ఈజిప్టు పోలీసులను చంపిన ఇజ్రాయెల్, రాయబారిని ఉపసంహరించుకుంటున్న ఈజిప్టు

ప్రజాస్వామిక హక్కుల కోసం జరిగిన ప్రజా ఉద్యమం అనంతరం నియంత ముబారక్ గద్దె దిగాక ఈజిప్టు, ఇజ్రాయెల్ ల మధ్య సంబంధాలు కొంతవరకు దెబ్బతిన్నాయి. మిలిటెంట్లకోసం వెతుకుతూ ఈజిప్టు భూభాగంలోనికి వచ్చిన ఇజ్రాయెల్ సైనికులు మిలిటెంట్లన్న నెపంతో ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపడం ఈజిప్టు ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. ఇజ్రాయెల్‌తో సంబంధాలు తెంచుకుని ఇజ్రాయెల్ రాయబారిని దేశం నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈజిప్టు ప్రజలు ఆందోళన నిర్వహించడంతో తమ రాయబారిని ఇజ్రాయెల్ నుండి విరమించుకోబోతున్నట్లుగా…

ఒళ్ళు జలదరించే భయానక ఆఫ్రికా కరువు దృశ్యం -ఫోటోలు

ఆఫ్రికా కరువు గాధలకు అంతే ఉండదు. అంతులేని కధల సమాహారమే అఫ్రికా కరువు గాధ. కరువు, దుర్భిక్షం, యుద్ధం… ఇవి మూడూ అఫ్రికా దేశాలకు శనిలా దాపురించాయి. కనుచూపు మేరలో పరిష్కారం కనపడక శనిపై నెపం నెట్టేయడమే కాని ఆఫ్రికా కరువు మానవ నిర్మితం. లాభాల దాహం తప్ప మానవత్వం జాడలు లేని బహుళజాతి కంపెనీలు ఒకనాటి చీకటి ఖండంపై రుద్దిన బలవంతపు యుద్ధాలే ఈ అంతులేని కరువుకి మాతృకలు. లాభాల దాహం దోపిడికి తెగబడితే దాన్ని…

మరోసారి నిరవధిక ఆందోళనలో ఈజిప్టు ప్రజానీకం, ముబారక్ అవశేషాల కోనసాగింపుపై ఆగ్రహం

18 రోజుల నిరవధిక దీక్షతో 30 సంవత్సరాల నియంతృత్వ పాలనను కూలదోసి, నియంత ముబారక్‌ను జైలుపాలు చేసిన ఈజిప్టు ప్రజానీకం మరొకసారి పోరాటబాట చేపట్టారు. ఈజిప్టు విప్లవం చేసిన డిమాండ్లను నెరవేర్చడంలో తాత్కాలిక సైనిక ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదనీ, డిమాండ్లు నెరవేర్చడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయడం లేదనీ ఈజిప్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈజిప్టు విప్లవం ప్రారంభ కాలంలో నిరసనకారులను కాల్చి చంపడానికి కారణమైన సైనికాధికారులనూ, పోలీసులనూ విచారించడం లేదనీ, వారిని స్వేచ్ఛగా వదిలేస్తున్నారనీ పైగా నిరసన కారులపై…

జులై 9న వెలసిన కొత్త దేశం, 196వ దేశంగా దక్షిణ సూడాన్

ప్రపంచ పటంలోకి మరొక కొత్త దేశం వచ్చి చేరింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన రిఫరెండంలో దక్షిణ సూడాన్ ప్రజలు 90 శాతానికి పైగా కొత్త దేశాన్ని కోరుకున్నారు. ప్రజల నిర్ణయాన్ని అమలు పరుస్తూ జులై 9, శనివారం తెల్లవారు ఝాము ప్రారంభ క్షణాల్లో దక్షిణ సూడాన్ ను ఏర్పాటు చేస్తూ ప్రకటన జారీ అయింది. ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు బాన్ కి మూన్, ఐక్య సూడాన్ అధ్యక్షుడు ఆల్-బషర్, 30 ఆఫ్రికా దేశాల ప్రతినిధుల సమక్షంలో…

