మోడీజీ, అది ఎ.కె-49 కాదు చీపురు! -కార్టూన్

బి.జె.పి ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్ర మోడి ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు ఆ పదవికి పోటీ పడుతున్న వ్యక్తికి ఉండాల్సిన స్ధాయికి తగిన విధంగా లేవని ఎప్పటినుండో వినిపిస్తున్న విమర్శ. ఆ విమర్శకు తగినట్లుగానే నరేంద్ర మోడి నిన్న (మార్చి 26) మరో చవకబారు విమర్శను ఎక్కుపెట్టారు. జమ్ము & కాశ్మీర్ లో ఓ ఎన్నికల సభలో ప్రసంగించిన మోడి దేశంలో మూడు ఏ.కె లు పాకిస్తాన్ కి సహాయం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.…

బి.జె.పి అధ్యక్షుడిని ముంచేస్తున్న జశ్వంత్ వలపోత -కార్టూన్

మధ్య ప్రదేశ్ బి.జె.పి నేత, ఎల్.కె.అద్వానీ శిష్యుడు, ఎన్.డి.ఏ ప్రభుత్వంలో విదేశీ మంత్రి అయిన జశ్వంత్ సింగ్ కి టికెట్ దక్కలేదు. తన సొంత నియోజకవర్గం అయిన బార్మర్ లో పోటీ చేస్తానని సంవత్సరన్నర క్రితమే అద్వానీకి జశ్వంత్ మొర పెట్టుకున్నారట. కానీ ఆయన మొర కాస్తా రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకున్నట్లే అయింది. గాంధీ నగర్ నుండి భోపాల్ కి బదిలీ అవుతానన్న అద్వానీ మొరని ఆలకించేవారే బి.జె.పి లో లేరు. ఇక ఆయన శిష్య…

టికెట్ వచ్చింది, ఎక్కడో తెలియదు -కార్టూన్

********* : నాకు టికెట్ వచ్చిందోచ్, ఈ నియోజకవర్గం ఎక్కడుందో కాస్త (గూగుల్ లో) వెతికి పెట్టు. : సిటింగ్ ఎం.పి కి టికెట్ ఇవ్వకూడదని మీరు నిర్ణయించుకున్నా టికెట్ నాకే ఇవ్వొచ్చు. (ఎందుకంటే) వాళ్ళకి అసలు నేనెప్పుడూ మొఖం చూపిందే లేదు. : ఆ, ఆ, ప్రాంతీయ పార్టీతో సీట్ల పంపిణీ చర్చలు భేషుగ్గా సాగుతున్నాయ్. వాళ్ళు నాకు ఓ భద్రమైన సీట్ కూడా ఆఫర్ ఇచ్చారు. నేను వాళ్ళ పార్టీలోకి చేరిపోతున్నాను! ********* ఎన్నికల…

మోడీయిజం: లైనంటే లైనే, లేదా తొక్కేస్తా!

‘రోజులు మారాయి’ సినిమాలో ఒక రిటైర్డ్ జవాన్ తరచుగా ఓ మాట అంటుంటాడు. “మాటంటే మాటే, సూటంటే సూటే. ఆ!” అని. అలాగే బి.జె.పి నాయకులు తరచుగా చెప్పే మాట ‘మాది భిన్నమైన పార్టీ’ (different party). విమర్శకులు కూడా అంతే తరచుగా బి.జె.పిని ‘విభేదాల పార్టీ’ (party with differences) అని అభివర్ణిస్తారు. బి.జె.పి జాతీయ దృశ్యం లోకి నరేంద్ర మోడి చొరబడ్డాక స్టాల్ వార్ట్స్ అనుకున్న నాయకులంతా అణిగి మణిగి ఉండాల్సిన పరిస్ధితి వచ్చిందని…

యు.పి స్టింగ్: ఎఎపి టికెట్ కి డబ్బు డిమాండ్

ఆమ్ ఆద్మీ పార్టీ తరపున లోక్ సభకు పోటీ చేయడానికి ముందుకు వచ్చిన అభ్యర్ధులనుండి ఆ పార్టీ నాయకులు డబ్బు డిమాండ్ చేసిన సంగతి వెలుగులోకి వచ్చింది. ఒక టి.వి ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఈ సంగతి వెల్లడి అయిన వెంటనే సదరు నాయకులను పార్టీ నుండి తొలగిస్తున్నట్లు ఎఎపి నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. న్యూ ఢిల్లీ, తిలక్ లేన్ లో ఉన్న తన నివాసం వద్ద విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసిన ఎ.కె…

