ఆఫ్రికాపై సామ్రాజవాద ఆధిపత్యం కోసం అమెరికా దీర్ఘకాలిక యుద్దం -జేమ్స్ పెట్రాస్

ఆఫ్రికా ఖండంలోని దేశాలలోని వనరులపై ఆధిపత్యం కోసం అమెరికా 1950 ల నుండే మిలట్రీ జోక్యం ప్రారంభించిందనీ, దానిలో భాగంగానే ప్రస్తుతం లిబియాలోని గడ్డాఫీ ప్రభుత్వాన్ని కూలదోసి తనకు అనుకూలమైన దిష్టిబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఫ్రాన్సు, బ్రిటన్ లతో కలిసి దురాక్రమణ దాడులకు పూనుకుందని అమెరికాకి చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు జేమ్స్&‌ పెట్రాస్ వివరించాడు. ఆయన మాటల్లొనే చెప్పాలంటే: ——————– “కాంగ్రెషనల్ రీసర్చ్ సర్వీస్” ఆధ్వర్యంలో ‘లారెన్ ఫ్లోక్’ అధ్యయనం చేసి ఒక నివేదికను నవంబరు…

మిస్రాటాను కాపాడండి, లేదా మేమే కాపాడుకుంటాం! లిబియా ఆర్మీకి గిరిజన తెగల అల్టిమేటం

లిబియాలో తిరుగుబాటుదారులకూ, ప్రభుత్వ సైనికులకూ జరుగుతున్న తీవ్రమైన పోరు కొత్త మలుపు తిరిగింది. “మిస్రాటా పట్టణం నుండి తిరుగుబాటుదారుల్ని ప్రభుత్వ సైన్యం వెళ్ళగొట్టలేకపోతే చెప్పండి. మేమే అందుకు పూనుకుంటాం” అని స్ధానిక గిరిజన తెగలు అల్టిమేటం ఇచ్చాయని ఉప విదేశాంగ మంత్రి ఖలేద్ కైమ్ ను ఉటంకిస్తూ బిబిసి తెలిపింది. “ఇకనుండి మిస్రాటాలో పరిస్ధితిని అక్కడ నివాసం ఉంటున్నవారు, చుట్టుపక్కల గిరిజన తెగల ప్రజలు ఎదుర్కొంటారు. ప్రభుత్వ సైన్యం ఆ భాధ్యతనుండి విరమించుకుంటుంది. వారు తిరుగుబాటుదారులతో చర్చలు…

మిస్రాటా శరణార్ధి నౌకలు, పశ్చిమ దేశాల అబద్ధపు ప్రచారానికి సాక్ష్యం

లిబియా యుద్ధం ఎందుకు వచ్చిందంటే చాలామంది చెప్పే సమాధానం “గడ్డాఫీ సైన్యాలు లిబియా పౌరులపై దాడులు చేస్తూ చంపడం వలన” అని. అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక హక్కుల కోసం ఉద్యమాలు చెలరేగుతున్నాయనీ, దానిలో భాగంగానే లిబియాలొ కూడా ప్రజాస్వామిక ఉద్యమం మొదలైందనీ, కానీ ఉద్యమాన్ని లిబియా నియంత గడ్డాఫీ సైనిక బలంతో అణచివేయడానికి లిబియా పౌరులను చంపుతుండడం వలన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ ల నాయకత్వంలో కొన్ని దేశాలు లిబియా పై “నిషిద్ధ గగనతలం” అమలు చేయడానికి…

లిబియా తిరుగుబాటుదారులకు పశ్చిమ దేశాల మిలట్రీ ట్రైనింగ్

ఐక్యరాజ్య సమితి 1973 వ తీర్మానం ప్రకారం గడ్దాఫీ బలగాల దాడుల్లో చనిపోతున్న లిబియా పౌరులను రక్షించడానికి సమితి సభ్య దేశాలు “అవసరమైన అన్ని చర్యలూ” తీసుకోవచ్చు. దీన్ని అడ్డం పెట్టుకుని తమ సైన్యాలను బహిరంగంగా లిబియాలో దింపడానికి అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్, కెనడా తదితర దేశాలకు ధైర్యం చాలడం లేదు. వారు భయపడుతున్నది గడ్దాఫీని గానీ, వారి సైనికులను చూసిగానీ కాదు. తమ సొంత ప్రజలకు అవి భయపడుతున్నాయి. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల్లో అనేకమంది సైనికులు…

