సంఘటిత లూటీ, చట్టబద్ధ దోపిడీ -మౌనిబాబా గర్జన!

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గొంతు చాన్నాళ్ళకు వినబడింది. ‘మౌని బాబా’ గా ఇప్పటి ప్రధాన మంత్రి చేత పదే పదే ఎద్దేవా చేయబడిన మన్మోహన్ సింగ్ నోరు తెరవడమే కాదు, గాండ్రించారు కూడా. వయసు మీద పడిన మన్మోహన్ నిజానికి మోడి లాగా పెద్ద పెద్ద చప్పుళ్ళు చేయలేరు. ఆయన ఎంత చిన్నగా, మెల్లగా మాట్లాడినా ఆ మాటల్లో పదును ఉంటే దానిని గాండ్రింపుగా లెక్కించవచ్చు. తాటాకు చప్పుళ్ళ కంటే లక్ష్యానికి గురి చూసే…

మోడి స్నేహ హస్తం! -ది హిందు ఎడిట్..

[మే 27 నాటి ది హిందు ఎడిటోరియల్ “Modi reaches out” కు యధాతధ అనువాదం. -విశేఖర్] *************** సాధారణ ప్రజాస్వామిక పద్ధతులు నెలకొని ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడి మరియు డా.మన్మోహన్ సింగ్ ల మధ్య జరిగిన లాంటి సమావేశం ఎలాంటి విమర్శలకు తావు లేకుండా జరిగిపోతుంది. ఒకసారి ఎన్నికల వేడి, శతృత్వాలు అంతరించడం అంటూ జరిగిన తర్వాత ప్రభుత్వ పాలన ఇక సహకార సంస్ధ తరహాలో మారిపోతుంది. అధికారం చేపట్టిన వ్యక్తి సలహా, సూచనల…

ప్రధాని, మాజీ ప్రధాని సమావేశం -కార్టూన్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రధాని నరేంద్ర మోడిని కలిశారు. వారి సమావేశంలోనే అంశాలు ఏమిటో ఎవరికి తెలియదు. మాజీ ప్రధాని మాట్లాడి వెళ్ళాక ప్రధాని నరేంద్ర మోడిగారే స్వయంగా వారిద్దరు చేతులు కలిపిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఫోటోతో పాటు కొంత మేటర్ ఆయన రాశారు గానీ, అందులో వారి సమావేశంలోని అంశం ఏమిటో చెప్పలేదు. ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా) మాజీ అధిపతి భాయిజి తన ఉద్యోగ అనుభవాలను…

రాహుల్ పునరాగమనం -ది హిందు ఎడిటోరియల్

[ఏప్రిల్ 21 తేదీన ది హిందూలో ప్రచురించిన ‘Return of Rahul’ సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం.] దాదాపు రెండు నెలల పాటు సెలవు రాహుల్ గాంధీ సెలవులో వెళ్లిపోవడం సరైన సమయంలో జరిగిన పరిణామమో ఏమో గానీ ఆదివారం నాడు ఢిల్లీలో భూ సేకరణ చట్టం (సవరణలు) కు వ్యతిరేకంగా నిర్వహించిన భారీ ర్యాలీ మాత్రం కాంగ్రెస్ పార్టీని మరింత చురుకైన ప్రతిపక్షంగా నిలబెట్టినట్లు కనిపిస్తోంది. నిరసనలకు ప్రారంభ ఊపు ఇచ్చింది రైతుల గ్రూపులు, పౌర…

యానిమల్ స్పిరిట్స్ & బిజినెస్ కాన్ఫిడెన్స్ -ఈనాడు

స్వేచ్చా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధల్లో, వాణిజ్య పత్రికల్లో తరచుగా వినియోగించే పదం ‘బిజినెస్ కాన్ఫిడెన్స్.’ ఇదే అర్ధాన్ని వ్యక్తం చేస్తూ పెట్టుబడిదారీ ఆర్ధికవేత్త జాన్ కీన్స్ ‘యానిమల్ స్పిరిట్స్’ అన్న పదబంధాన్ని ప్రయోగించారు. భారత దేశంలో ‘యానిమల్ స్పిరిట్స్’ అన్న పదాన్ని బహుళ ప్రచారంలోకి తెచ్చిన ఘనత మాజీ ప్రధాని, మాజీ ఆర్ధిక మంత్రి మన్మోహన్ సింగ్ దే. భారత జి.డి.పి పడిపోవడం మొదలైన దశలో, అప్పటి ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా నామినేషన్ వేసిన…