మోడీయిజం -కార్టూన్

నేత: నాది చాలా భద్రమైన సీటు. అందుకే నాకు చాలా అభద్రతగా ఉంది. గెంటివేయబడ్డాక: మా నాయకుడి కోసం నా భద్రమైన సీటును త్యాగం చేయడానికైనా నేను సిద్ధం! వార్తలు: … ఆ విధంగా మొదటి ఫలితం వెలువడింది. XXX గారు తన పార్టీకే చెందిన సిటింగ్ ఎం.పి ని ఒడిస్తూ భద్రమైన సీటును గెలుచుకున్నారు… *** మోడి ఆలోచనా విధానం భారతీయ జనతా పార్టీని శాసిస్తున్నాయా? ఆ పార్టీ సీనియర్ నేతల సణుగుడులు చూస్తే అలానే…

పోటీకి అభ్యర్ధులు లేని కాంగ్రెస్! -కార్టూన్

: అదిగదిగో, ఒక సీనియర్ నాయకుడు… పోటీ చేయడానికి సిద్ధమై వస్తున్నారు! : నో, ధాంక్ యూ! *** రాయల సీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధులు దొరకడం లేదని ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం వాడుకలో ఉన్న జోక్! కానీ దేశవ్యాపితంగా కూడా కాంగ్రెస్ ది అదే పరిస్ధితని ఈ కార్టూన్ సూచిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ తరపున పోటీ చేసే సీనియర్ నాయకులు లేరని కార్టూన్ చెబుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని…

జనం భారీగా వస్తేనే అన్నా వస్తారు -కార్టూన్

అవును. జనం పెద్ద సంఖ్యలో వస్తేనే అన్నా హజారే సభలకు వస్తారట. లేకపోతే రారట. ఈ సంగతి ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక సభ ద్వారా తెలిసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అన్నా హజారేలు ఇరువురూ హాజరు కావలసిన సభకు అన్నా రాలేదు. కారణం ఏమిటా అని చూస్తే సభకు పెద్దగా జనం రాకపోవడం వల్లనే అన్నా రాలేదని ఆయన ప్రతినిధులు వివరించారని పత్రికలు తెలిపాయి. మార్చి 12 తేదీన ఢిల్లీలో ఒక ఎన్నికల…

శవ పేటికలే ఆంటోని క్రెడిట్? -కార్టూన్

రక్షణ మంత్రి అరక్కపరంబిల్ కురియన్ ఆంటోని 2014 ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. స్వయంగా చెప్పలేదు గానీ ఒక కేరళ కాంగ్రెస్ నాయకునితో చెప్పించారు. రాజ్యసభ సభ్యులయిన ఎ.కె.ఆంటోని గతంలో కూడా ఎప్పుడూ లోక్ సభకు పోటీ చేసిన రికార్డు లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించడం ద్వారా ఆంటోని కొద్ది సేపు వార్తల్లో వ్యక్తి అయ్యారు. కానీ అంతకు మునుపు ఆయన వేరే కారణాల వల్ల వార్తల్లో నిలిచారు. భారత నావికా బలగాలకు చెందిన…

విభజన గోతిలో కాంగ్రెస్, ఒడ్డున కె.సి.ఆర్ -కార్టూన్

విభజన కోసం అహోరాత్రాలు శ్రమించిన కాంగ్రెస్ ను గోతిలోనే వదిలేసి విభజన ఫలాలను తాను మాత్రమే అందుకోవడం కోసం కె.సి.ఆర్ ప్రయత్నిస్తున్నారని కార్టూన్ సూచిస్తోంది. ఒడ్డు చేరేదాకా పడవ మల్లయ్య, ఒడ్డు చేరాక బోడి మల్లయ్య అయినట్లు! తెలంగాణ ఇస్తే టి.ఆర్.ఎస్ పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తానని కె.సి.ఆర్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. విలీనానికి కార్యకర్తలు ఒప్పుకోవడం లేదని కె.సి.ఆర్ ఇప్పుడు చెబుతున్నారు. కనీసం పొత్తుకి కూడా ఆయన అంగీకరించేట్లు లేరని కొన్ని పత్రికలు చెబుతున్నాయి.…

ఫెడరల్ ఫ్రంట్, ఆల్టర్నేట్ ఫ్రంట్… ఏది ధర్డ్ ఫ్రంట్?

