాల్పడని నాయకుల జాబితా తయారు చేయమని అడగండి. అలాగైతేనే సమయం వృధా కాదు…” – అవినీతి నేతల చిట్టా తయారు చేయడం ఎంత కష్టమో ఈ కార్టూన్ చెబుతోంది. అనేకమంది నేతల్లో అవినీతి నేతలను వెతుక్కోవలసి రావడం కాదు ఆ కష్టం. అవినీతి నేతలను కనిపెట్టడం తేలికే గానీ వారి పేర్లను రాస్తూ పోవడమే అసలు కష్టం. కనపడ్డా ప్రతి రాజకీయ నాయకుడూ ఏదో ఒక సందర్భంలో అవినీతి సంపాదన ఆరోపణ,…

ఓ యువరాణి, ఓ బఠాణి -అద్భుతమైన కార్టూన్

అవును! నిజంగా ఈ కార్టూన్ చాలా అద్భుతమైంది. దీన్ని అర్ధం చేసుకోవాలంటే మొదట ఒక చిన్న స్వీడిష్ కధ తెలుసుకోవాలి. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యానికి ఒక యువరాజు. ఆయనకి పెళ్లి వయసు వచ్చేసింది. కానీ ఆయనకి ఎంతకీ వధువు నచ్చడం లేదు. కారణం ఆయనకి ఉన్న షరతులు. పెళ్లంటూ చేసుకుంటే మరో యువరాణినే చేసుకోవాలని ఆయనగారి ఖచ్చితమైన కోరిక. ఆ యువరాణి కూడా అత్యంత సున్నితంగా ఉండాలి. కాలనేది కింద పెట్టకుండా పట్టుపరుపుల మీద…

రాహుల్ అవినీతి వ్యతిరేక తమాషా -కార్టూన్

“తప్పు! పూర్తిగా తప్పు! మేము ఇదంతా చేయడానికి ఈ వ్యవస్ధ ఎలా అనుమతిస్తుందసలు?” ఎఎపి పుణ్యమాని రాజకీయ పార్టీలు అవినీతి వ్యతిరేక ఫోజు పెడుతున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. అన్నా హజారే బృందం అవినీతి వ్యతిరేక ఉద్యమం మొదలు పెట్టిన దగ్గర్నుండే ఈ ఫోజులు మొదలయినప్పటికీ ఎఎపి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పరచడంతో ఈ ఫోజులు బాగా పెరిగాయి. ‘అవినీతి వ్యతిరేకత’కు ఓట్లు రాల్చే గుణం కూడా ఉందని తెలిసాక ఇక రాజకీయ పార్టీలు ఊరుకుంటాయా?…

బీహార్: జె.డి(యు)కు కాంగ్రెస్ మొండి చెయ్యి -కార్టూన్

మతోన్మాదం పేరుతో బి.జె.పి తో సంబంధాలు తెంచుకున్న జనతాదళ్ (యునైటెడ్) పార్టీ రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలినట్లు కనిపిస్తోంది. బీహార్ లో లాలూ ప్రసాద్ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్.జె.డి) మరియు పాశ్వాన్ పార్టీ లోక్ జనతాంత్రిక్ పార్టీ (ఎల్.జె.పి) లతో పొత్తు కట్టడానికి కాంగ్రెస్ దాదాపు నిశ్చయం అయిందని పత్రికలు చెబుతున్నాయి. ఇక ప్రకటన చేయడమే మిగిలిందని తెలుస్తోంది. ఇదే నిజమయితే బీహార్ లో జె.డి(యు) ఒంటరిగా మిగిలిపోతుంది. ఏదో ఒక పార్టీతో పొత్తు…

మోడి ఇమేజ్: కమలమా? టీ కప్పా? -కార్టూన్

“ఇదయితే మీ ఇమేజ్ కి బాగా సరిపోతుంది కదా, సార్?” పార్టీలోని వ్యక్తుల కంటే పార్టీ గొప్పదని అందరూ అంగీకరించే సూత్రం. ఈ సూత్రం పార్టీలోని సామాన్య కార్యకర్తల నుండి అత్యున్నత నాయకులకు అందరికీ వర్తిస్తుందని ప్రతి పార్టీ చెప్పుకుంటుంది. తద్వారా పార్టీ సిద్ధాంతాలకు, నిర్మాణానికి పెద్ద పీట వేయడానికి పార్టీలు ప్రయత్నిస్తాయి. వ్యక్తులు తమను తాము గొప్ప చేసుకుని పార్టీకి నష్టం కలిగించకుండా జాగ్రత్త పాటిస్తాయి. కానీ బి.జె.పి వ్యవహారం అందుకు భిన్నంగా ఉంది. “నరేంద్ర మోడి…