గడ్డాఫీ అమ్ములపొదిలో క్లస్టర్ బాంబులు, హక్కుల సంస్ధ ఆందోళన

లిబియాలో గడ్డాఫీ బలగాలు పౌరులపై క్లస్టర్ బాంబులు ప్రయోగిస్తున్నాయని మానవహక్కుల సంస్ధ హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్ధ ఆరోపించింది. ఈ ఆరోపణలను లిబియా ప్రభుత్వం తిరస్కరించింది. క్లస్టర్ బాంబులుగా పెర్కొంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక కొన్ని ఫోటోలను ప్రచురించింది. పౌరుల నివాస ప్రాంతాల్లో క్లస్టర్ బాంబుల్ని పేల్చడం వలన మానవ నష్టం అపారంగా ఉంటుందనీ, గడ్డాఫీ ఈ బాంబుల వాడకాన్ని వెంటనే నిలిపివేయాలనీ హక్కుల సంస్ధ డిమాండ్ చేసింది. అయితే న్యూయార్క్ టైమ్స్ విలేఖరికి కనిపించిన బాంబు…

లిబియా దాడులపై అమెరికా, ఫ్రాన్సులకు దొరకని మద్దతు

లిబియా పౌరుల రక్షణ పేరుతో ఆ దేశంపై వైమానిక దాడులను తీవ్రతరం చేయడానికి అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలు మరిన్ని నాటో దేశాల మద్దతు కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. గురువారం బెర్లిన్ లో నాటో దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. లిబియాపై వైమానిక దాడులు చేస్తున్న ఆరు నాటో దేశాలతో పాటు మిగిలిన దేశాలు కూడా బాంబు దాడులు ప్రారంభించాలని ఈ సమావేశంలో అమెరికా, ఫ్రాన్సు, ఇంగ్లంద్ దేశాలు కోరాయి. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్…

లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలిస్తాం -పశ్చిమ దేశాలు

లిబియా ఆయిల్ వనరులను పూర్తిగా తమకు అప్పగించడానికి నిరాకరిస్తున్న గడ్డాఫీని గద్దె దించడానికి పశ్చిమ దేశాలైన అమెరికా, బ్రిటన్ లు లిబియా తిరుగుబాటుదారులకు ఆధునిక ఆయుధాలు అందించడానికి రెడీ అయ్యారు. లిబియా పై ఐక్యరాజ్యసమితి ఆయుధ రవాణా నిషేధం విధించినప్పటికీ పశ్చిమ దేశాలు దాన్ని పట్టించుకోదలచుకోలేదు. ఐక్యరాజ్యసమితి 1970 వ తీర్మానం ద్వారా లిబియాలోని ఇరు పక్షాలకు ఆయుధాలు సహాయం చేయకుండా, అమ్మకుండా నిషేధం విధించింది. 1973 వ తీర్మానం ద్వారా లిబియాలో పౌరల రక్షణకు అవసరమైన…

లిబియాపై దాడులు మరింత తీవ్రం చేయాలి -ఫ్రాన్సు, ఇంగ్లండ్

లిబియాపై నాటో ప్రస్తుతం చేస్తున్న దాడులు సరిపోలేదనీ, దాడుల తీవ్రత పెంచాలనీ ఫ్రాన్సు, బ్రిటన్ ప్రభుత్వాలు డిమాండ్ చేశాయి. ఫ్రాన్సు, ఇంగ్లండ్ లు కూడా నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) లో సభ్యులే. లిబియాపై నో-ఫ్లై జోన్ అమలు చేయడానికి నాయకత్వం వహించడానికి అమెరికా తిరస్కరించడంతో నాటో నాయకత్వ పాత్ర నిర్వహిస్తోంది. గడ్డాఫీ విమానదాడులనుండి లిబియా పౌరులను రక్షించడానికి నో-వ్లై జోన్ అమలు చేయాలనీ, లిబియా పౌరులను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి…

