ఒకరిది హైరానా, మరొకరిది ఘరానా -కార్టూన్

ఆటగాళ్ళు ఇద్దరూ క్రీజు వదిలి మధ్యలో నిలబడి మాట్లాడుకుంటున్నారు. కాదు, పోట్లాడుకుంటున్నారు. బంతిని తొందర తొందరగా వికెట్ల దగ్గరికి విసిరేస్తే వికెట్లను పడగొట్టి ఆటగాళ్లను ఔట్ చేయొచ్చని ఫీల్డర్లు, బౌలర్, వికెట్ కీపర్ ల హైరానా! ఒక ఆటగాడే మొత్తం టైమ్ అంతా తినేస్తున్నాడు. మరో ఆట గాడికి బ్యాట్ ఝుళిపించే సమయం దొరికి చావడం లేదు. స్ట్రైకింగ్ ఛాన్స్ వస్తే తన సత్తా చూపించవచ్చని మరో ఆటగాడి ఆత్రం. కానీ తాను నిలదొక్కుకున్నా గనక తన…

అమిత్ షా: అచ్చిరాని యు.పి పరీక్ష -కార్టూన్

బి.జె.పి భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారకులుగా భావిస్తున్నవారిలో అమిత్ షా అగ్రగణ్యులు. బీహార్, ఉత్తర ప్రదేశ్ లలో భారీ సంఖ్యలో సీట్లు రావడానికి కారణం ఆయనే అని ఇప్పుడు దాదాపు అందరూ చెప్పే మాట. అందుకే ఆయనను బి.జె.పి అధ్యక్ష పదవి వరించింది కూడా. అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం తన హవా ఏ పాటిదో పరీక్షించుకునే అవకాశం ఉత్తర ప్రదేశ్ ఉప ఎన్నికల రూపంలో అమిత్ షాకు వచ్చిందని కార్టూన్ సూచిస్తోంది. అమిత్…

(బి.జె.పికి) సంకేతాత్మక హెచ్చరిక -ది హిందు ఎడిటోరియల్

(A Note of Caution శీర్షికన ఈ రోజు (సెప్టెంబర్ 17) ది హిందూ ప్రచురించిన సంపాదకీయానికి ఇది యధా తధ అనువాదం -విశేఖర్) ఉల్లాసం వెనువెంటే నిరాశ రావడం చాలా అరుదుగా జరుగుతుంది: భారత దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో తన చరిత్రలోనే అత్యంత మెరుగైన ఎన్నికల ఫలితాలను రికార్డు చేసిన భారతీయ జనతా పార్టీ నాలుగు నెలల్లోనే ఆ రాష్ట్రంలో తన సాంప్రదాయక పునాది కలిగిన చోట కూడా పెనుగులాడుతున్నట్లు…

శారదా చిట్ ఫండ్ ఊబిలో మమతా బెనర్జీ! -కార్టూన్

శారదా చిట్ ఫండ్ కుంభకోణం క్రమంగా మమతా బెనర్జీని కూడా చుట్టు ముడుతోంది. సి.బి.ఐ విచారణ ఫలితంగా పలువురు త్రిణమూల్ కాంగ్రెస్ నేతలు, మంత్రులు కుంభకోణంలో పాత్రధారులుగా, లబ్దిదారులుగా తేలుతున్నారు. చివరికి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచార ఖర్చులను కూడా శారద చిట్ ఫండ్ భరించిందని అరెస్టయిన నేత ఒకరు ఆరోపించడంతో మమతా బెనర్జీని ఊబిలోకి లాగేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం అవుతోంది. త్రిణమూల్ నేత, మాజీ ఐ.పి.ఎస్ అధికారి రజత్ మజుందార్, ఆ పార్టీ…

మహా రాష్ట్ర: బి.జె.పి, శివసేనల పీతల తట్ట

పీతల్ని ఒక పాత్రలో వేసి పెడితే అవి తప్పించుకోకుండా ఉండడానికి ప్రత్యేకంగా మూత పెట్టనవసరం లేదట. ఒకటి ఎలాగో సందు చూసుకుని అంచు దాటి పోయేలోపు మరో పీత ఆ పైకి వెళ్ళిన పీత ఆధారంగా తానూ పైకి వెళ్ళే ప్రయత్నంలో మొదటి పీతను కిందకు లాగేస్తుంది. మొత్తం మీద ఏ పీతా తప్పించుకోకుండా తమకు తామే కిందకు లాగేస్తూ యజమానికి సహాయం చేస్తాయి. మహారాష్ట్రలో బి.జె.పి, శివ సేన పార్టీల తగవులాట కూడా పీతలాటను తలపిస్తోంది.…