నాటో దాడులకు వ్యతిరేకంగా లిబియా ప్రజల అతి పెద్ద ప్రదర్శన -వీడియో

లిబియా ప్రజలు గడ్డాఫీని తిరస్కరిస్తున్నారనీ, గడ్డాఫి పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారనీ గడ్దాఫీ ప్రభుత్వ బలగాలు లిబియా ప్రజలను చంపుతుంటే వారిని కాపాడ్డానికే తాము లిబియాపై బాంబులు మిసైళ్ళతో దాడులు చేస్తున్నామనీ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాలు ఊదరగొడుతున్న సంగతి తెలిసిందే. కాని నాటో దాడుల ఫలితంగా గడ్డాఫీని వ్యతిరేకిస్తున్న వారు సైతం తమ వ్యతిరేకతను పక్కన పెట్టి విదేశీ మూకల దాడులను దృఢంగా వ్యతిరేకిస్తున్నారు. జులై 1 జరిగిన లిబియా ప్రజలు పాల్గొన్న అతి పెద్ద…

లిబియా ప్రజలకు ‘నాటో’ ప్రసాదించిన ప్రజాస్వామ్యం -కార్టూన్

గడ్డాఫీని కూలదోసి లిబియా ప్రజలకు ప్రజాస్వామ్యం ప్రసాదించడానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు అనే గొప్ప ప్రజాస్వామ్య దేశాలు నడుం బిగించాయి. నాటో యుద్ధ విమానాలు లిబియాపై బాంబుదాడులు చేసి ప్రజలను చంపినా, అది వారిని కాపాడడానికే. గడ్డాఫీ బతికున్నంతవరకూ లిబియాను ఆయననుండి కాపాడ్డానికీ, లిబియా ప్రజలకు ప్రజాస్వామ్యం ప్రసాదించడానికి బాంబుదాడులు చేస్తూ ప్రజలు చంపుతూనే ఉంటాయట! కాని అది ప్రజలను గడ్డాఫీనుండి కాపాడ్డానికేనంటే నమ్మాలి మరి, తప్పదు! ఎందుకంటే చెప్తున్నది అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు గనక. అమెరికా,…

అదంతా నా సోదరిపై దుష్ప్రచారం -స్ట్రాస్ కాన్ బాధిత మహిళ సోదరుడు

ఐ.ఎం.ఎఫ్ మాజీ అధ్యక్షుడు డొమినిక్ స్ట్రాస్ కాన్‌పై రేప్ ఆరోపణలు చేసిన మహిళ డ్రగ్స్ ముఠాలతోనూ, మనీ లాండరింగ్ ముఠాలతోనూ సంబంధాలున్నాయని న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు కనుగొన్నట్లుగా వచ్చిన వార్తలను ఆమె సోదరుడు తీవ్రంగా ఖండించాడు. అదంతా తన సోదరిపై జరుగుతున్న దుష్ప్రచారమేననీ, ఆమెపై లేని పోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ రెలిపింది. ఉద్దేశ్య పూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాలకు తన సోదరిని బలి చేస్తున్నారని వాపోయాడు. “నా సోదరిని అపఖ్యాతిపాలు చేయడానికి కనిపెట్టిన…

మహిళలకు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో పాక్ మూడోది, ఇండియా నాలుగోది

ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలు ఏవి? రాయిటర్స్ వార్తా సంస్ధ అనుబంధంగా ఉండే ట్రస్ట్‌లా అనే సంస్ధ ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడానికి సర్వే చేసింది. ఇది అవినీతి వ్యతిరేక అంశాలు (anti-corruption issues), సమర్ధ పాలన (good governance), మహిళల హక్కుల (women rights) అంశాలపై ప్రపంచ స్ధాయిలో ఉచితంగా వార్తలు, సమాచారం, న్యాయ సలహాలు అందించే సంస్ధ. ధామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ దీన్ని నడుపుతోంది. మహిళలకు సంబంధించిన ఆరు అంశాలపై ఇది ప్రపంచ…

లిబియా విభజన వైపుగా యూరోపియన్ యూనియన్ చర్యలు?