ఇద్దరు పుత్రులతో సహా ముబారక్ ను అరెస్టు చేసిన ఈజిప్టు మిలట్రీ ప్రభుత్వం

ఈజిప్టు ప్రజల ఉద్యమం దెబ్బకు గద్దె దిగిన ఈజిప్టు నియంత ముబారక్, అతని ఇద్దరు పుత్రులను ఈజిప్టు తాత్కాలిక సైనిక ప్రభుత్వం బుధవారం నిర్బంధంలోకి తీసుకుంది. ముబారక్ తో పాటు, అతని కుటుంబ సభ్యులు తమ పాలనలో తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారనీ, వారితో కుమ్మక్కైన సైనిక ప్రభుత్వం విచారణ జరగకుండా కాలం గడుపుతోందనీ ఆరోపిస్తూ ఈజిప్టు ప్రజలు మళ్ళీ తాహ్రిరి కూడలి వద్ద బైఠాయింపు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మళ్ళీ ప్రజా ఉద్యమం ప్రారంభమైనాక సైనికుల కాల్పుల్లో…

ఫ్రాన్సు కండకావరం

ఆఫ్రికాలో ఫ్రాన్సు కండకావరానికి మరో దేశం బలయ్యింది. ఐవరీకోస్టు దేశానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన అధ్యక్షుడు లారెంట్ జిబాగ్బోను శాంతి పరిరక్షణ పేరుతో దేశంలొ తిష్ట వేసిన ఫ్రాన్సు సైన్యాలు అరెస్టు చేశాయి. ఫ్రాన్సు సేనలు అధ్యక్షుడి ఇంటిపైకి తమ ట్యాంకులను నడిపించాయి. ఇంటి ప్రహరీగోడను కూల్చివేస్తూ లోపలికి చొచ్చుకెళ్ళి అధ్యక్షుడు జిబాగ్బోను అరెస్టు చేసినట్లుగా అతని సహాయకుడు వార్తా సంస్ధలకు తెలిపాడు.అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. గత నవంబరులో జరిగిన ఎన్నికల్లో లారెంట్…

సైనిక ప్రభుత్వంపై పెరుగుతున్న ఈజిప్టు ప్రజల ఆగ్రహం

ఈజిప్టు ప్రజల్లొ సైనిక ప్రభుత్వంపై రోజు రోజుకీ ఆగ్రహం పెరుగుతోంది. తాము మూడు వారాల పాటు ఉద్యమించి నియంత ముబారక్ ను గద్దె దింపినప్పటికీ ముబారక్ పాలన అంతం కాలేదన్న అసంతృప్తి వారి ఆగ్రహానికి కారణం. ముబారక్ పాలనలో వ్యవహారాలు నడిపినవారే ముబారక్ ను సాగనంపిన తర్వాత కూడా కొనసాగుతుండడం, వారే ఇంకా నిర్ణయాలు తీసుకునే స్ధానంలొ కొనసాగడం వారికి మింగుడుపడడం లేదు. తాము సాధించామనుకున్న విప్లవం, మార్పు నామమాత్రంగా మిగిలిపోతున్న సూచనలు కనిపిస్తుండడంతో ఈజిప్టు ప్రజల్లో…