ఉప ఎన్నికలు: సడలుతున్న బి.జె.పి కుదుళ్లు

పార్లమెంటు, అసెంబ్లీ స్ధానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. లోక్ సభ ఎన్నికల్లో బి.జె.పి ప్రదర్శనకు ఉప ఎన్నికల ఫలితాలు దాదాపు విరుద్ధంగా వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంటు ఎన్నికలకు మధ్య ప్రజలు తేడా చూడడం ప్రారంభించారా అన్న అనుమానం కూడా ఉప ఎన్నికల ఫలితాలు కలిగిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే భారత ప్రజలు సాపేక్షికంగా రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నట్లే లెక్క. ఎలా చెప్పుకున్నా బి.జె.పి, అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే లోక్ సభ ఎన్నికల్లో…

విజయ్ మాల్యా ఎగవేసింది నీటి బొట్టంత! -మాజీ కాగ్

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, యునైటెడ్ బ్రూవరీస్… తదితర కంపెనీల అధినేత విజయ్ మాల్యా ఇప్పుడు భారత దేశంలోని అప్పు ఎగవేతదారులకు సింబల్! యునైటేడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యు.బి.ఐ), ఆయనను ఉద్దేశ్యపూర్వక పన్ను ఎగవేతదారు (Wilful defaulter) గా ప్రకటించినప్పటి నుండి ఆయనకు ఆ కీర్తి దక్కింది. బహుశా స్వతంత్ర భారత చరిత్రలో ఈ బిరుదు దక్కించుకున్న ఏకైక/మొట్టమొదటి పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాయే కావచ్చు. అయితే ఇంతటి కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకున్న విజయ్ మాల్యా,…

(మత) ఆకర్షక రాజకీయాలు -ది హిందు ఎడిటోరియల్

ముంచుకొచ్చే ఎన్నికలు, ప్రభుత్వాల చర్యలకు అనివార్యంగా రంగు పులుముతాయి. ఉత్తర ప్రదేశ్ లో 11 అసెంబ్లీ స్ధానాలకు, ఒక పార్లమెంటరీ స్ధానానికి ఉప ఎన్నికలు జరగడానికి సరిగ్గా రెండు రోజుల ముందు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పై విద్వేష ప్రసంగం చేసినందుకు అభియోగ పత్రం నమోదు చేయడానికి తీసుకున్న నిర్ణయం రాజకీయ లక్ష్యంతోనే జరిగిందా అన్నది చర్చనీయమైన ప్రశ్న. అమిత్ షా పై దాఖలు చేసిన ఛార్జీ షీటును కోర్టు పోలీసులకు వెనక్కి…

భారత్-పాక్ దౌత్యం: అచేతనం లేదా అర్ధ చేతనం! -కార్టూన్

“అబ్బే, కోమా (అచేతనం), సెమీ కాన్షియస్ (అర్ధ చేతనం) కాదండీ బాబూ, ఆమె చెప్పేది దౌత్యంలో కామాలు, సెమీ కోలన్లు మాత్రమే ఉంటాయని” ********* గుడ్ జోక్! మూడు రోజుల క్రితం భారత విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్ మొదటిసారి పూర్తి స్ధాయి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా పాక్ తో చర్చల రద్దు సంగతి ప్రసక్తి వచ్చింది. పాకిస్ధాన్ తో దౌత్యం కొనసాగుతుందా లేదా అన్న ప్రశ్నకు ఆమె “దౌత్యంలో ఫుల్…

ఢిల్లీ అసెంబ్లీ: కాంగ్రెస్ కి షీలా షాక్!

కాంగ్రెస్ పార్టీ తరపున ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన షీలా దీక్షిత్ ఈ రోజు (సెప్టెంబర్ 11, 2014) రాజకీయ పరిశీలకులను, పత్రికలను, ఢిల్లీ ప్రజలను నిశ్చేష్టులను కావించారు. ఢిల్లీలో బి.జె.పి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అది ఢిల్లీ ప్రజలకు మంచిదే అని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె ప్రకటనతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ ప్రకటించగా, కాంగ్రెస్-బి.జె.పి లకు అసలు తేడాయే లేదని చెప్పాం గదా! అని ఎఎపి వ్యాఖ్యానించింది. “ప్రజాస్వామ్యంలో,…

