సునంద పుష్కర్ పోస్ట్ మార్టంలో యు.పి.ఏ ఒత్తిడి?

కేంద్ర మాజీ మంత్రి శశి ధరూర్ భార్య హఠాన్మరణం విషయంలో తాజాగా వివాదం రగులుతోంది. ఆమె మరణానికి కారణాలు తెలియజేసే పోస్ట్ మార్టం నివేదిక తయారీలో తనపై తీవ్రమైన ఒత్తిడి వచ్చిందని పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్ ఆరోపించడంతో సంచలనం రేగుతోంది. డాక్టర్ ఆరోపణలను ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ అధికారులు హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించడంతో మరిన్ని అనుమానాలు కలగడానికి ఆస్కారం ఏర్పడింది. తన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్…

ఫుట్ బాల్ వీరుడు మోడి -కార్టూన్

నడుస్తున్నది ప్రపంచ ఫుట్ బాల్ సీజన్. కాబట్టి బంతిని రెండు స్తంభాల నడుమకు నెట్టేస్తే సరిపోతుంది. కానీ రానున్నది అసలు పందెం. ఈ పందెంలో స్తంబాల మధ్య నెట్టడానికి బంతీ ఉండదు. ఆట ఆడితే మోగే చప్పట్లూ ఉండవు. ఎందుకంటే ఆ అసలు పందెంలో అన్నీ దాటి తీరవలసిన ఆటంకాలే. 30 రోజుల ప్రభుత్వం పైన తీర్పు ఇవ్వడానికి ఏమీ ఉండదని కార్టూనిస్టు ఇలా చెప్పారు. అధికారంలోకి వచ్చిన ప్రారంభ రోజులను అధికార పార్టీకి హానీ మూన్…

స్విస్ నల్ల ధనం అను ఒక ప్రహసనం -కార్టూన్

“ఆగండాగండి, ఇదిగో లేఖ జారవిడుస్తున్నా, ఇక తెరుచుకోవడమే తరువాయి.” *** అధికారంలోకి వచ్చీ రావడంతోనే విదేశాల్లో భారతీయులు దాచిన నల్ల డబ్బును వెనక్కి తేవడానికి అని చెబుతూ మోడి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. జస్టిస్ ఎం.బి.షా నేతృత్వంలో ఏర్పాటయిన ఈ కమిటీ వాస్తవానికి సుప్రీం కోర్టు ఆదేశాలకు ఏర్పాటు చేశారన్న వాస్తవాన్ని చెప్పిన పత్రికలు చాలా తక్కువ. ఈ కమిటీ పని ఎంతవరకు వచ్చిందో తెలియదు గానీ కొద్ది రోజుల తేడాలోనే పరస్పర…

అమిత్ షా: ఓడ అవుతున్న బండి!

‘ఓడలు బండ్లగును, బండ్లు ఓడలగును’ అని సామెత! బి.జె.పి జనరల్ సెక్రటరీ అమిత్ షా ఈ సామెతలో రెండో భాగాన్ని రుజువు చేసే క్రమంలో దూసుకుపోతూ ఉన్నారు. షోరాబుద్దీన్ షేక్, తులసీరాం ప్రజాపతి బూటకపు ఎన్ కౌంటర్ కేసుల్లో జైలు పాలై ఒక దశలో ‘ఇక పోలిటికల్ కెరీర్ ముగిసినట్లే’ అని పలువురు చేత భావించబడిన అమిత్ షా మరికొద్ది రోజుల్లో బి.జె.పి అధ్యక్ష పదవిని అధిష్టించనున్నట్లు వార్తలు వస్తున్నాయంటే… నేటి వ్యవస్ధ ఏ శక్తులను నెత్తిన…

రైలు ఛార్జీలు కాదు విమాన ఛార్జీలు -కార్టూన్

“… చెన్నై, బెంగుళూరు, భోపాల్, లక్నో, పాట్నా మరియు చండీఘర్ ల మీదుగా ఢిల్లీ పోవు తదుపరి విమానం 11వ నంబర్ ప్లాట్ ఫారం నుండి బయలుదేరును…” *** రైల్వే ఛార్జీల పెంపుదలను కార్టూనిస్టు ఇలా వ్యంగ్యీకరించారు. గత ప్రభుత్వ హయాంలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే రైల్వే సరుకు రవాణా చార్జీలను పెంచడాన్ని తప్పు పట్టిన అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, తాను ప్రధాని అయ్యాక అదే తరహాలో ఛార్జీలు పెంచడానికి ఏ మాత్రం వెనకాడలేదు.…

ప్రశ్న: ప్రతిపక్ష హోదా కోసం పాకులాట ఎందుకు?