దేశంలో నాలుగో కూటమి రూపు దిద్దుకుంటున్నట్లు కనిపిస్తోంది. నిన్నటి దాకా వామపక్ష పార్టీలతో సీట్ల సర్దుబాటుకోసం చర్చలు జరిపిన జయలలిత లెఫ్ట్ తో చర్చలు ముగిస్తున్నట్లు హఠాత్తుగా ప్రకటించారు. దానితో వామపక్షాలు, ఇతర కిచిడి పార్టీలు ఏర్పాటు చేసిన ‘ఆల్టర్నేట్ ఫ్రంట్’ లో జయలలిత చేరిక ఆగిపోయింది. ఎ.ఐ.డి.ఏం.కె అధినేత్రి వామపక్షాలతో ఎన్నికల బంధం తెంచుకోవడం ఒక ఎత్తయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ఫోన్ చేయడం మరో ఎత్తు. ఈ ఫోన్ కాల్ తో…

మోడి నన్నెందుకు కలవరు, నేను టెర్రరిస్టునా? -ఎ.కె

అరవింద్ కేజ్రీవాల్ నుండి దూరంగా పారిపోతున్న నరేంద్ర మోడి మరోసారి తన పరికితనం చాటుకున్నారు. రిలయన్స్ గ్యాస్ ధరల పెంపు విషయమై గుచ్చి గుచ్చి అడిగినా బదులు ఇవ్వని మోడి చివరికి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా గుజరాత్ వచ్చి ఇంటర్వ్యూ కోరినా మొఖం చాటేశారు. తనను కలవడానికి వస్తున్న అరవింద్ బృందాన్ని తన నివాసానికి 5 కి.మీ దూరంలోనే అడ్డుకుని వెనక్కి పంపేశారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని కలవకపోతే పోయే, కలవలేకపోతున్నానని కనీసం ఫోన్ కాల్…

లాలూ కాంగ్రెస్ సీట్ల తూకం -కార్టూన్

బీహార్ లో కొనసాగుతున్న రాజకీయాలు భారత దేశంలోని మురికి రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం. బి.జె.పి మతతత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పే రామ్ విలాస్ పాశ్వాన్ మరోసారి ఆ పార్టీతోనే సీట్ల సర్దుబాటుకు సిద్ధపడగా ఘన చరిత్ర కలిగిన జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ కాసిన్ని సీట్ల కోసం అవినీతికి శిక్ష పడిన లాలూతో బేరాలు సాగిస్తోంది. లాలూ-కాంగ్రెస్ కూటమితో జత కలుస్తాడని భావించిన పాశ్వాన్ తగినన్ని సీట్లు దక్కకపోవడంతో ‘మతతత్వ’ కార్డు పక్కకు విసిరేసి ఎక్కువ సీట్లు…

గుజరాత్ మారణకాండ: క్షమాపణలు చెప్పినట్లా, చెప్పనట్లా?

2002 నాటి గోధ్రా అనంతర మత కారణకాండకు క్షమాపణలు చెప్పాలా లేదా అన్న సంగతి బి.జె.పి నాయకులు తేల్చుకోలేకపోతున్నట్లు కనిపిస్తోంది. గతంలో తప్పులు ఏమన్నా జరిగి ఉంటే శిరసు వంచి క్షమాపణలు కోరడానికి సిద్ధంగా ఉన్నాం అని బి.జె.పి అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఈ రోజేమో తమ అధ్యక్షుడు క్షమాపణ చెప్పలేదంటూ ఆ పార్టీ ముస్లిం నేత ముక్తార్ అబ్బాస్ నక్వి వివరణతో ముందుకు వచ్చారు. ఇంతకీ బి.జె.పి క్షమాపణ…

పార్లమెంటు వెల్ నుంచే ప్రచారం మొదలు -కార్టూన్

సగటు పురుషుడు: పార్లమెంటులో దీన్ని ‘వెల్ ఆఫ్ ద హౌస్’ అంటారు… సగటు స్త్రీ: ఎన్నికల్లోనేమో మహా అగాధం అని పిలుస్తారు… మరో అద్భుతమైన కార్టూన్! పార్లమెంటు ఉభయ సభల్లోనూ సాధారణంగా జరిగే గొడవలకు, ముఖ్యంగా ఇటీవల తెలంగాణ బిల్లు ఆమోదం సందర్భంగా వివిధ పార్టీల నేతలు వేసిన వేషాలకు కారణం ఏమిటో స్పష్టంగా తెలియజెపుతున్న కార్టూన్ ఇది. 2014 సాధారణ ఎన్నికల ప్రచారం చివరి లోక్ సభ, రాజ్య సభల సమావేశాల నుండే మొదలయిందని కార్టూన్…