హ్యూగో ఛావెజ్ ఎందుకు స్మరణీయుడు? -2
విదేశీ చమురు కంపెనీలు చెల్లించే రాయల్టీలను గణనీయంగా పెంచి దానిని ప్రజోపయోగాలకు తరలించడానికి ఛావెజ్ ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది. 2001 చట్టం ద్వారా చమురు అమ్మకాల ఆదాయంలో విదేశీ కంపెనీల వాటాను 84 నుండి 70 శాతానికి ప్రభుత్వం తగ్గించింది. భార చమురు వెలికి తీసే ఒరినికో చమురు బేసిన్ లో చమురు రాయల్టీలను 1 శాతం నుండి 16.6 శాతానికి పెంచింది. ఈ చెల్లింపులకు బడా చమురు కంపెనీలు ఎక్సాన్, కొనొకో ఫిలిప్స్ తిరస్కరించడంతో వాటిని…









