కొత్త నోట్లు: సెక్యూరిటీ నాణ్యత రెండు లేవు, అన్ని అబద్ధాలే!

  పాత, పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పిన మాటలు ఏమిటి? దేశంలో నల్ల ధనం పేరుకుపోయింది. ధనిక వర్గాలు, మనీ లాండర్లు, హవాలా రాకెటీర్లు, సమాంతర ఆర్ధిక వ్యవస్ధని నడుపుతున్నారు. సరిహద్దుల అవతలి నుండి దొంగ నోట్లు ముద్రించి దేశంలోకి వదులుతున్నారు. ఫలితంగా ఆర్ధిక వ్యవస్ధకు నష్టం కలుగుతోంది. పేదలు ఎక్కువగా నష్టపోతున్నారు. సమానత్వం సాధించలేకపోతున్నాము. నల్ల డబ్బు జీడీపీ వృద్ధి రేటు పెంచుకోవటానికి ప్రధాన ఆటంకం అయింది. ఇక…

నోట్ల రద్దు: రాజకీయ ప్రయోజనాలు సాధిస్తాం -బీజేపీ

  పెద్ద నోట్ల రద్దు వెనుక బీజేపీ లక్ష్యాలు తెర వెనుక నుండి మెల్లగా బైటికి వస్తున్నాయి. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నల్ల ధనం, ఉగ్రవాదం, దొంగ నోట్లు, మున్నగు జబ్బుల్ని నయం చేసేందుకు పెద్ద నోట్లు రద్దు చేశామని మోడీ చెబుతుండగా ‘నోట్ల రద్దు’ వల్ల వచ్చే ప్రతిష్టను ఓట్ల కోసం వినియోగించుకుంటామని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.  “మేము రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళం. భజన బృందం నడపడం లేదు. భజన పాటలు…

నానో ఛిప్? సారీ! -ఆర్‌బి‌ఐ

అదిగో పులి అనే వాడు ఒక్కడుంటే, ఇదిగో తోక అని వేల మంది కేకలు వేస్తున్నారు. సోషల్ నెట్ వర్క్ యుగంలో ఇది వేలం వెర్రి అయిపోయింది. ఎవరో ఏదో గొప్ప పని చేసేశారనీ, అదేదో అద్భుతం జరిగిపోతోందనీ, ఇంకేదో జరగరాని ఘొరం జరిగిపోయిందని ఒక బొమ్మ, ఒక చాత్రం (పిట్ట కధ)… ఎవరు పోస్ట్ చేసినా సరే, వెనకా ముందూ చూడకుండా షేర్ చేసెయ్యడం, బైట నలుగురికీ చెప్పి అబ్బురపరిచి తానూ అబ్బురపడిపోవడం…! పొద్దుట్నుంచి ఒకటే…

కొత్త రు 500, రు 2000 నోట్లు?

SO, IT IS NOT SO GOOD NEWS! అవినీతి నిర్మూలన కోసం అంటూ మోడి ప్రకటించిన నోట్ల రద్దు చర్య అసలు స్వరూపం ఏమిటో అర్ధం అవుతున్నది. పత్రికలు పెద్దగా చెప్పని విషయం ఏమిటంటే త్వరలో కొత్తగా రు 500 నోటు, రు 2000 నోటు ఆర్‌బి‌ఐ ముద్రించబోతున్నదట. ఆ సంగతి కూడా ప్రధాన మంత్రి గారే చెప్పారా లేక ఎవరు చెప్పారన్నది తెలియడం లేదు. ఇండియా టుడే ఇంటర్నెట్ వర్షన్ అది కూడా మోడియే…

రు 500, రు 1000 నోట్లు రద్దు -ప్రధాని మోడి

ఎన్‌డి‌ఏ/బి‌జే‌పి/నరేంద్ర మోడి ప్రభుత్వం ఒకింత సంచలన నిర్ణయం ప్రకటించింది. రెండు పెద్ద కరెన్సీ నోట్లను ఈ రోజు అర్ధ రాత్రి నుండి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జాతిని ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో ప్రధాన మంత్రి ఈ నిర్ణయాన్ని ప్రకటించారని పత్రికలు, ఛానెళ్లు హోరెత్తిస్తున్నాయి. ఎంపిక చేసిన కొన్ని చోట్ల నవంబర్ 11 వరకు రు 500/-, రు 1000/- లను అనుమతిస్తారని ఆ తర్వాత అన్ని చోట్లా నిషేధం అమలు అవుతుందని ప్రధాన మంత్రి ప్రకటించినట్లు తెలుస్తున్నది.…

