సంక్షోభాన్ని దాటుతున్న భారత బ్యాంకులు -మూడీస్

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
భారత బ్యాంకింగ్ రంగం ఎన్‌పి‌ఏ సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో పురోగమన బాటలో వెళుతోందని అంతర్జాతీయ రేటింగ్ కంపెనీ మూడిస్ చెప్పింది. రఘురాం రాజన్ నేతృత్వం లోని ఆర్‌బి‌ఐ బ్యాంకులపై విధించిన కొత్త నిబంధనతో బ్యాలన్స్ షీట్ల నుండి మాయం అయిన మొండి బాకీలన్నీ ప్రత్యక్షం తిరిగి పుస్తకాల్లో అయ్యాయి. దానితో భారతీయ బ్యాంకులు అమాంతం మొండి బాకీల సంక్షోభంలో పడినట్లు లోకానికి తెలిసి వచ్చింది. గతంలో మొండి బాకీలను లేదా నాన్ పెర్ఫార్మింగ్…

బేయర్, మాన్ శాంటో విలీనం: మహా రాకాసి అవతరణం

  రాకాసి, రాకాసి విలీనం అయితే ఏమవుతుంది? మహా రాకాసి పుడుతుంది.  రెండు రాకాసులు కలిస్తే ఏ పాటి విధ్వంసం జరుగుతుంది? ఆ రాకాసులు విడి విడి గా చేయగల విధ్వంసం కంటే ఇంకా ఎక్కువగా విధ్వంసం జరుగుతుంది. ఇద్దరు పని వాళ్ళు విడి విడిగా పని చేసినప్పటి కంటే సమిష్టిగా పని చేసినప్పటి ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. రాకాసితనం కూడా అంతే అన్నమాట! నిజానికి బహుళజాతి కంపెనీలు విలీనయం అయేది, స్వాధీనం చేసుకునేది కూడా అలా…

ఏ‌పిని ప్రత్యేకం చేయడం -ద హిందు ఎడిట్…

‘ప్రత్యేకం’ అయినది ఏ విధంగా ప్రత్యేకం అవుతుంది? విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం నుండి ఆపన్న హస్తం అందించాల్సిన అగత్యం ఏర్పడింది అనడం ఎన్నడూ సందేహం కాలేదు. కానీ రాష్ట్రం ఏ రీతిలో ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్నదన్న అంశంలోనే కృషి జరగవలసి వచ్చింది. దానిని ప్రత్యేక తరగతి హోదా కలిగిన రాష్ట్రంగా ప్రకటించవచ్చా లేక ప్రత్యేక తరగతి హోదాకు తప్పనిసరిగా నెరవేర్చవలసిన అవసరాలను తీర్చే బాధ్యత లేని ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ వరకు…

అమరావతి రాజధాని ప్లాట్ల కేటాయింపు ఒక మోసం

– అమరావతి రాజధాని ప్లాట్ల కేటాయింపు ఒక మహామోసం //.….. మరో మోసానికి తెరతీసిన చంద్రబాబు ప్రభుత్వం..! “తాత్కాలిక కేటాయింపు” అంటూ మరో లిటిగేషన్. ! >> ప్రస్తుతం కేటాయించిన ప్లాట్లపై భూయజమానులకు ఎటువంటి యాజమాన్య హక్కూ ఉండదు..>> రాజధానికోసం “ల్యాండ్ పూలింగ్” పేరిట సేకరించిన భూముల్లో, భూయజమానులకు ప్లాట్లు కేటాయింపులో బయటపడ్డ మరోమోసం.. ఇది ముమ్మాటికీ నయవంచనే..!!  మిగిలిన భాగం కోసం “తిరుమల ప్రసాదీయం” బ్లాగుకు కింది లంకె ద్వారా వెళ్ళండి. అమరావతి రాజధాని ప్లాట్ల కేటాయింపు…

జి‌ఎస్‌టి బిల్లు: జైట్లీ అబద్ధం ఆడారు!

జి‌ఎస్‌టి వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు గతంలో లేని మేలు జరుగుతుందని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు సభలో మాట్లాడుతూ చెప్పారు. అమ్మకపు పన్నులో గతంలో రాష్ట్రాలకు వాటా ఉండేది కాదనీ, జి‌ఎస్‌టి (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) బిల్లు ఆమోదం పొందితే సేల్స్ టాక్స్ లో కూడా రాష్ట్రాలకు వాటా వస్తుందని అరుణ్ జైట్లీ ఊరించారు. కానీ ఇది అబద్ధం అని మాజీ ఆర్ధిక మంత్రి పి చిదంబరం వెల్లడి చేశారు. కేంద్రానికి సమకూరే…

వృద్ధికి, బహుశా ద్రవ్యోల్బణానికీ ప్రేరణ -ద హిందూ ఎడిట్..