సి.బి.ఐ పరిశోధనపై పరిశోధన -కార్టూన్

దేశంలో అత్యున్నత స్ధాయి పరిశోధన సంస్ధ సి.బి.ఐ. ప్రభుత్వంలోనూ, బ్యూరోక్రసీలోనూ ఉన్నత స్ధానాలను ఆక్రమించి ఉన్న స్వార్ధపర ఆశపోతులను, దొంగలను పట్టుకుని విచారించి శిక్షపడేలా చూడవలసిన సి.బి.ఐ అధికారులు సదరు ఉన్నత స్ధాయి నేరస్ధులతోనే కుమ్మక్కు అవుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో అవినీతిని ప్రముఖంగా చర్చలోకి తెచ్చిన కుంభకోణం 2జి కుంభకోణం. ఈ కుంభకోణంలో నిందితులైన సీనియర్ బ్యూరోక్రాట్ అధికారులు క్రమం తప్పకుండా సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సింగ్ ఇంటికి వెళ్తున్నారని ఎఎపి నేత, సుప్రీం…

అరవింద్: తానొకటి తలచిన కోర్టు మరొకటి తలచెను

ఆమ్ ఆద్మీ పార్టీ/అరవింద్ కేజ్రీవాల్ పరిస్ధితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. ఢిల్లీలో మళ్ళీ ఎన్నికలు జరిపించాలన్న లక్ష్యంతో తాము వేసిన పిటిషన్ చివరికి బి.జె.పి ప్రభుత్వం ఏర్పాటుకు దారితీయబోతోంది. అరవింద్ వెల్లడి చేసిన వీడియో దృష్ట్యా ఢిల్లీలో ఎంత త్వరగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అంత మంచిదని సుప్రీం కోర్టు ఈ రోజు వ్యాఖ్యానించింది. దానితో పిటిషన్ వేసిన లక్ష్యం నెరవేరకుండా పోతోంది. తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎన్.డి.ఏ ప్రభుత్వం ఆమోదించిన జస్టిస్ హెచ్.ఎల్.దత్తు…

అరవింద్: తోడేళ్ళకు భయపడే మేకల కాపరి -కార్టూన్

ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటుపై మళ్ళీ కదలిక మొదలు కావడంతో ఎఎపి నేత అరవింద్ కేజ్రీవాల్ కు పెద్ద చిక్కొచ్చిపడింది. తమ ఎమ్మెల్యేలను కాపలా కాసే కాపరిగా ఆయనకు కొత్త బాధ్యతలు వచ్చిపడ్డాయి. శాసనసభలో అతి పెద్ద పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతికి సఫారసు చేస్తూ అందుకు అనుమతి ఇవ్వాలని కోరడంతో ఎఎపి నేతకు ఈ అదనపు బాధ్యతలు వచ్చిపడ్డాయి. ఈ కార్టూన్ కి రెండు అర్ధాలు చెప్పుకోవచ్చు. ఒకటి:…

స్నోడెన్ వస్తే అమెరికాకి అప్పగించం -స్విస్ మీడియా

అమెరికా గూఢచర్యంపై సాక్ష్యం ఇవ్వడానికి స్నోడెన్ తమ దేశం వస్తే ఆయనను అమెరికాకు అప్పగించకపోవచ్చని  స్విట్జర్లాండ్ మీడియా కధనాలు ప్రచురిస్తోంది. ఈ మేరకు స్విట్జర్లాండ్ అటార్నీ జనరల్ స్విస్ ప్రభుత్వానికి ఒక పత్రం సమర్పించారని సోన్టాగ్స్ జీటంగ్ (స్విస్) పత్రికను ఉటంకిస్తూ రష్యా టుడే (ఆర్.టి) పత్రిక తెలిపింది. అయితే ప్రభుత్వంలో ఉన్నత స్ధాయిలో దానికి విరుద్ధంగా హామీ ఇస్తే చెప్పలేమని అటార్నీ జనరల్ చెప్పినట్లు తెలుస్తోంది. అనగా స్విస్ మీడియా అంచనాకు భిన్నంగా స్నోడెన్ రక్షణకు…

స్టెర్లింగ్ చావుకొచ్చిన స్కాట్లండ్ సంబరం

‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అని సామెత. యునైటెడ్ కింగ్ డమ్ (గ్రేట్ బ్రిటన్) కరెన్సీ పరిస్ధితి ఇప్పుడు అలానే ఉంది. స్కాట్లండ్ స్వతంత్రం పట్ల స్కాటిష్ ప్రజల్లో ఆదరణ పెరిగేకొద్దీ బ్రిటిష్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ విలువ దిగజారుతోంది. ఆదివారం జరిగిన అభిప్రాయ సేకరణలో స్కాట్లండ్ ప్రత్యేక దేశంగా విడిపోవడానికి ‘యెస్’ అంటున్న ఓటర్ల సంఖ్య మొదటిసారిగా మెజారిటీ సాధించినట్లు తేలింది. ఓటింగులో పాల్గొన్నవారిలో అటో, ఇటో చెప్పినవారిలో 51 శాతం మంది ‘యెస్’ అని…