పాత నోట్లు రద్దు చేస్తే, నల్లధనం బైటికొస్తుందా? -కార్టూన్

నల్ల ధనం వెలికి తీయడానికి ఆర్.బి.ఐ ఒక చిట్కా కనిపెట్టింది. అది, 2005కు ముందు ముద్రించబడిన కరెన్సీ నోట్లను రద్దు చేయడం. జూన్ 30, 2014 లోపు ఈ పాత నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్.బి.ఐ మూడు రోజుల క్రితం వినియోగదారుల కోరింది. 2005 ముందు నాటి నోట్లను ఉపసంహరించుకోవడం ఆర్.బి.ఐ చాలాకాలం క్రితమే ప్రారంభించిందని అయితే ఈ పనిని బ్యాంకుల వరకే పరిమితం చేశామని ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పారు. పాత నోట్ల ఉపసంహరణ…

టామ్ & జెర్రీ – కాంగీ & ఎఎపి -కార్టూన్

టామ్ & జెర్రీ కార్టూన్ సీరియల్/సినిమాను ఇష్టపడని వారెవరుంటారు? 1940ల్లో ఉనికిలోకి వచ్చింది లగాయితు అనేక తరాల పాటు ఆబాలగోపాలన్నీ అలరిస్తోంది. బలం పెద్దగా లేని చిట్టెలుక తన తెలివితేటలతో బలవంతురాలైనన పిల్లిని ఎలా బురిడీ కొట్టించేదీ ఈ షో చూపిస్తుంది. ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎఎపి, కాంగ్రెస్ పార్టీల వ్యవహారం కూడా టామ్ & జెర్రీ ఆటను తలపిస్తోందని కార్టూనిస్టు కేశవ్ ఈ కార్టూన్ లో చెబుతున్నారు. వందేళ్ళకు పైగా చరిత్ర కలిగి మహా…

పత్రికల ఆక్రమణదారు కేజ్రీవాల్ -కార్టూన్

“ఆయన మా చోటు ఆక్రమించుకున్నాడు. వెంటనే ఖాళీ చేయమని చెప్పండి.” – తరచుగా పత్రికల్లో చోటు సంపాదించడం కొందరికే సాధ్యం అవుతుంది. ముఖ్యంగా కార్టూన్ లలో చోటు సంపాదించాలంటే వివిధ కళల్లో నిష్ణాతులై ఉండాలి. రాజకీయ కళ అందరు రాజకీయ నాయకులు ప్రదర్శించేదే. కానీ వారిలో కూడా ప్రత్యేక తరహాలో రాజకీయాలు చేయగలిగితేనే కార్టూనిస్టుల దృష్టిని ఆకర్షించగలరు. ప్రస్తుతం ఇలా కార్టూనిస్టులను ఆకర్షించే ప్రత్యేక కళలో ఎఎపి నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరితేరారని, పాత నిష్ణాతులకు కలవరం…

బొగ్గు కుంభకోణం vis-à-vis పర్యావరణ అనుమతి -కార్టూన్

ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా బొగ్గు తవ్వి పారేస్తున్న కంపెనీలు కొన్నాయితే పర్యావరణ అనుమతులు లేకుండానే లక్షల టన్నుల బొగ్గు గనుల్ని అట్టే పెట్టుకున్న కంపెనీలు మరి కొన్ని. ఇవి సాదా సీదా కంపెనీలు కూడా కాదు. భారత దేశ పారిశ్రామిక ప్రగతికి సంకేతాలుగా పాలకులు సగర్వంగా చాటుకునే కంపెనీలు. జిందాల్ స్టీల్ అండ్ పవర్, టాటా స్టీల్, ఆర్సిలర్ మిట్టల్, అదాని పవర్.. ఇత్యాది కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. బొగ్గు కేటాయింపులకు కేంద్రం ఏర్పాటు…

మోడీకి నీతివంతులైన యువకులు కావాల్ట! -కార్టూన్

‘రాజకీయాలు ఎలా చేయాలో మేం వారికి నేర్పుతాం’ అని అరవింద్ కేజ్రీవాల్ కొన్ని నెలల క్రితం అన్నపుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కొంతమంది పైకే నవ్వితే చాలా మంది లోలోపలే నవ్వుకున్నారు. అరవింద్ ది అతి విశ్వాసం అని చాలామంది రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. కానీ ‘నవ్విన నాప చేనే పండుతుంది’ అన్నట్లుగా ఇప్పుడు ఎఎపి వల్ల ప్రభావితం కానీ పార్టీ అనేదే ఇండియాలో లేకుండా పోయింది. కాంగ్రెస్ అగ్ర యువ నేత రాహుల్ గాంధీ ఎఎపిని…