[“A fillip to growth, and maybe inflation” శీర్షికన ఈ రోజు ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం.] ********* 7వ వేతన కమిషన్ సిఫారసులను అమలు చేయడం ద్వారా కోటికి పైగా ఉద్యోగులు, పింఛనుదారుల వేతనాలు మరియు పింఛన్లు పెంచాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం వినియోగ డిమాండ్, ఆర్థిక వృద్ధి లకు ఆదరువు కాగలదు. బలిష్టమైన ప్రైవేటు వినియోగమే ప్రస్తుత ఆర్థిక కదలికకు కీలకమైన శక్తిగా పని చేస్తున్నదని ఇటీవల కేంద్ర…

త్వరగా దయచేయండి! -ఈయు

‘బైటకు వెళ్లి పోవాలని నిర్ణయించుకున్నారు గదా, ఇంకా ఎన్నాళ్ళు చూరు పట్టుకుని వెళ్ళాడుతారు?’ అని బ్రిటన్ / యూకె ను నిలదీసి ప్రశ్నిస్తోంది యూరోపియన్ యూనియన్. కొందరు ఈయు నేతల ప్రకటనలు చూస్తే బ్రిటన్ నేతల నాన్చుడు ధోరణి వారికి ఎంత మాత్రం ఇష్టంగా లేదని స్పష్టం అవుతోంది. “యూరోపియన్ యూనియన్ నుండి బయటకు వెళ్ళే కార్యక్రమాన్ని బ్రిటన్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలి” అని ఈయు కమిషనర్ ఒకరు హెచ్చరించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.…

రేపే బ్రెగ్జిట్ రిఫరెండం!

ప్రపంచ భౌగోళిక రాజకీయాలకు మలుపు, కుదుపు కాగల మార్పులకు దారి తీసే అవకాశం ఉన్న ‘ప్రజాభిప్రాయ సేకరణ’ ఉరఫ్ రిఫరెండం రేపు, జూన్ 23 తేదీన, బ్రిటన్ లో జరగనున్నది. “యూ‌కే, యూరోపియన్ యూనియన్ లో కొనసాగాలా లేక బైటికి రావాలా?” అన్న ఏక వాక్య తీర్మానంపై జరిగనున్న రిఫరెండంలో విజేతగా నిలవటానికి ఇరు పక్షాలు సర్వ శక్తులూ ఒడ్డాయి. గెలుపు ఇరువురు మధ్యా దొబూచులాడుతోందని సర్వేలు చెప్పడంతో అంతటా ఉత్కంఠ నెలకొన్నది. యూ‌కే రిఫరెండంలో యూ‌కే…

రాజన్: గిల్లి జోల పాడుతున్న పాలకులు -విశ్లేషణ

“పొమ్మనలేక పొగబెట్టారు” అని మర్యాదగా చెప్పుకోవటానికి కూడా వీలు లేకుండా బి‌జే‌పి పాలకులు రఘురాం రాజన్ పట్ల వ్యవహరించారు. హద్దు పద్దు ఎరగని నోటికి ఓనర్ అయిన సుబ్రమణ్య స్వామి తనపైన అలుపు లేకుండా మొరగటానికి కారణం ఏమిటో, ఆయన వెనుక ఉన్నది ఎవరో తెలియని అమాయకుడా రాజన్? రెండో విడత నియామకం ద్వారా ఆర్‌బి‌ఐ గవర్నర్ పదవిలో కొనసాగేందుకు తాను సిద్ధంగా లేనని, అకడమిక్ కెరీర్ పైన దృష్టి పెట్టదలుచుకున్నానని ప్రకటించడం ద్వారా ‘అంత అమాయకుడిని…

వ్యూహాత్మక నిష్క్రమణ -ద హిందూ ఎడిట్..

[ఈ రోజు -జూన్ 20- ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ “A strategic exit” కు యధాతధ అనువాదం. -విశేఖర్] ********* సెప్టెంబర్ లో తన పదవీకాలం ముగిసిన తర్వాత రెండో సారి పదవికి రేసులో ఉండబోవటం లేదని ప్రకటించటం ద్వారా ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, అంతకంతకు గుణ విహీనం గా మారుతున్న పరిస్థితుల నుండి మెరుగైన రీతిలో, గౌరవప్రదంగా బైటపడే మార్గాన్ని ఎంచుకున్నారు. కొన్ని నెలలుగా ఆయన కొనసాగింపు పట్ల మోడి ప్రభుత్వంలో కొన్ని…

