అరవింద్: అసంతృప్త నేతల పంచింగ్ బ్యాగ్

“మిత్రులారా, ఈ ప్రభుత్వం తప్పులు చేసేవరకూనో లేదా కొత్త పంచింగ్ బ్యాగ్ దొరికేవరకూనో -ఈ రెండిట్లో ఏది ముందోస్తే అంతవరకూ కాస్త ఓపిక పట్టండి…” *** *** *** ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి వివిధ ప్రాంతాల్లోని ఎఎపి నాయకులు వరుస కట్టి రాజీనామాలు చేస్తున్నారు. కొంతమంది ఏకంగా పార్టీ సభ్యత్వానికే రాజీనామా చేసేస్తే మరికొందరు పార్టీ సభ్యత్వాన్ని అట్టే పెట్టుకుని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తున్నారు. బహుశా వీళ్ళంతా పార్లమెంటు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ…

మోడి: భారతీయ మోషే! -కార్టూన్

భారత ప్రధాని నరేంద్ర మోడిని భారతీయ మోషే (మోజెస్) గా కార్టూనిస్టు చిత్రీకరించారు. ఎన్నికలకు ముందు మోడీకి ప్రచార సారధ్యం అప్పగించడం ద్వారా ప్రధాని పదవికి ఆయనే అభ్యర్ధి అని బి.జె.పి ప్రకటించినప్పుడు అలిగి తూలనాడిన పార్టీ సీనియర్లను మోడి తెచ్చిన టెన్ కమాండ్ మెంట్స్ ఫలకాలను మోసుకు తిరగడానికి ఎదురు చూస్తున్నవారిగా కేశవ్ చిత్రీకరించారు. మోడి కష్టాన్ని అనుభవించడానికి బి.జె.పి సీనియర్లు ఎదురు చూస్తున్నారని చురక అంటించారు. *** క్రైస్తవ పురాణంలో మోజెస్ కధ తెలుసా?…

రాహుల్ యుద్ధం: ఉత్త కుమారుడేనా? -కార్టూన్

కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ కనీసం ఉత్తర కుమారుడు కూడా కాదనీ, ఆయన సోనియా గాంధీకి ‘ఉత్త కుమారుడే’ అనీ ఆయనగారి ధోరణి చెబుతోందని కార్టూన్ సూచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి తామిద్దరమే బాధ్యులమని తల్లిగారితో పాటు గంభీరంగా ప్రకటించిన రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదాలో ప్రజల కోసం ప్రభుత్వంతో యుద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ తీరా పార్లమెంటరీ సమావేశాలు మొదలయ్యాక ఆయన పత్తా లేకుండా పోయారు. ఎక్కడో చివరి వరుసలో కూర్చుని…

కె.సి.ఆర్ కారు Vs చంద్రబాబు కారు -కార్టూన్

కె.సి.ఆర్ కారు ఎక్కేశారు. డ్రైవర్ సీటు కూడా చేజిక్కించుకుని ప్రయాణం కూడా మొదలు పెట్టేశారు. అనగా సి.ఎంగా పదవీ స్వీకార ప్రమాణం చేసి, మంత్రివర్గం కూడా నియమించుకుని పాలన మొదలు పెట్టేశారు. కాబట్టి ఆయన వదులుతున్న వాగ్దానాలకు కాస్త అర్ధం వచ్చి చేరింది. అవి నెరవేరుస్తారా లేదా అన్నది తర్వాత సంగతి. రైతుకు 12,000 దాకా రుణం మాఫీ అంటున్నారు. ఉన్న పెట్టుబడులు ఎక్కడికీ వెళ్లొద్దని కోరారు. కొత్తవాళ్లు కూడా రావచ్చన్నారు. ప్రత్యేక హోదా తమకూ ఇవ్వాలని…

ఎఎపి పరిస్ధితి ఇక ఇదేనా? -కార్టూన్

సామాన్యుడిని నెత్తి మీద పెట్టుకుంటానని ఉనికిలోకి వచ్చిన ఆం ఆద్మీ పార్టీ ఢిల్లీ జనాన్ని బాగానే ఆకట్టుకుంది. కానీ అనతికాలం లోనే జనంలో పలుకుబడి కోల్పోయిందని లోక్ సభ ఎన్నికలు రుజువు చేసినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీ పీఠాన్ని కట్టబెట్టడం ద్వారా  ప్రజలు పెట్టుకున్న ఆశల్ని తగిన విధంగా ఆచరణలోకి తేవడంలో ఆ పార్టీ విఫలమైందని అందుకే ప్రజల్లో పలచన అయిందని వారి అవగాహన. అధికారంలోకి వచ్చీ రావడంతోనే సంచలన కార్యక్రమాలకు తెరతీసిందని సో కాల్డ్ మర్యాదస్తులు,…

