విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ బొనాంజా

అయినోడికి ఆకులు, కానోడికి కంచాలు! అదేమంటే జి.డి.పి వృద్ధి కోసం అని సాకులు. ఇదీ మన ప్రభుత్వ విధానం. స్వంతగా ఏడవ లేక పరాయి దేశాల పెట్టుబడిదారులను పిలిచి ‘మా దేశాన్ని అభివృద్ధి చేయండహో’ అని చాటింపు వేస్తున్నారు మన ఆర్ధిక మంత్రి చిదంబరం. ఎఫ్.ఐ.ఐ (విదేశీ సంస్ధాగత పెట్టుబడులు), క్యు.ఎఫ్.ఐ (క్వాలిఫైడ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ – అర్హిత విదేశీ పెట్టుబడులు) ల సొంతదారులు ఇప్పుడిక తమ వడ్డీ ఆదాయంపై 20 శాతం పన్ను బదులు 5…

అవినీతిని సహించరట! -కార్టూన్

– “వాళ్ళ అవినీతి కుంభకోణాల్లో ఎన్ని సున్నాలున్నా మనం భరిస్తున్నామనేనా దానర్ధం?” – “అవినీతిని ఇక ఎంత మాత్రం సహించేది లేదు” ఇది మన మంత్రులు, ముఖ్య మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి, రాజ్యాంగేతర శక్తులు తరచుగా చేసే హెచ్చరిక. ఈ హెచ్చరికలో ఎంత బోలుతనం, ఎంత పరిహాసం, ఇంకెంత కపటం, మరెంత నమ్మక ద్రోహం ఉన్నదో ఆ చెప్పేవాడికీ, విని రాసుకుని పత్రికల్లో నివేదించేవారికీ, చదివేవారికీ… అందరికీ తెలుసు. అయినా సరే, అలవాటు పడిపోయాం…

దొంగ-గజదొంగ : నేరము-శిక్ష -కార్టూన్

– ఖైదీ నెం. 1: వాల్ స్ట్రీట్ లో బిలియన్లు దొంగిలించినందుకు నాకు 3 నెలలు వేసారు! కేడీ నెం. 1: కొన్ని జాయింట్లు నా దగ్గర దొరికాయని నాకు 3 సంవత్సరాలు వేశారు!! – అమెరికాలో వాల్ స్ట్రీట్, బ్రిటన్ లో ‘ద సిటీ (ఆఫ్ లండన్)’, ఇండియాలో దలాల్ స్ట్రీట్… ఇత్యాది బజార్లలో సామాన్యులకు ప్రవేశం దుర్లభం. గోల్డ్ మెన్ గజదొంగలకే ఇక్కడ ప్రవేశం.  సెకన్ల వ్యవధిలోనే షేర్ల కదలికల్ని ప్రభావితం చేసి మిలియన్ల…

ద్రవ్యోల్బణం తగ్గెను, వడ్డీ రేటు తగ్గును… (ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల వివరణ)

రిజర్వ్ బ్యాంకు నిధుల కోసం కాచుకు కూచున్న కంపెనీల కలలు తీరే రోజు వస్తోంది. ఆర్.బి.ఐ వడ్డీ రేటు మరింత తగ్గడానికి, తద్వారా రిజర్వ్ బ్యాంకు నుండి మరిన్ని నిధులు పొందడానికి కంపెనీలు ‘వర్షపు నీటి చుక్క కోసం ఎదురు చూసే చాతక పక్షుల్లా’ చూస్తున్న ఎదురు చూపులు ఫలించే రోజు రానున్నది. కంపెనీల తరపున వడ్డీ రేట్లు తెగ్గోయాలని ఆర్.బి.ఐ వద్ద చెవినిల్లు కట్టి పోరుతున్న ఆర్ధిక మంత్రి పి.చిదంబరం కూడా కాలర్ ఎగరేయబోతున్నారు. కారణం…

రేటింగ్ కంపెనీలు: అమెరికాకి పోటీగా చైనా రంగంలోకి

అమెరికా రేటింగ్ కంపెనీలకు పోటీగా చైనా తన స్వంత రేటింగ్ కంపెనీని రంగంలోకి దించుతోంది. దశాబ్దాలుగా మార్కెట్ ఎకానమీ దేశాలలో రేటింగ్ కంపెనీల మార్కెట్ ను శాసిస్తున్న మూడు అమెరికా కంపెనీలకు ఇప్పటి వరకు మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. స్టాండర్డ్ & పూర్ (ఎస్ & పి), మూడీస్, ఫిచ్… ఈ మూడు క్రెడిట్ రేటింగ్ కంపెనీలదే ఇప్పటివరకు రేటింగ్ లను జారీ చేయడంలో ఇష్టారాజ్యం. ఆర్ధికంగా అమెరికాకు పోటీగా ఎదిగిన చైనా క్రమ క్రమంగా…