ఫ్రాన్స్ లో పెరుగుతూన్న అలజడి -ది హిందు ఎడిట్ (విమర్శ)

[శనివారం, జూన్ 11 తేదీన “Growing unrest in France” శీర్షికన ది హిందులో ప్రచురితం అయిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. అనువాదం అనంతరం సంపాదకీయంపై విమర్శను చూడవచ్చు. -విశేఖర్] ——— సమ్మెలకు ఫ్రాన్స్ కొత్త కాదు. కానీ సోషలిస్టు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షంవైపు మొగ్గు చూపే కార్మిక యూనియన్లు వారాల తరబడి సాగిస్తున్న అలజడి మున్నెన్నడూ ఎరగనిది. మే 17 తేదీన సమ్మె ప్రారంభించిన యూనియన్లు ఫ్రాన్స్ లోని కఠిన కార్మిక చట్టాలను…

క్లుప్తంగా… -10/06/2016

ఏప్రిల్ లో క్షీణించిన ఫ్యాక్టరీ ఉత్పత్తి కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభ నెలలో ఫ్యాక్టరీ/పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి చెందటానికి బదులు కుచించుకుపోయింది. 2015 ఏప్రిల్ తో పోల్చితే 2016 ఏప్రిల్ నెలలో ఫ్యాక్టరీల ఉత్పత్తి 0.8 శాతం తగ్గిపోయిందని కేంద్ర గణాంక కార్యాలయం (CSO – Central Statistics Office) ప్రకటించింది. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ఇండియా జి‌డి‌పి 7.6 శాతం వృద్ధి సాధించిందని అట్టహాసంగా ప్రకటించి రోజులు గడవక ముందే ఈ ప్రతికూల వార్త వెలువడటం…

రాష్ట్రాలకు కేంద్రం 81 వేల కోట్ల ఎగవేత!

రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో ఎగవేస్తున్న సంగతి వెలుగులోకి వచ్చింది. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (సి‌ఏ‌జి) చేసిన పరిశోధనలో ఈ వాస్తవం వెల్లడి అయింది. ఈ పాపంలో కాంగ్రెస్, బి‌జే‌పిలు రెండూ భాగం పంచుకోగా కాంగ్రెస్ కంటే బి‌జే‌పి నాలుగు ఆకులు ఎక్కువే చదివిందని సి‌ఏ‌జి గణాంకాలు తెలియజేస్తున్నాయి. 1996-97, 1997-98, 2006-07, 2007-08, 2014-15 సంవత్సరాల కాలంలో రాష్ట్రాలకు ఇవ్వవలసిన మొత్తం కంటే తక్కువ మొత్తాన్ని కేంద్రం పంపిణీ చేసిందని సి‌ఏ‌జి…

ముగింపు: భారత వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానం -22

(21వ భాగం తరువాత………….) భారత వ్యవసాయంలో పెట్టుబడిదారీ మార్పులపై ఒక నోట్ – పార్ట్ 22 – చాప్టర్ VII – ఎక్కడ నిలబడి ఉన్నాం? భారత వ్యవసాయానికి సంబంధించి ఈ లక్షణాలను పరిశీలించిన దరిమిలా మనం ఎక్కడ నిలబడి ఉన్నట్లు? అంబికా ఘోష్ పేర్కొన్నట్లుగా “ఈ స్వయం పోషక రైతాంగ వ్యవసాయం విచ్ఛిన్నం ఫలితంగా ఏర్పడ్డ స్ధూల ప్రభావం ఏమిటంటే రైతాంగ ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నం కావటం; భూస్వామ్య విధానం లేదా ధనిక రైతాంగ ఆర్ధిక…

మార్క్స్ ‘వర్తక పెట్టుబడి’ మన ‘వడ్డీ పెట్టుబడి’ -21

(20వ భాగం తరువాత…………..) భారత వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానంపై ఒక నోట్ – పార్ట్ 21 – పెట్టుబడిదారీ పూర్వ సంబంధాలలో అధిక వడ్డీ గురించి చర్చిస్తూ కారల్ మార్క్స్ ఇలా చెప్పారు: “తన బాధితుడి నుండి అదనపు శ్రమను పిండుకోవడంతో సంతృప్తి చెందని అధిక వడ్డీదారుడు (usurer) అతని శ్రమ పరిస్ధితులనూ, భూమి,ఇల్లు మొ.న సాధనాలనూ కూడా క్రమ క్రమంగా స్వాధీనం చేసుకుంటాడు. ఆ విధంగా అతనిని స్వాయత్తం చేసుకునే కృషిలో నిరంతరాయంగా నిమగ్నమై ఉంటాడు.…