లాలూ కాంగ్రెస్ సీట్ల తూకం -కార్టూన్

బీహార్ లో కొనసాగుతున్న రాజకీయాలు భారత దేశంలోని మురికి రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం. బి.జె.పి మతతత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పే రామ్ విలాస్ పాశ్వాన్ మరోసారి ఆ పార్టీతోనే సీట్ల సర్దుబాటుకు సిద్ధపడగా ఘన చరిత్ర కలిగిన జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ కాసిన్ని సీట్ల కోసం అవినీతికి శిక్ష పడిన లాలూతో బేరాలు సాగిస్తోంది. లాలూ-కాంగ్రెస్ కూటమితో జత కలుస్తాడని భావించిన పాశ్వాన్ తగినన్ని సీట్లు దక్కకపోవడంతో ‘మతతత్వ’ కార్డు పక్కకు విసిరేసి ఎక్కువ సీట్లు…

మన రక్షణరంగం ఇలా తగలడింది -కార్టూన్

రక్షణ రంగంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు మన సైన్యం ‘రక్షణ సంసిద్ధత’ పైనే పలు అనుమానాలు కలుగజేస్తున్నాయి. వాడిపారేసిన జలాంతర్గాములను కొనుక్కొచ్చి నావికా దళాలకు అప్పగిస్తే ఏం జరుగుతుందో అదే జరుగుతోంది. వరుస ప్రమాదాలతో జలాంతర్గాములు మన నావికా శక్తి డొల్లతనాన్ని చాటడమే కాకుండా విలువైన నావికాధికారుల ప్రాణాలను కూడా తోడేస్తున్నాయి. ఇతర దేశాలు వాడిన జలాంతర్గాములు, విమాన వాహక నౌకాలతో నిండిన మన నావికా బలగాల పరిస్ధితి ఏమిటో ఈ కార్టూన్ చక్కగా వివరిస్తోంది. కొద్ది…

పార్లమెంటు వెల్ నుంచే ప్రచారం మొదలు -కార్టూన్

సగటు పురుషుడు: పార్లమెంటులో దీన్ని ‘వెల్ ఆఫ్ ద హౌస్’ అంటారు… సగటు స్త్రీ: ఎన్నికల్లోనేమో మహా అగాధం అని పిలుస్తారు… మరో అద్భుతమైన కార్టూన్! పార్లమెంటు ఉభయ సభల్లోనూ సాధారణంగా జరిగే గొడవలకు, ముఖ్యంగా ఇటీవల తెలంగాణ బిల్లు ఆమోదం సందర్భంగా వివిధ పార్టీల నేతలు వేసిన వేషాలకు కారణం ఏమిటో స్పష్టంగా తెలియజెపుతున్న కార్టూన్ ఇది. 2014 సాధారణ ఎన్నికల ప్రచారం చివరి లోక్ సభ, రాజ్య సభల సమావేశాల నుండే మొదలయిందని కార్టూన్…

సోనియా చెయ్యి కట్టేసిన కె.సి.ఆర్? -కార్టూన్

తెలంగాణ ఇస్తే టి.ఆర్.ఎస్ ని కాంగ్రెస్ లో కలిపేస్తానని హామీ ఇచ్చిన కె.సి.ఆర్ ఇప్పుడు మొండి చెయ్యి చూపుతున్నట్లు ఈ కార్టూన్ సూచిస్తోందా? కానీ విలీనం చర్చలు జరుగుతున్నాయని నేడో, రేపో నిర్ణయం వచ్చేస్తుందని కదా పత్రికలు చెబుతున్నది? సోనియా ముందు టి.ఆర్.ఎస్ నేతలు ఒక వాదన ఉంచినట్లు కొద్ది రోజుల క్రితం ఒక ఊహాగానం వెలువడింది. దీని ప్రకారం విలీనం కంటే కలిసి పోటీ చేస్తేనే ఎక్కువ ఉపయోగం అని టి.ఆర్.ఎస్ నేతలు కాంగ్రెస్ కు…

అన్నా హజారే రాజకీయం -కార్టూన్

“అవినీతి వ్యతిరేక పోరాటాన్ని నేను తేలిక చేసేశాను – మన దీదీని ఎన్నుకోండి చాలు – ఇక అవసరమైందంతా ఆమె పూర్తి చేసేస్తారు…” *** రాజకీయాలు తనకు సరిపడవని చెబుతూ అన్నా హజారే అరవింద్ కేజ్రీవాల్ స్ధాపించిన ఆమ్ ఆద్మీ పార్టీకి దూరంగా ఉన్నారు. మొదట అరవింద్ కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పి కూడా కిరణ్ బేడీ మంత్రాంగంతో ఆయన వెనక్కి తగ్గారు. పైగా ఎన్నికల్లో తన పేరు వినియోగించడానికి వీలు లేదంటూ ఆప్ పార్టీపై ఆంక్షలు…