ఎఎపి రాజకీయ అయస్కాంతం -కార్టూన్

ఎఎపి నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఒక్కో రోజూ తీసుకుంటున్న పాలనా చర్యలు స్వతంత్ర పరిశీలకులను అయస్కాంతంలా ఆకర్షిస్తున్నాయి. అనేకమంది ప్రముఖులు తాము ఎఎపి లో చేరుతున్నామని ప్రకటింస్తున్నారు. వివిధ రంగాలలో లబ్ద ప్రతిష్టులయిన ప్రముఖులు వీరిలో ఉండడం విశేషం. మరోవైపు పెద్ద పెద్ద పార్టీలు నైరాశ్యపు చలికి మునగడ తీసుకుని ఎఎపి ఆకర్షక గాలికి తట్టుకోవడం ఎలాగా అని ఆందోళనలో పడిపోయాయని కార్టూన్ సూచిస్తోంది. నరేంద్ర మోడి రాష్ట్రం గుజరాత్ లో ప్రముఖ నర్తకి మల్లికా సారాభాయ్…

రాహుల్ సిద్ధం, షరతులు వర్తించును -కార్టూన్

ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం తన పదవీకాలంలో మూడోసారి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన తన అధికార దండాన్ని రాహుల్ గాంధీకి అప్పగిస్తున్నట్లుగా పరోక్షంగా సూచించారు. ప్రధాన మంత్రి అభ్యర్ధిని తర్వాత ప్రకటిస్తాం అని చెబుతూనే కాంగ్రెస్ నాయకులలోకెల్లా రాహుల్ గాంధీకే ఆ పదవికి తగిన అర్హతలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. తద్వారా తన వారసుడు రాహుల్ గాంధీయే అని ఆయన స్పష్టం చేశారు. తన ప్రసంగంలో ప్రధాన మంత్రి పత్రికలపై విమర్శలు కురిపించారు. పత్రికల…

కాంగ్రెస్ నెత్తిన ఆదర్శ లాల్ బత్తి -కార్టూన్

“ఆ ఎర్ర బల్పును తీసేసే మార్గం మనకి ఏదో ఒకటి దొరక్కపోదు” – అవినీతి నిర్మూలన! ప్రస్తుతం రాజకీయ పార్టీలకు పట్టుకున్న జ్వరం ఇది. ఈ జ్వరం పట్టుకునేలా చేయడంలో తాము సఫలం అయ్యామని ఎఎపి ఇప్పుడు సగర్వంగా చెప్పుకుంటోంది. ఢిల్లీ ఫలితాలు వెలువడిన వెంటనే అరవింద్ చేసిన పని ‘లాల్ బత్తి’ తొలగిస్తామని ప్రకటించడం. ప్రజాస్వామ్యంలో అందరూ సమానులే అనీ, ఒకరూ ఇద్దరు వి.ఐ.పి లు ప్రయాణిస్తుంటే ట్రాఫిక్ మొత్తం ఆపాల్సిన అవసరం లేదని ఆయన…

ఆదర్శ స్కాం, రాహుల్ ఆదర్శం -కార్టూన్

ఢిల్లీలో ఎఎపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది మొదలు రాహుల్ గాంధీకి అవినీతి నిర్మూలనా జ్వరం పట్టుకుంది. అవినీతి నిర్మూలన తమ ఎజెండాలో కూడా ఉందని చెప్పుకోవడానికి ఆయన తెగ తంటాలు పడుతున్నారు. ఆదర్శ కుంభకోణం పైన మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు దరిమిలా తానూ అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉన్నానని చెప్పుకోడానికి మరో అవకాశం కలిసొచ్చింది. కార్గిల్ యుద్ధంలో మృతి చెందిన భారత సైనికుల కోసం భారత ప్రభుత్వం ముంబైలో ఆదర్శ్ సొసైటీ పేరుతో స్ధల సేకరణ…

ఆమ్ ఆద్మీ పార్టీ అడుగు జాడల్లో…. కార్టూన్

ఎఎపి నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వరుస చర్యలతో దూసుకెళ్తున్న నేపధ్యంలో కాంగ్రెస్, బి.జె.పి లు అప్పుడే ఆ పార్టీని అనుకరించడం ప్రారంభించాయి. ఢిల్లీ ప్రభుత్వం లాగానే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ ధరలను తగ్గించాలని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ చేయగా బి.జె.పి నాయకులు సైతం ఎఎపి ప్రభుత్వ నిర్ణయాలను అనుకరించే యోచనలో ఉండడం విశేషం. మహారాష్ట్ర నుండి ఎం.పిగా ఉన్న సంజయ్ నిరుపమ్ గురువారం విద్యుత్ ఛార్జీల విషయంలో ఒక డిమాండ్ ముందుకు తెచ్చి…