దీన్ని పంచుకోండి:
- Click to share on Facebook (కొత్త విండోలో తెరుచుకుంటుంది) ఫేస్బుక్
- Click to share on X (కొత్త విండోలో తెరుచుకుంటుంది) X
- Click to print (కొత్త విండోలో తెరుచుకుంటుంది) Print
- వాట్సాప్ లో పంచుకోవడానికి నొక్కండి (కొత్త విండోలో తెరుచుకుంటుంది) వాట్సాప్
- Click to email a link to a friend (కొత్త విండోలో తెరుచుకుంటుంది) ఈమెయిలు

ఊయలలూగినదోయ్ బిల్లు, బి.జెపి., యు.పి.ఏ.ల నడుమ ఊగిసలాడినదోయ్!
విభజనకేమో భజన చేస్తిమి, సమైక్యతకేమో న్యాయం జరగాలని మాట ఇస్తిమి
కుడితిలొ పడ్డ ఎలుకలు మనము, ఏమిచేసినా తప్పవు తెలుగువారి అలకలు
సుబ్బి పెళ్ళి వెంకి చావుకొచ్చినట్లు,”నమో”బి.జే.పి.కి తప్పని మూగ పలుకులు!
భస్మాసుర హస్తం నెత్తినపెట్టుకుని ఎన్నికల బూడిదలో పోసిన పన్నీటి చుక్కలు
ముక్కలు చెక్కలవుతున్న తెలుగు రాష్ట్రం రాజకీయ తెగులుకు కన్నీటి చుక్కలు
ముందు నుయ్యి, వెనుక గొయ్యిలాంటి రాజకీయ భవితవ్యం మీద ఓటరు లుక్కులు!