మబ్బులు తొలగును, అసలు తెలియును -కార్టూన్

“…ప్రారంభోల్లాస భ్రాంతి సర్దుకునే కొలదీ ఆర్ధిక స్ధితిగతులలు తన అసలు రూపాన్ని వ్యక్తం చేసుకుంటుంది..”  (ఆ రూపమే గదిలో ఏనుగు) మోడి: మనం మిత్రులమే కదా? *** స్వతంత్ర  భారత దేశ చరిత్ర లోనే పూర్తి మెజారిటీ సాధించిన మొట్ట మొదటి కాంగ్రెసేతర పార్టీగా బి.జె.పి మన్ననలు అందుకుంటోంది. బి.జె.పికి ఆ ఖ్యాతి దక్కించిన మహోన్నత నేతగా నరేంద్ర మోడి ప్రశంసలు పొందుతున్నారు. నిన్నటిదాకా ‘దూరం, దూరం’ అంటూ అస్పృశ్యత అమలు చేసిన బ్రిటన్, అమెరికాలు ‘రండి,…

మంత్రులు, నేతలు, విద్యార్హతలు -కార్టూన్

X: ఏయ్! కొట్టుకోవడం ఆపండి! Y: నాయకత్వానికి విద్యార్హతలు ఎవన్నా ఉండాలా లేదా అని చర్చించుకోవడానికే ఇది… X: అయితే ఓ.కె, మన (సోనియా) నాయకత్వం పైన అనుమానాలు వ్యక్తం చేయడానికేమో అనుకున్నాలేండి… ********* స్మృతి ఇరానీ పుణ్యమాని నాయకత్వం విద్యార్హతల గురించి ఆసక్తికరమైన చర్చ నడిచింది. నిజానికి ఈ చర్చకు స్మృతి ఇరానీ ప్రత్యక్ష కారణం కాదు. పరోక్ష కారణమే. ఆమెను మానవ వనరుల అభివృద్ధి శాఖకు మంత్రిగా ప్రధాని నరేంద్ర మోడి నియమించడంతో ఈ…

ఇంతకీ గెలిచిందెవరు? -కార్టూన్

2014 సాధారణ ఎన్నికల్లో గెలిచింది ఎవరు? పార్లమెంటు సెంట్రల్ హాలులో భావోద్వేగ పూరిత ప్రసంగం ఇచ్చిన నరేంద్ర మోడి కన్నీరు పెట్టుకోగా, ఓటమికి బాధ్యత వహించి రాజీనామా చేస్తామని చెప్పిన రాహుల్ మాత్రం యధావిధిగా కాంగ్రెస్ యువరాజుగా కొనసాగుతున్నారు. దానితో ఎన్నికల్లో గెలిచిందేవరన్న అనుమానం వస్తోందని ఈ కార్టూన్ సూచిస్తోంది.  పార్లమెంటు సెంట్రల్ హాల్ లో బి.జె.పి పార్లమెంటరీ నేతగా ఎన్నికయిన అనంతరం 30 నిమిషాలు ప్రసంగించిన మోడి ఆ సందర్భంగా కన్నీరు పెట్టుకున్నారని పత్రికలు నివేదించాయి.…

EXIT: బయటకు దారి -కార్టూన్

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేన్ని సూచిస్తున్నాయో ఈ కార్టూన్ చెబుతోంది. కానీ బయటకు వెళ్ళే పెద్దాయనా, లోపలికి వస్తున్న మరో పెద్దాయనా ఇద్దరూ ఇంకా గడప దాటకుండా కార్టూనిస్టు జాగ్రత్త పడ్డారు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అధికారిక ఎన్నికల ఫలితాలు కాదు గనక! ప్రధాని మన్మోహన్ ఇప్పుడు సంచి సర్దుకుంటున్నట్లు చూపారు గానీ నిజానికి ఆయన ఎప్పుడో మకాం మార్చేశారు. ఒకవేళ యు.పి.ఏ III ప్రభుత్వం ఏర్పడ్డా ఆయన మాత్రం ప్రధాని నివాసం ఖాళీ చేయక తప్పదు.…

రోడ్ షోలు సాధించింది ఇదీ -కార్టూన్

“ఆ రోడ్ షోల వల్ల కంటికి బాగా కనిపిస్తున్న ప్రభావం ఇదే…” *** గతంలో ఎన్నికల ప్రచారాలు జనానికి కాస్త అర్ధం అయ్యేలా ఉండేవి. కరపత్రాలు వేసి పంచేవాళ్లు. తాము ఏమి చేస్తామో అందులో చెప్పేవాళ్లు. మీటింగులు పెట్టినా, కనీసం ఇందిరా గాంధీ కాలం వరకైనా, జనాలు స్వచ్ఛందంగా వెళ్ళేవాళ్లు. ఇందిరా వ్యతిరేక నాయకులు వచ్చి మీటింగు పెడితే ఇందిరా అనుకూలురు కూడా వెళ్ళి వినేవాళ్ళు. అలాగే ఇతర నాయకుల విషయంలోనూ జరిగేది. నాయకుల సభలకు పార్టీల…