చిట్ ఫండ్ మోసానికి మమత పొగాకు పరిష్కారం -కార్టూన్

జనం బాధలంటే రాజకీయ నాయకులకు ఎంత చులకనో! ప్రజల కష్టాలకు వారు ఎదుర్కొంటున్న మోసాలకు సానుభూతి పలుకుతూనే వారి పరిస్ధితి పైన కుళ్ళు జోకులు వేయడం నాయకులకు తేలికైన విషయం. తాజాగా మమతా బెనర్జీ కూడా ఇలాంటివారి జాబితాలో చేరిపోయారు. పశ్చిమ బెంగాల్ లో శారదా చిట్ ఫండ్స్ సంస్ధ బోర్డు తిప్పేయడంతో లక్షలాది జనం దాచుకున్న సొమ్ము కోల్పోయి గొల్లుమంటున్నారు. మోసపోయిన వారి కోసం 500 కోట్ల రూపాయల కార్పస్ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి…

ఇరానియన్ సామ్ సంగ్, ఈ.యూ విచ్ఛిన్నం…. క్లుప్తంగా -26.04.2013

అమెరికాలో యు.పి మంత్రి డిటెన్షన్ హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు ‘కుంభమేళా’ గురించి వివరించడానికి యు.పి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అమెరికా వెళ్ళాడు. ఆయనకి తోడుగా వెళ్ళిన ఆ రాష్ట్ర మంత్రి అజామ్ ఖాన్ ను బోస్టన్ లోని లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అధికారులు కొద్ది సేపు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆయనకి రాయబార హోదా ఉన్నప్పటికీ ‘మరింతగా ప్రశ్నించడానికి’ మంత్రిని పది నిమిషాల సేపు నిర్బంధించారని ది హిందు తెలిపింది. తాను ముస్లిం అయినందునే అక్రమంగా…

బాధ్యత ఆగేది ఇక్కడ (కాదు) -కార్టూన్

1945-53 మధ్య అమెరికా అధ్యక్షుడుగా పని చేసిన హేరి ఎస్. ట్రూమన్ టేబుల్ మీద ఒక సైన్ బోర్డు ఉండేది. దాని పైన ‘THE BUCK STOPS HERE” అని రాసి ఉండేది. దానర్ధం ‘నా పాలనలో ఏం జరిగినా బాధ్యత నాదే’ అని. తన అధ్యక్షరికంలో తప్పులు జరిగినా అందుకు బాధ్యత మరొకరి మీదికి నెట్టననీ, తానే స్వీకరిస్తానని సదరు సైన్ బోర్డు ద్వారా ట్రూమన్ చెప్పదలిచాడు. (ఆ విధంగా యుద్ధం ఎలాగూ ముగుస్తుందనుకుంటున్న సమయంలో…

రేషన్ షాపు కాదు బంగారం కొట్టు -కార్టూన్

“ఇది రేషన్ కోసం. బంగారం కోసం క్యూ అదిగో, అక్కడుంది!” ——————————— గత కొన్ని రోజులుగా బంగారం ధర భారీ స్ధాయిలో పతనం అవుతోంది. ఇండియాలో అయితే గత శనివారం నుండి బంగారం రేటు పెద్ద ఎత్తున పడిపోతోంది. మంగళవారం వరకు భారీగా పతనం అయిన బంగారం ధర బుధవారం కూడా పతనం కొనసాగి ట్రేడింగ్ చివర కొద్దిగా పెరిగినట్లు తెలుస్తోంది. భుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 10 గ్రాముల బంగారం ధర 25,790 రూపాయల వద్ద…

పంపిణీ, పెట్టుబడిదారీ పూర్వ అధిక-వడ్డీ మరియు వర్తక పెట్టుబడులు

భారత వ్యవసాయ రంగంలో మార్పులు -ఒక నోట్ -పార్ట్ 2       పంపిణీలు & ఉత్పత్తి (Distributions & Production): భూమి అద్దె, వేతనాలు, వడ్డీ మరియు లాభ మొత్తం లను పంపిణీ కిందా, భూమి, శ్రమ మరియు పెట్టుబడి మొత్తం లను ఉత్పత్తి కిందా మార్క్స్ చర్చించారు. “పంపిణీ రూపాలలో ఉండే వడ్డీ మరియు లాభాలు ‘పెట్టుబడి, ఉత్పత్తి యొక్క ప్రతినిధి (agent of production)’ అనే పూర్వాలోచన (presupposes) కలిగి ఉంటాయి” అని కూడా…