తెలంగాణ నవ్వింది -కార్టూన్

పెద్దల సభ రాజ్య సభ ఆమోద ముద్రతో ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2014’ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో చివరి ఇటుకలను చేర్చింది. ఇక లాంఛనప్రాయం మాత్రమే అయిన రాష్ట్రపతి సంతకమే మిగిలింది. రాష్ట్రపతి సంతకం కూడా అయ్యాక గెజిట్ ప్రకటనతో సదరు బిల్లు చట్టంగా ఆచరణలోకి వస్తుంది. ఉభయ సభల ఆమోదమే తెలంగాణ ఏర్పాటుకు కీలకం. అది కాస్తా పూర్తయింది. దానితో ‘నవ్వింది మల్లె చెండూ’ తరహాలో తెలంగాణ నవ్వింది. ఆ నవ్వు ఢిల్లీ పార్లమెంటు…

ఎన్నికల బడ్జెట్ -కార్టూన్

లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలనే బైపాస్ రోడ్లుగా వేసుకుంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఎ ప్రభుత్వం పదేళ్ళ పాలన పూర్తి చేసుకుంది. విదేశీ మాస్టర్లు, స్వపార్టీ నాయకుల ఆదేశాలను కిమ్మనకుండా పాటించే హార్వర్డ్ మర మనిషి యు.పి.ఎ డ్రైవర్ గా తనకు అప్పజెప్పిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించారు. ఇచ్చిన ఆదేశాలను పొల్లుపోకుండా ఎంత ఖచ్చితంగా అమలు చేస్తే మర మనిషి అంత సమర్ధవంతంగా పని చేసినట్లన్నది లోకోక్తిగా మార్చడంలోనూ మన మరమనిషి సఫలం అయ్యారు. ఇక చివరి బడ్జెట్…

బి.జె.పికి ఆటవస్తువు తెలంగాణ -కార్టూన్

తెలంగాణ బిల్లు పైన కేబినెట్ కసరత్తు పూర్తయ్యి బిల్లు రూపంలో పార్లమెంటులో ప్రవేశిస్తున్న తరుణంలో బి.జె.పి ఇక తన అసలు రూపం చూపడం ప్రారంభించింది. రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నాటకాలు ఆడుతున్నట్లు ఆరోపిస్తూ వచ్చిన బి.జె.పి తాను స్వయంగా వివిధ గొంతులతో మాట్లాడడం ప్రారంభించింది. ఒకవైపు బేషరతు మద్దతు అని చెబుతూనే సీమాంధ్రకు న్యాయం చేయాలని కొత్తగా అనుపల్లవి అందుకుంది. బి.జె.పి అధ్యక్షుడు రాజ్ నాధ్ ‘బిల్లుకు మద్దతు ఇచ్చి తీరతాం’ అని ప్రకటిస్తుండగానే…

పార్లమెంటులో ఆంధ్ర ప్రదేశ్ -కార్టూన్

మేధావి: ఫిషనా లేక ఫ్యూషనా? సామాన్యుడు: ఏదీ కాదు పెప్పర్ స్ప్రే *** భారత దేశానికి పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయం.  సభలో కూర్చునేవారు ఈ సంగతి చెబుతారు. సభ బయట ఉన్న మనం అది నిజమే కాబోలని నమ్ముతున్నాం. ప్రజాస్వామ్య దేవాలయం ప్రాశస్త్యం గురించి అనేక పుస్తకాలు, పాఠ్య గ్రంధాలు, పరిశోధనా పత్రాలు చెప్పే సూత్రాలకు ఇక కొదవే లేదు. కానీ వాస్తవంగా జరుగుతోంది మాత్రం ఇందుకు విరుద్ధం. పార్లమెంటులో సజావుగా చర్చలు జరిగిన సందర్భాలు చాలా…

కేజ్రీవాల్ పని: ఆజియన్ స్టేబుల్స్ శుభ్రపరచడం -కార్టూన్

అరవింద్ కేజ్రీవాల్ పని తీరు (వర్కింగ్ స్టైల్) పైన సున్నితమైన విమర్శ ఈ కార్టూన్. CLEANING OF AUGEAN STABLES అనే ఆంగ్ల వాడుకను కార్టూనిస్టు ఇందులో వినియోగించారు. ఆజియన్ అనే ఆయన గ్రీకు పురాణాల్లో ఒక రాజు. ఆయన వద్ద స్వర్గం నుండి ప్రసాదించబడిన పశు సంపద భారీగా ఉండేదిట. భారీ సంఖ్యలో ఉన్నందున వాటి విసర్జనాలు కూడా పెద్ద మొత్తంలో ఉండేవి. అందువలన ఆయనగారి పశువుల కొట్టాన్ని శుభ్రం చేయడం ఎవరికైనా అసాధ్యం. హెర్క్యూలియస్ అనే…

