బ్రెగ్జిట్ పై బ్యాంక్సీ టేక్ -వీధి చిత్రాలు

లండన్ కు చెందిన వీధి చిత్రాల కళాకారుడు బ్రెగ్జిట్ పై తన కళాలోచనను తాజా వీధి చిత్రం ద్వారా పంచుకున్నాడు. తన వీధి చిత్రాల ద్వారా ప్రపంచ వ్యాపితంగా అత్యంత పేరు ప్రతిష్టలు సంపాదించినప్పటికీ తానెవరో ప్రపంచానికి తెలియనివ్వని బ్యాంక్సీ ఎక్కడ గోడపై ఒక గీత గీసిన సంచలనమే. పశ్చిమ సామాజిక, సాంస్కృతిక విలువలపై విమర్శలతో ప్రారంభించి రాజకీయ విమర్శల వరకూ ప్రయాణించిన బ్యాంక్సీ వీధి చిత్రాలు సామాన్య ప్రజలకు కన్నుల పండుగ, అనామ్దాదాయకం కాగా ధనిక…

రష్యా ఆంక్షలు: ఇష్టం లేకుండానే ట్రంప్ సంతకం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు చెప్పినట్లుగానే రష్యా వ్యతిరేక ఆంక్షల బిల్లుపై సంతకం చేశాడు. బిల్లు ఆమోదం తనకు ఇష్టం లేదని చెప్పి మరీ సంతకం చేశాడు. సంతకం చేసిన వెంటనే బిల్లుని ప్రవేశపెట్టినందుకు హౌస్, సెనేట్ లపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. రష్యా-ఉత్తర కొరియా-ఇరాన్ వ్యతిరేక ఆంక్షల బిల్లు అమెరికా పాలనా వ్యవస్ధ మరియు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ల మధ్య ఉన్న విభేదాలని మరోసారి బహిర్గతం చేసింది. ప్రభుత్వాధికారంపై పట్టు కోసం అమెరికా…