నిఖిల్: 1. లోక్ సభలో అధికార ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏమిటి? ఆ హోదా కోసం కాంగ్రెస్ ఎందుకు పిచ్చిగా ప్రాకులాడుతోంది? సమాధానం: “లోక్ సభలో అధికార ప్రతిపక్ష హోదా” అంటే మీ ఉద్దేశ్యం “అధికారికంగా గుర్తించబడిన ప్రతిపక్ష హోదా” అయి ఉండాలి. బి.జె.పి పాలక పక్షం గనుక కాంగ్రెస్ ఎలాగూ ప్రతిపక్షమే. కానీ లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఎందుకా పాకులాట అన్నది మీ అనుమానం. లోక్ సభలో…

మోడి సుపరిపాలనా సూత్రాలు -కార్టూన్

“యెస్, సర్…” “గవర్నర్లు…” “ఎన్.జి.ఓ లు…” “… ఇంకా, హిందీలో రాయాలి!” “మరిన్ని స్టిక్-ఆన్ నోట్ లా, సర్?” “గరిష్ట (సు)పరిపాలన కోసం కాసిన్ని చిన్న చిన్న సవరణలు… అంతే…” *** ప్రధాని నరేంద్ర మోడి ఎన్నికల నినాదాల్లో ‘సుపరిపాలన’ (Good Governance) ఒకటి. యు.పి.ఏ ప్రభుత్వం మా చెడ్డదనీ తాను ప్రధాని అయ్యాక దేశ ప్రజలకు ‘సుపరిపాలన’ అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తానని ఆయన ప్రచారం చేశారు. గుజరాత్ ప్రజలకు రుచి చూపించిన సుపరిపాలన…

రైల్వే ఛార్జీలు: మంచి రోజులా, ముంచే రోజులా?

‘మంచి రోజులు ముందున్నాయి’ అని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన ప్రధాని మోడి, అధికారంలోకి వచ్చాక, ‘ముందుంది ముసళ్ళ పండగ’ అని చాటుతున్నారు. సరుకు రవాణా ఛార్జీలతో పాటు ప్రయాణీకుల ఛార్జీలు కూడా వడ్డించిన మోడి ప్రభుత్వం ‘కఠిన నిర్ణయాలకు’ అర్ధం ఏమిటో చెప్పేశారు. రెండేళ్ల క్రితం రైలు సరుకు రవాణా ఛార్జీలు పెంచినపుడు అప్పటి ప్రధానికి లేఖ రాసి నిరసించిన మోడి ఇప్పుడు ఎవరి లేఖకు లొంగుతారు? ప్రయాణీకులపై 14.2 శాతం ఛార్జీల మోత మోగించిన మోడి…

కాంగ్రెస్ గవర్నర్ల గెంటివేత -కార్టూన్

“రాజీనామా? అబ్బే కాదు. గెంటేశారు!!” *** కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పాత ప్రభుత్వం తాలూకు వాసనలను వదిలించుకోవాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల గవర్నర్ లను మార్చడానికి మోడి ప్రభుత్వం పావులు కదుపుతోంది. అయితే కొందరు గవర్నర్ లు అందుకు సహకరించడానికి సిద్ధంగా లేరు. దానితో బి.జె.పి మండిపడుతోంది. ముఖ్యంగా కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహా రాష్ట్ర రాష్ట్రాల గవర్నర్లు తమకు రాజీనామా చేసే ఉద్దేశ్యం ఏమీ లేదని స్పష్టం చేయడంతో…

ఎన్.జి.ఓలు vis-a-vis మోడి -కార్టూన్

“… ఆ, అవే, మనకి అనుకూలంగా తిరగడం లేదు చూశావా, అక్కడికి పద…” *** ఎన్.జి.ఓ లు మరొకసారి చర్చనీయాంశం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ గూఢచార సంస్ధ ‘ఇంటలిజెన్స్ బ్యూరో’ (ఐ.బి), అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమ సంస్ధగా చెప్పుకునే గ్రీన్ పీస్ కీ, ఇంకా ఇతర సంస్ధలకు వ్యతిరేకంగా ప్రధాన మంత్రికి నివేదిక ఇవ్వడంతో తాజాగా ఎన్.జి.ఓలపై చర్చ నడుస్తోంది. గ్రీన్ పీస్ తదితర ఎన్.జి.ఓల కార్యకలాపాలు భారత దేశ అభివృద్ధికి ఆటంకంగా మారాయన్నది సదరు నివేదిక…