ఈజిప్టులో మళ్ళీ ఆందోళనలు, ముబారక్ ను మరిపిస్తున్న ఈజిప్టు సైనిక ప్రభుత్వం

ఫిబ్రవరి 11 న ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్ ను గద్దె దింపిన ప్రజల ఆందోళనలు తిరిగి మొదలయ్యాయి. ముబారక్ నుండి అధికారం నుండి చేపట్టిన సైనిక ప్రభుత్వం తానిచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఈజిప్టు ప్రజలు మళ్ళీ తాహ్రిరి స్క్వేర్ లో శుక్రవారం పెద్ద ప్రదర్శన నిర్వహించారు. ముబారక్ గద్దె దిగి దేశంనుండి వెళ్ళి పోయిన తర్వాత కూడా కొంతమంది ఆందోళనకారులు విమోచనా కూడలి వద్ద బైఠాయింపు కొనసాగించారు. ప్రజలు డిమాండ్ చేసిన ప్రజాస్వామిక సంస్కరణలను…

లిబియా తిరుగుబాటు సైనికుల్ని చంపినందుకు క్షమాపణ నిరాకరించిన నాటో

లిబియా ప్రభుత్వ సైనికులుగా పొరబడి తిరుగుబాటు సైనికులను చంపినందుకు క్షమాపణ చెప్పడానికి నాటొ దళాల రియర్ ఆడ్మిరల్ రస్ హార్డింగ్ నిరాకరించాడు. గురువారం అజ్దాబియా, బ్రెగా పట్టణాల మధ్య జరుగుతున్న యుద్దంలో పాల్గొనటానికి తిరుగుబాటు బలగాలు తీసుకెళ్తున్న ట్యాంకుల కాన్వాయ్ పై నాటో వైమానిక దాడులు జరపడంతో పదమూడు మంది మరణించిన సంగతి విదితమే. “గడ్డాఫీ బలగాలకు చెందిన ట్యాంకులు మిస్రాటా పట్టణంలొ పౌరులపై నేరుగా కాల్పులు జరుపుతున్నాయి. పౌరులను రక్షించడానికే మేం ప్రయత్నిస్తున్నాము. గురువారం నాటి…

ఐవరీకోస్టులో కొనసాగుతున్న శాంతిదళాల అక్రమ ఆక్రమణ

అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న ఐవరీకోస్టు దేశంలో ఐక్యరాజ్యసమితి, ఫ్రాన్సులకు చెందిన శాంతి దళాల అక్రమ దాడులు కొనసాగుతున్నాయి. ఐవరికోస్టు ప్రజల రక్షణ పేరుతో అడుగుపెట్టిన సమితి శాంతి దళాలు, ఫ్రాన్సు తన ప్రయోజనాల కోసం తలపెట్టిన మిలట్రీ చర్యకు మద్దతుగా అధ్యక్షుడి నివాస భవనాన్ని చుట్టుముట్టాయి. సోమవారం సమితి, ఫ్రాన్సుల సైన్యాల మద్దతుతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచానంటున్న ‘అలస్సానె ఒట్టోరా’ బలగాలు “అంతిమ దాడి” పేరుతో చేసిన దాడిని అధ్యక్షుడు జిబాగ్బో సైన్యాలు తిప్పికొట్టాయి. ప్రస్తుతం సమితి, ఫ్రాన్సుల…

లిబియా తిరుగుబాటు బలగాల ఉసురు తీస్తున్న పశ్చిమదేశాల దాడులు

లిబియాపై పశ్చిమ దేశాల దాడులు వాటిని సహాయం కోసం పిలిచిన వారినే చంపుతున్నాయి. బుధవారం అజ్దాబియా పట్టణం నుండి వెనక్కి వెళ్తున్న తిరుగుబాటు బలగాలపై పశ్చిమ దేశాలు నాలుగు క్షిపణులను పేల్చడంతో కనీసం 13 మంది చనిపోగా మరింతమంది గాయపడ్డారని బిబిసి తెలిపింది. లిబియా అధ్యక్షుడు కల్నల్ గడ్డాఫీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తూర్పు లిబియాలో తిరుగుబాటు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. వారిపై వైమానికి బాంబుదాడులు చేస్తూ పౌరులను కూడా గడ్డాఫీ చంపుతున్నాడనీ పశ్చిమ దేశాలు నిందించాయి.…