లిబియాలో అంతర్యుద్ధాన్ని అడ్డు పెట్టుకుని ఆ దేశాన్ని రెండుగా విభజించేవైపుగా యూరోపియన్ యూనియన్ చర్యలు ప్రారంభించినట్టు కనిపిస్తోంది. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న లిబియా తూర్పు ప్రాంతానికి కేంద్రంగా ఉన్న బెంఘాజీ పట్టణంలో తన కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నది. బెంఘాజీ లిబియాలో రెండవ అతి పెద్ద పట్టణం. తిరుగుబాటుదారులుగా చెప్పబడుతున్న వారు ఇక్కడినుండే తమ చర్యలను ప్రారంభించారు. ఒకప్పుడు గడ్డాఫీ సైన్యంలో అధికారులుగా ఉన్న వారిని అమెరికా ఆకర్షించి గడ్డాఫీపై కొద్ది సంవత్సరాల క్రితం తిరుగుబాటు చేయించింది. అది విఫలమయ్యింది.…

గడ్డాఫీని మరోసారి టార్గెట్ చేసిన నాటో దాడులు, కొనసాగుతున్న ప్రతిష్టంభన

లిబియా ప్రజలను రక్షించే పేరుతో విచక్షణారహితంగా లిబియాపై వైమానికి దాడులు చేస్తున్న నాటో దళాలు మంగళవారం మరోసారి గడ్డాఫీ నివాస కాంపౌండ్‌పై పలు క్షిపణులతో దాడి చేశాయి. ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ రాయిటర్స్ ఈ వార్తను ప్రచురించింది. ఏప్రిల్ 30 తేదీన నాటో బాంబు దాడుల్లో గడ్డాఫీ చివరి కొడుకుతో పాటు ముగ్గురు మనవళ్ళు చనిపోయాక గడ్డాఫీ బహిరంగంగా ఇంతవరకు కనపడలేదు. క్షిపణి దాడుల వలన అద్దాలు పగిలి చెల్లాచెదురు కావడంతో అవి తగిలి నలుగురు పిల్లలు…

గడ్డాఫీ యుద్ద ఎత్తుగడలతో నాటో దళాల బేజారు

లిబియాలో పశ్చిమ ప్రాంతంలో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఏకైక పట్టణం మిస్రాటాలో నాటో విమానాలు గడ్డాఫీ బలగాలపై దాడులు కొనసాగుతున్నాయి. అయితే గడ్డాఫీ బలగాలు అనుసరిస్తున్న గెరిల్లా ఎత్తుగడల వలన నాటో వైమానిక దాడులు పెద్దగా ఫలితాలను సాధించలేక పోతున్నాయి. కాల్పులు జరిపి చెట్ల కిందో, భవనాల మధ్యనో దాక్కుంటూ గడ్దాఫీ బలగాల ట్యాంకులు తదితర యుద్ద ఆయుధాలు పని చేస్తుండడంతో వాటిపై బాంబు దాడులు చేసి నాశనం చేయడం నాటో దళాలకు కష్ట సాధ్యంగా మారింది.…

గడ్డాఫీని చంపడం చట్టబద్ధమేనట! అందుకు లిబియన్లు కోపగించుకుంటే చట్ట విరుద్ధమట!!