ఇక పునర్దర్శనం టి.విలోనే -కార్టూన్

ఓ.కె, బై-బై. మళ్ళీ టీ.వి తెరపైన కలుద్దాం! ఈ రోజుతో చివరి విడత ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల కమిషన్ విధించిన గడువు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. నరేంద్ర మోడి నేతృత్వంలో బి.జె.పి కూటమి మెజారిటీ సాధిస్తుందని ఈ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడి అయినట్లు పత్రికలు నివేదించాయి కూడాను. మళ్ళీ నాయకులు ప్రజలకు కనిపించేది ఎప్పటికి? విజయం సాధించినందుకు స్వీట్లు ఒకరి నోట్లో మరొకరు పెట్టుకుంటూనో లేదా ఓటమిని అంగీకరిస్తున్నట్లు గంభీర…

మా తలుపులు తెరిచే ఉన్నాయి -కార్టూన్

“చర్చల కోసం మన తలుపులు తెరిచే ఉన్నాయని మనల్ని హీనపరిచేవారందరికీ తెలియజెప్పడానికి ఇది చిన్న సూచన మాత్రమే” *** నిన్నటిదాకా 300 సీట్లు గ్యారంటీ అని ప్రకటించుకున్న పార్టీకి వాస్తవ పరిస్ధితి తెలుస్తోందని ఆ పార్టీ నేతల ప్రకటనలు చెబుతున్నాయి. తలుపులు తెరిచే ఉన్నాయని చెప్పకపోతే తెరిచి ఉన్న మరో ద్వారం వైపు చూస్తారని భయం మరి! మరో వారం రోజుల వరకూ ఈ కఠోరమైన ఎదురు చూపులు తప్పవు కదా!

మోడి ‘అభివృద్ధి’ పరిణామం ఇదీ! -కార్టూన్

2014 సాధారణ ఎన్నికలకు రెండు సంవత్సరాలకు ముందే నరేంద్ర మోడి ‘సద్భావనా మిషన్’ పేరుతో తాను అందరివాడినని చెప్పేందుకు ప్రయత్నించారు. ఎన్నికలు ప్రకటించాక ‘అభివృద్ధి’ మంత్రం అందుకున్నారు. గుజరాత్ లో తాను చేసిన అభివృద్ధి దేశం అంతా అమలు చేస్తానని ప్రచారం చేస్తారు. తాను ప్రసంగించిన చోటల్లా ఉద్యోగాల ప్రస్తావన తేవడం ద్వారా ఓటర్లలో సగం వరకూ ఉన్న యువతను ఆకర్శించేందుకు ఎర వేశారు. తాను ప్రధాని అయితే ‘ఉద్యోగాలే ఉద్యోగాలు’ అన్నారు. తీరా ఎన్నికలతో పాటు…

ఇది సెల్ఫీ రాజకీయాల యుగం! -కార్టూన్

“మీ సెల్ఫీకి ఊహించలేనంత బ్రహ్మాండమైన స్పందన వస్తోంది సార్ – ఇక చూస్కోండి, బంపర్ మెజారిటీతో గెలవడమే మిగిలింది…” *** ఊహించనంత వేగంగా కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం రాజకీయాల్లోనూ తన హవా చాటుతోంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన వార్తా ఛానెళ్ల పుణ్యమాని ఇప్పుడు ప్రతి ఇల్లూ ఒక శబ్ద కాలుష్య కర్మాగారం అయిపోయింది. ఛానెళ్లలో వివిధ రాజకీయ నాయకుల సొంత డబ్బాలు వినలేక పత్రికల వైపు మళ్లుదామంటే అక్కడా అదే గోల. ఒక్కో పత్రికా ఒక్కో…

కోడ్ పాటించని నేతలు దేశ గతి మారుస్తారా? -కార్టూన్

“నీ ఓటు నాకివ్వు” “నీ తలరాత మార్చేస్తా” “ఈ దేశ గతిని కూడా మార్చేస్తా” “చట్టాన్ని ఉల్లంఘించకుండా ఓటు వెయ్యడం ఎలాగో ముందు నీకు నేర్పి చూపిస్తా పద!” — “అరవై యేళ్ళు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు. నాకు ఐదేళ్లు అవకాశం ఇచ్చి చూడండి! దేశం గతినే మార్చి చూపిస్తాను.” ఇది నరేంద్ర మోడి అదే పనిగా భారత జనానికి చెబుతున్న మాట! నరేంద్ర మోడీకి నిజంగానే అవకాశం ఇస్తే అది మొదటి అవకాశం మాత్రం…