రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా వ్యాపారస్ధుల బంద్
గురువారం భారత దేశ వ్యాపితంగా వ్యాపారస్ధులు బంద్ పాటించారు. రిటైల్ అమ్మకాల రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ బంద్ కు వ్యాపార వర్గాలు పిలుపునిచ్చాయి. న్యూఢిల్లీతో పాటు దేశ వ్యాపితంగా బంద్ జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ ఈ బంద్ లో పాల్గొంది. అనేక చోట్ల ప్రదర్శనలు నిర్వహించింది. బి.జె.పి శ్రేణులు ప్రధాన మంత్రి దిష్టి బొమ్మను దగ్ధం చేసాయి. రాజధాని ఢిల్లీలో కనీసం ఇరవై…