గడ్డాఫీ నివాస భవనాలపై శక్తివంతమైన మిసైళ్ళతో దాడులు చేయడం వలన గడ్డాఫీ కొడుకుతో పాటు ముగ్గురు మనవళ్ళు చనిపోవడంతో లిబియా రాజధాని ట్రిపోలి ప్రజలు అగ్రహోదగ్రులయ్యారు. నాటో హంతక దాడులను వ్యతిరేకిస్తూ పశ్చిమ దేశాల రాయబార కార్యాలయాల ముందు ట్రిపోలి ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పశ్చిమ దేశాల హంతకదాడులకు కొమ్ము కాస్తున్న ఐక్యరాజ్య సమితి కార్యాలయాల మీద కూడా దాడులు చేయడంతో సమితి తన కార్యాలయాల్ని మూసుకుని తమ సిబ్బందిని వెనక్కి పిలిపించుకుంది. బ్రిటన్ లోని…

గడ్దాఫీని చంపడానికి మళ్ళీ నాటో దాడి, కొడుకు ముగ్గురు మనవళ్ళు మృతి

గడ్డాఫీని చంపడానికే కంకణం కట్టుకున్న నాటో దేశాలు మరోసారి లిబియా అధ్యక్షుడు గడ్డాఫీ నివాస సముదాయంపై మిసైళ్ళతో దాడి చేశాయి. దాడినుండి గడ్డాఫీ తప్పించుకున్నప్పటికీ చిన్న కొడుకు సైఫ్ ఆల్-అరబ్ తో పాటు ముగ్గురు మనవళ్ళు చనిపోయినట్టు లిబియా ప్రభుత్వం తెలిపింది. భవనంపై కనీసం మూడు మిసైళ్ళు ప్రయోగించారనీ, దాడిలో భవనం పూర్తిగా దెబ్బతిన్నదనీ లిబియా ప్రభుత్వ ప్రతినిధి మౌసా ఇబ్రహీం తెలిపాడు. దాడి జరిగిన కొద్ది గంటల్లోనే నాటో ప్రతినిధి ఛార్లెస్ బౌచర్డ్ వివరణ ఇవ్వడానికి…

గడ్డాఫీని చంపడానికి పశ్చిమ దేశాల బాంబు దాడులు

లిబియా పౌరుల్ని రక్షించే పేరుతో లిబియా ప్రభుత్వ సైనిక సంపత్తిని నాశనం చేసే పనిలో ఉన్న పశ్చిమ దేశాలు మళ్ళీ గడ్డాఫీని చంపే ప్రయత్నాలను తీవ్రం చేశాయి. గడ్డాఫీ నివాస భవనాలపై సోమవారం నాటో సేనలు శక్తివంతమైన బాంబులను ప్రయోగించాయి. లిబియాలో అంతర్యుద్ధానికి “కాల్పుల విరమణ ఒప్పందాన్ని” ప్రతిపాదిస్తూ వచ్చిన “ఆఫ్రికన్ యూనియన్” ప్రతినిధులతో చర్చించడానికి వినియోగించిన భవనం సోమవారం నాటి బాంబుదాడుల్లో బాగా ధ్వంసం ఐనట్లు వార్తా సంస్ధలు తెలిపాయి. రీగన్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్న…

లిబియాలో స్పెయిన్ విలేఖరి అరెస్ట్, అరెస్టైనవారంతా క్షేమం

ఏప్రిల్ 5 తేదీన కనపడకుండా పోయిన స్పెయిన్‌కి చెందిన ఫోటో జర్నలిస్టు ఆదివారం స్పెయిన్‌లో తన తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తన క్షేమ సమాచారాన్ని తెలియజేశాడు. బ్రెగా పట్టణం శివార్లలో ఉన్న మను బ్రాబో ఇతర విలేఖరులతో పాటు అరెస్టు అయ్యాడు. సరైన అనుమతి లేకుండా లిబియాలోకి ప్రవేశించడంతో వారిని లిబియా ప్రభుత్వం అరెస్టు చేసింది. మను తండ్రి మాన్యువల్ వరెలా, తన కొడుకు బ్రాబోను మిలట్రీ జైలులో ఉంచారనీ, జైలులో తనను బాగా చూసుకుంటున్నట్లు చెప్పాడని…