రికార్డులు తిరగ రాస్తున్న యూరోజోన్ నిరుద్యోగం

17 ఐరోపా దేశాల మానిటరీ యూనియన్ ‘యూరోజోన్’ నిరుద్యోగంలో తన రికార్డులు తానే తిరగ రాస్తోంది. ఉమ్మడి యూరో కరెన్సీ ఉనికిలోకి వచ్చిన గత 13 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా 12 శాతం నిరుద్యోగాన్ని నమోదు చేసింది. జనవరిలో 11.9 శాతంగా ఉన్న నిరీద్యోగ శాతం మరో 33,000 మంది ఉద్యోగాలు కోల్పోవడంతో ఫిబ్రవరిలో 12 శాతానికి పెరిగింది. ఐరోపా వ్యాపితంగా అధికారిక నిరుద్యోగుల సంఖ్య 1.91 కోట్లకు పై చిలుకేనని ఐరోపా గణాంక సంస్ధ…

ఉమ్మడి ప్రయోజనాలకు గొడుగు -బ్రిక్స్ పై ఈనాడు ఆర్టికల్

“ఉమ్మడి ప్రయోజనాలకు గొడుగు” శీర్షికన, “ఆశలు రేకెత్తిస్తున్న బ్రిక్స్ బ్యాంకు” ఉప శీర్షికన ఈనాడు ఎడిటోరియల్ పేజిలో ఈ రోజు ఈ బ్లాగర్ రాసిన ఆర్టికల్ ప్రచురించబడింది. ఎడిటోరియల్ పేజిలో ప్రచురితం కావడం ఈ బ్లాగర్ కి ఇదే మొదటిసారి. పత్రిక జతచేసిన బ్రిక్స్ దేశాధినేతల ఫొటో, బ్రిక్స్ సభ్య దేశాలతో భారత దేశ వాణిజ్యాన్ని వివరించె గ్రాఫు ఆర్టికల్ కు మరింత పరిపుష్టతను చేకూర్చాయి. ఈ సందర్భంగా ఈనాడు, మిత్రులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు చెప్పడం…

డాలర్ నిల్వలకు ఎసరు తెస్తున్న ధనికుల బంగారం దాహం

భారత దేశ ధనికులు బంగారం పైన పెంచుకుంటున్న వ్యామోహం మన విదేశీ మారక ద్రవ్య నిల్వలకు ఎసరు తెస్తోంది. దేశంలోకి వస్తున్న విదేశీ మారక ద్రవ్యం కంటే బంగారం, చమురుల కొనుగోళ్ల కోసం దేశం బైటికి వెళుతున్న విదేశీ మారక ద్రవ్యమే ఎక్కువ కావడంతో నిల్వలు తరిగిపోతున్నాయి. ఫలితంగా భారత ఆర్ధిక వ్యవస్థకు కరెంటు ఖాతా లోటు (Current Account Deficit –CAD) రికార్డు స్థాయికి చేరుకుంది. ఒక దేశ ఆర్ధిక వ్యవస్థ మౌలిక ప్రమాణాలలో (ఫండమెంటల్స్)…

చైనా 2016కల్లా అమెరికాను దాటిపోతుంది -ఒఇసిడి

2016 నాటికి చైనా ఆర్ధిక వ్యవస్థ ‘పర్చేసింగ్ పవర్ ప్యారిటీ’ (పి.పి.పి) పరంగా అమెరికాను మించిపోతుందని ఒఇసిడి (Organization for Economic Cooperation and Development) జోస్యం చెప్పింది. వరుసగా నాలుగో దశాబ్దంలో వేగవంతమైన ఆర్ధిక వృద్ధి (జి.డి.పి వృద్ధి రేటు) నమోదు చేయడానికి చైనా ఉరుకులు పరుగులు పెడుతోందని ఒఇసిడి విడుదల చేసిన తాజా నివేదిక తెలియజేసింది. గత సంవత్సరం జపాన్ ఆర్ధిక వ్యవస్థ పరిమాణాన్ని మించి పోయి అమెరికా తర్వాత అతి పెద్ద ఆర్ధిక…

హిందూయిజం అసలు మతమే కాదు -ఆదాయపన్ను శాఖ

ఆదాయపన్ను ఎగవేయడం కోసం మత విశ్వాసాలను కూడా కాలదన్నుకుంటున్న విచిత్ర పరిస్ధితి! ఆ ట్రస్టు కార్యక్రమాలన్నీ మతపరమైనవే. కానీ ఆదాయపన్ను మినహాయింపు కోసం హిందూమతాన్ని మతం కాదనీ, హిందువులు మతావలంబకులు కాదని వాదిస్తోంది. శివుడు అసలు దేవుడే కాదని, ఆ మాటకొస్తే దేవుడి శిల్పాలు ఉన్నంత మాత్రాన అది దేవాలయం కాదని కూడా ఆదాయపన్ను శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు వాదించింది. ఇంకా విచిత్రం ఏమిటంటే ఐ.టి. అప్పిలేట్ ట్రిబ్యునల్ ఈ వాదనను అంగీకరించి ఆదాయపన్ను శాఖ…