చాయ్, మోడిలతో బి.జె.పి రెడీ -కార్టూన్

– పదేళ్ళ నుండి తెలంగాణ బిల్లును నానబెట్టిన కాంగ్రెస్ పార్టీ, 2014 ఎన్నికల కోసం మాత్రమే అలా చేసిందని, బి.జె.పి ఎన్నికల ప్రచారం ఇప్పటికే మొదలైపోవడంతో టి.బిల్లుపై హడావుడి పడుతోందని ఈ కార్టూన్ సూచిస్తోంది. ***                    ***                    *** బి.జె.పి ఎన్నికల ప్రచారం ఇప్పుడేం ఖర్మ! ఎప్పుడో మొదలైపోయింది. ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలను కూడా ప్రచార సామాగ్రిగా మార్చుకుని మరీ అది ఎన్నడో రంగంలోకి దిగింది. ఆ మాటకొస్తే కాంగ్రెస్ కూడా వెనకబడి ఏమీ లేదు. రాహుల్…

ఢిల్లీ సర్కార్: ఎలుకకు చెలగాటం, పిల్లికి ప్రాణ సంకటం -కార్టూన్

“పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం”, ఇది కదా అసలు సామెత! కానీ ఢిల్లీ సర్కార్ విషయంలో ఈ సామెత రివర్స్ అయిపోయింది. ‘టాం అండ్ జెర్రీ’ లోని ఎలుక తరహాలో కాంగ్రెస్ పిల్లిని ఎఎపి ఎలుక అదే పనిగా ఆట పట్టించడం జనానికి భలే పసందైన కనుల విందు. కాకపోతే మద్దతు ఇస్తున్న పార్టీ వణకడం ఏమిటి? మద్దతు తీసుకుంటున్న పార్టీ ‘మద్దతు వెనక్కి తీసుకుంటారా, అయితే తీస్కోండి’ అంటూ చిద్విలాసంగా సవాళ్ళు విసరడం ఏమిటి?…

ఎ.పి పొలిటికల్ ఆటో ఎక్స్ పో -కార్టూన్

కొద్ది రోజుల క్రితం హైద్రాబాద్ లో ఆటో ఎగ్జిబిషన్ జరిగింది. ఆటో ఎగ్జిబిషన్ నూ రాష్ట్ర విభజన కేంద్రంగా వివిధ పార్టీల్లో సాగుతున్న రాజకీయాలను పోల్చుతూ గీసిన కార్టూన్ ఇది. కాంగ్రెస్: రాష్ట్ర రాజకీయాలకు, ముఖ్యంగా విభజన రాజకీయాలకు సంబంధించి సోనియా ఒకవైపు వెళ్తుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సరిగ్గా ఆమెకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. విభజనపై తమ పార్టీ తప్పుడు నిర్ణయం తీసుకుందని కిరణ్ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇది కాంగ్రెస్ ఆటో ఎక్స్ పో. తెలుగు దేశం:…

కరుగుతున్న కాలానికి ప్రతీక 15వ లోక్ సభ -కార్టూన్

కార్టూనిస్టుల ఊహలు ఒక్కోసారి ఎంత అందంగా ఉంటాయో వివరించే కార్టూన్ ఇది! 15వ లోక్ సభ, 16వ లోక్ సభల మధ్య సంధి కాలాన్ని ఈ కార్టూన్ లో దర్శించవచ్చు. లేదా 16వ లోక్ సభలోకి జారుతున్న 15వ లోక్ సభ స్వరూపాన్ని కూడా ఇందులో చూడవచ్చు. కాలాన్నీ, రాజకీయాలను, కాలంతో పాటు మారుతున్న రాజకీయాల స్వరూపాన్నీ కూడా ఇందులో చిత్రించే ప్రయత్నాన్ని కార్టూనిస్టు చేశారు. 15వ లోక్ సభ చివరి సెషన్ కు అనేక బిల్లుల్ని…

‘మూడో కూటమి’ అను ఓ ప్రహసనం -కార్టూన్లు

భారత దేశంలో గిరాకీ లేని ప్రాంతీయ పార్టీలు, వామపక్ష పార్టీలు కలిసి అప్పుడప్పుడూ చేసే తాటాకు చప్పుళ్లను ‘మూడో కూటమి’ అని పిలుస్తుంటారు. ఈ చప్పుళ్ళు ఎక్కువగా సరిగ్గా సాధారణ ఎన్నికలకు ముందే వినబడతాయి. ఎన్నికలు ముగిస్తే చాలు, అవిక వినపడవు. ఖర్మ కాలి కాంగ్రెస్ కూటమి (ఒకటో కూటమి?), బి.జె.పి కూటమి (రెండో?) లకు ప్రభుత్వం ఏర్పాటు చేయగల మెజారిటీ రాకపోయినా లేదా ఈ మూడో కూటమి బ్యాచ్ లోని పార్టీలు మొదటి, రెండవ కూటమిలలో…