‘ప్రజాస్వామ్యం’ ఎండమావికై చైనా యువత రోడ్డెక్కిన ఆ రోజులు -ఫోటోలు

సరిగ్గా పాతికేళ్ళ క్రితం ఈ రోజుల్లోనే చైనా యువత ‘పశ్చిమ దేశాల ప్రజాస్వామ్యం’ అనే ఎండమావి కోసం వీధులకెక్కి నినదించారు. 1911 ప్రాంతంలో ఆనాటి జాతీయ ప్రజాస్వామ్య ఉద్యమ రధసారధి డాక్టర్ సన్ యెట్ సేన్ జ్ఞాపకాలను అపహాస్యం చేస్తూ చైనీయ యువత మిడి మిడి జ్ఞానంతో పశ్చిమ దేశాల్లో నిజమైన ప్రజాస్వామ్యం ఉందని నమ్మారు. అలాంటి ప్రజాస్వామ్యమే చైనాలో ప్రవేశపెట్టాలని కోరుతూ వేలాది మంది యువత, విద్యార్ధులు బీజింగ్ చేరుకుని చరిత్రాత్మక తీయానాన్మెన్ స్క్వేర్ లో…

కఠిన నిర్ణయాలు తప్పవు -మోడి

అనేశారు! ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడి ఆ కాస్త మాటా అనేశారు. ఆర్ధిక వ్యవస్ధను గాడిన పెట్టాలంటే కఠిన చర్యలు తప్పవని ప్రధాని మోడి స్పష్టం చేశారు. మోడీని, బి.జె.పినీ అదే పనిగా పొగుడుకుంటే ఏమీ ఒరగదనీ అసలు పనిలోకి దిగితే కొన్ని సెక్షన్ల ప్రజలకు కష్టం తప్పదని ఆయన ఉన్న మాట చెప్పేశారు. అధికార పీఠాన్ని అధిష్టించి నెల కూడా కాలేదు, అప్పుడే కఠిన చర్యలు అంటున్నారు మోడి. “ఆర్ధిక క్రమశిక్షణ తెచ్చుకోవాలంటే రాబోయే ఒకటి…

మోడీ పైనే బాబు ఎన్నికల హామీల భారం! -కార్టూన్

ఎన్నికల గెలుపు తాలూకు మత్తు నాయకులను ఇప్పుడిప్పుడే వదులుతున్నట్లుంది! కేంద్రంలో బి.జె.పి/మోడి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం సాధించిన విజయాలు మోడి, చంద్రబాబు నాయుడుల చలవే అని పత్రికలు ఘోషిస్తున్నాయి. మోడీయే లేకపోతే బి.జె.పికి ఈ గెలుపు దక్కి ఉండేది కాదని మామూలుగా మోడిని విమర్శించే పత్రికలు కూడా ఇప్పుడు అంగీకరిస్తున్నాయి. మోడి గాలి తుఫానులా తాకి కాంగ్రెస్ ని ఊడలతో సహా పెరిగివేసిందని, చంద్రబాబు పడిన పాదయాత్ర కష్టం టి.డి.పి ని తిరిగి అధికారంలోకి…

అరవింద్: అసంతృప్త నేతల పంచింగ్ బ్యాగ్

“మిత్రులారా, ఈ ప్రభుత్వం తప్పులు చేసేవరకూనో లేదా కొత్త పంచింగ్ బ్యాగ్ దొరికేవరకూనో -ఈ రెండిట్లో ఏది ముందోస్తే అంతవరకూ కాస్త ఓపిక పట్టండి…” *** *** *** ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి వివిధ ప్రాంతాల్లోని ఎఎపి నాయకులు వరుస కట్టి రాజీనామాలు చేస్తున్నారు. కొంతమంది ఏకంగా పార్టీ సభ్యత్వానికే రాజీనామా చేసేస్తే మరికొందరు పార్టీ సభ్యత్వాన్ని అట్టే పెట్టుకుని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తున్నారు. బహుశా వీళ్ళంతా పార్లమెంటు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ…

మోడి: భారతీయ మోషే! -కార్టూన్

భారత ప్రధాని నరేంద్ర మోడిని భారతీయ మోషే (మోజెస్) గా కార్టూనిస్టు చిత్రీకరించారు. ఎన్నికలకు ముందు మోడీకి ప్రచార సారధ్యం అప్పగించడం ద్వారా ప్రధాని పదవికి ఆయనే అభ్యర్ధి అని బి.జె.పి ప్రకటించినప్పుడు అలిగి తూలనాడిన పార్టీ సీనియర్లను మోడి తెచ్చిన టెన్ కమాండ్ మెంట్స్ ఫలకాలను మోసుకు తిరగడానికి ఎదురు చూస్తున్నవారిగా కేశవ్ చిత్రీకరించారు. మోడి కష్టాన్ని అనుభవించడానికి బి.జె.పి సీనియర్లు ఎదురు చూస్తున్నారని చురక అంటించారు. *** క్రైస్తవ పురాణంలో మోజెస్ కధ తెలుసా?…