పౌండ్: సెకన్లలో 10% పతనం

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
బ్రిటిష్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ శుక్రవారం లిప్తపాటు కాలంలో భారీగా పతనమై కలకలం సృష్టించింది. అనంతరం తిరిగి కోలుకున్నప్పటికీ పౌండ్ క్రాష్ తో ప్రపంచ మార్కెట్లు  ఒక్కసారిగా కలవర పడ్డాయి.  శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం అయ్యాక ఒక దశలో పౌండ్ విలువ 1.2600 డాలర్ల వద్ద ఉన్నది. ఇంతలో ఏమైందో ఏమో ఒక్కసారిగా పతనం కావడం మొదలయింది. ఎంత వేగంగా పతనం అయిందంటే కొద్ది సెకన్ల తర్వాత చూస్తే పౌండ్ విలువ 1.1378…

స్పెక్ట్రమ్ వేలం: లాభం 65 వేల కోట్లు, తప్పిన అంచనాలు!

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన 4G స్పెక్ట్రమ్ పూర్తయింది. భారీ మొత్తంలో 4G స్పెక్ట్రమ్ ని వేలానికి పెట్టిన ప్రభుత్వానికి అంచనా వేసినంత భారీ ఆదాయం మాత్రం దక్కలేదు. కొన్ని కేటగిరీలలోని స్పెక్ట్రమ్ ని కంపెనీలు అసలు ముట్టుకొనే లేదు. బేస్ ధర చాలా ఎక్కువగా ఉన్నదని కంపెనీలు పెదవి విరిచాయి. మొత్తం మీద వేలంలో 65,789 కోట్ల మేర స్పెక్ట్రమ్ కొనుగోలు జరిగింది. అందులో ఈ సంవత్సరం రు 32,000/- ప్రభుత్వానికి ఆదాయంగా…

RBI వడ్డీ తగ్గింపు -విశ్లేషణ

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
రిజర్వ్ బ్యాంకు పాలసీ వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనర్ధం వడ్డీ రేటు 0.25% తగ్గుతుంది అని. 6.5% గా ఉన్న రేటు ఇప్పుడు 6.25% అయింది. ఈ కోతతో పారిశ్రామిక వర్గాలు సంతోషం ప్రకటించాయి.  అసలు కోతకు ముందే, కోత కోస్తారని ముందే ఊహిస్తూ  సెన్సెక్స్ సూచి 377 పాయింట్లు పెరిగింది. దానితో అసలు కోత జరిగాక సూచి పెద్దగా పెరగలేదు.  తాజా వడ్డీ కోత వెనుక గమనించవలసిన…

31 ఏళ్ళ స్ధాయికి పడిపోయిన బ్రిటన్ కరెన్సీ

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
బ్రెగ్జిట్ విషయమై సోమవారం నాడు బ్రిటిష్ ప్రధాని చేసిన ప్రకటన ప్రభావం చూపిస్తోంది. బ్రెగ్జిట్ ప్రక్రియ కు స్పష్టమైన టైం టేబుల్ ను ఆమె ప్రకటించడంతో బ్రిటిష్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ విలువ 31 ఏళ్ళ కనిష్ట స్ధాయికి పడిపోయింది. దానితో బ్రిటిష్ ఎగుమతులు పెరుగుతాయన్న అంచనాతో బ్రిటిష్ ప్రధాన స్టాక్ మార్కెట్ సూచి FTSE 16 నెలల గరిష్ట స్ధాయికి పెరిగింది.  అధికార కన్సర్వేటివ్ పార్టీ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ప్రధాని…

పాచికలో ఒపెక్ పాత్ర -ద హిందూ…

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
ప్రపంచ చమురు మార్కెట్ లో సరఫరా, గిరాకీ (డిమాండ్) ల మధ్య సమతూకం నెలకొల్పే ప్రయత్నంలో రోజుకి 700,000 బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తిని ఉమ్మడిగా తగ్గించడానికి అల్జీర్స్ లో జరిగిన అసాధారణ సమావేశంలో చమురు ఎగుమతి దేశాల సంఘం (ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్ -ఒపెక్ ) కుదుర్చుకున్న ఒప్పందం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. రెండేళ్లుగా దిగజారుతున్న ప్రపంచ క్రూడ్ ధరలు మరింత పడిపోకుండా నిలబెట్టడానికి ఈ…

15 లక్షలు ఇస్తామని రు. 245 కి దిగారు!

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
నల్ల డబ్బుకి సంబంధించి ఎన్నికల్లో నరేంద్ర మోడి ఇచ్చిన వాగ్దానం గుర్తుందా? అధికారం లోకి రావడం తోటే విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు వెనక్కి తెప్పిస్తాం అన్నారు. అలా తెప్పించిన డబ్బుని ఉపయోగ పెట్టి ఒక్కో పౌరుడి బ్యాంకు ఖాతాలో రు 15 లక్షలు జత చేస్తాం అన్నారు. అనగా రు. 18 కోట్ల కోట్లు మేర భారతీయులు దాచిన నల్ల ధనం విదేశాల్లో మూలుగుతోంది అని చెప్పారు. ఇంతదాకా ఆ డబ్బు…

ఇటలీ: యూరోని వదిలేస్తే తప్ప ఆర్ధిక వృద్ధి అసాధ్యం!

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
  బ్రెగ్జిట్ రిఫరెండం అనంతరం ఈయూ సభ్య దేశాలలో క్రమంగా అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. యూరో జోన్ నుండి బైట పడాలని కొన్ని దేశాలలోని పార్టీలు డిమాండ్ చేస్తుంటే అసలు యూరోపియన్ యూనియన్ నుండే బైట పడాలని మరికొన్ని సభ్య దేశాలలోని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.  యూరో జోన్ నుండి బైట పడడం అంటే ఉమ్మడి కరెన్సీ యూరోని జాతీయ కరెన్సీగా త్యజించడం. యూరోపియన్ యూనియన్ నుండి బైట పడటం అంటే అసలు…

అచ్ఛే దిన్ కనుచూపు మేరలో లేవు -మూడీస్

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
ప్రధాన మంత్రి మోడీ హామీ ఇఛ్చిన అచ్ఛే దిన్ ఎప్పటికి సాకారం అవుతాయని భారత ప్రజలు మాత్రమే అడగడం లేదు. అంతర్జాతీయ రేటింగ్ కంపెనీలు కూడా అదే మాట అడుగుతున్నాయి.  అయితే భారత ప్రజలు కోరే మంచి దినాలు, రేటింగ్ కంపెనీలు కోరే మంచి దినాలు ఒకటి కావు. పైగా పరస్పర విరుద్ధం. రేటింగ్ కంపెనీలు కోరే మంచి దినాలు వస్తేనేమో అవి ప్రజలకు చెందిన ఖనిజ, నీటి, మానవ వనరులను అన్నింటిని…

స్మార్ట్ సిటీ: ఇంతవరకు ఒక్క పైసా రాలింది లేదు!

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
మోడి ప్రభుత్వం మరో విడత స్మార్ట్ సిటీల జాబితా ప్రకటించింది. స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు ఎంపిక అయిన నగరాలను కేంద్రం ప్రకటించడం ఇది మూడోసారి. ఇన్నిసార్లు ప్రకటించినప్పటికీ ఈ రెండేళ్ల మోడి పాలనలో విదేశీ పెట్టుబడి ఒక్క రూపాయి కూడా (విదేశీ పెట్టుబడి కాబట్టి ఒక్క డాలర్ కూడా అందాం పోనీ) దేశంలోకి, స్మార్ట్ సిటీల్లోకి రాలేదు. మొదటి విడత 20 నగరాల జాబితా విడుదల చేయగా రెండో విడత 13 నగరాల…

బ్రటిస్లావా నుండి వచ్చే రోడ్డు (ఎటు వైపు?) -ద హిందూ ఎడిట్…

– [ఈ రోజు ద హిందూ ‘The road from Bratislava’ శీర్షికన  ప్రచురించిన సంపాదకీయానికి ఇది యధాతథ అనువాదం] ఒకటి తక్కువ 28 ఈయూ దేశాలు బ్రెగ్జిట్ అనంతర ప్రపంచం గురించి చర్చించడానికి సమావేశమైన బ్రటిస్లావా భవంతిలో ఐక్యత, పొందికల లేమి సుస్పష్టంగా వ్యక్తం అయింది. ఏ ఒక్కరూ ఎలాంటి భ్రమలకూ తావు ఇవ్వటం లేదు. ఈయూ ఉనికికి సంబంధించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లాడ్…