పెట్టుబడుల క్లియరెన్స్ ప్రధాని మోడి చేతుల్లోకి

‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం ద్వారా భారత దేశంలోకి విరివిగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని కలలు గంటున్న ప్రధాన మంత్రి మోడి ఆ వైపుగా అడుగులు వేగంగా వేస్తున్నారు. మన్మోహన్ హయాంలో యు.పి.ఏ 2 పాలన చివరి రోజుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, విదేశీ-స్వదేశీ ప్రైవేటు పెట్టుబడుల క్లియరెన్స్ కు ఏర్పాటు చేసిన ‘ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్’ (పి.ఎం.జి) ను ప్రధాని మోడి తన చేతుల్లోకి తీసుకున్నారని పేరు చెప్పని అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా…

కఠిన నిర్ణయాలు తప్పవు -మోడి

అనేశారు! ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడి ఆ కాస్త మాటా అనేశారు. ఆర్ధిక వ్యవస్ధను గాడిన పెట్టాలంటే కఠిన చర్యలు తప్పవని ప్రధాని మోడి స్పష్టం చేశారు. మోడీని, బి.జె.పినీ అదే పనిగా పొగుడుకుంటే ఏమీ ఒరగదనీ అసలు పనిలోకి దిగితే కొన్ని సెక్షన్ల ప్రజలకు కష్టం తప్పదని ఆయన ఉన్న మాట చెప్పేశారు. అధికార పీఠాన్ని అధిష్టించి నెల కూడా కాలేదు, అప్పుడే కఠిన చర్యలు అంటున్నారు మోడి. “ఆర్ధిక క్రమశిక్షణ తెచ్చుకోవాలంటే రాబోయే ఒకటి…

ప్రమాదవశాత్తు ప్రధాని, ప్రమాదాల ప్రధాని -కార్టూన్

ప్రధాని మన్మోహన్ సింగ్ కు మొదటి పదవీ కాలంలో మీడియా సలహాదారుగా పని చేసిన సంజయ్ బారు ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పేరుతో పుస్తకం రాసిన విషయం తెలిసిందే. సరిగ్గా ఎన్నికల ముందు ఈ పుస్తకాన్ని విడుదల చేయడం ప్రత్యర్ధుల ప్రయోజనాలకే అన్న ఆరోపణల సంగతి ఎలా ఉన్నా ఈ పుస్తకాన్ని బి.జె.పి వినియోగించదలుచుకుందని ఆ పార్టీ విమర్శలు చెబుతున్నాయి. బి.జె.పి ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్ర మోడి సైతం ఆ అవకాశాన్ని వదల్లేదు. మన్మోహన్ సింగ్…

మన్మోహన్ తన భార్య పేరు రాయలేదుగా? -బి.జె.పి

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి వివాహం, భార్య అంశాలపై రాహుల్ గాంధీ దాడి ఎక్కుపెట్టిన నేపధ్యంలో బి.జె.పి తన సొంత ఆయుధం తెరపైకి తెచ్చింది. ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా తన భార్య పేరును అఫిడవిట్ లో ఇవ్వలేదన్న సంగతిని ఎత్తి చూపింది. 2013లో జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా మన్మోహన్ సింగ్ తన నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్ లో తన భార్య పేరు ఇవ్వలేదని బి.జె.పి నేత రవిశంకర్ ప్రసాద్…

బొగ్గు కుంభకోణం vis-à-vis పర్యావరణ అనుమతి -కార్టూన్

ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా బొగ్గు తవ్వి పారేస్తున్న కంపెనీలు కొన్నాయితే పర్యావరణ అనుమతులు లేకుండానే లక్షల టన్నుల బొగ్గు గనుల్ని అట్టే పెట్టుకున్న కంపెనీలు మరి కొన్ని. ఇవి సాదా సీదా కంపెనీలు కూడా కాదు. భారత దేశ పారిశ్రామిక ప్రగతికి సంకేతాలుగా పాలకులు సగర్వంగా చాటుకునే కంపెనీలు. జిందాల్ స్టీల్ అండ్ పవర్, టాటా స్టీల్, ఆర్సిలర్ మిట్టల్, అదాని పవర్.. ఇత్యాది కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. బొగ్గు కేటాయింపులకు కేంద్రం ఏర్పాటు…

రాహుల్ సిద్ధం, షరతులు వర్తించును -కార్టూన్

ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం తన పదవీకాలంలో మూడోసారి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన తన అధికార దండాన్ని రాహుల్ గాంధీకి అప్పగిస్తున్నట్లుగా పరోక్షంగా సూచించారు. ప్రధాన మంత్రి అభ్యర్ధిని తర్వాత ప్రకటిస్తాం అని చెబుతూనే కాంగ్రెస్ నాయకులలోకెల్లా రాహుల్ గాంధీకే ఆ పదవికి తగిన అర్హతలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. తద్వారా తన వారసుడు రాహుల్ గాంధీయే అని ఆయన స్పష్టం చేశారు. తన ప్రసంగంలో ప్రధాన మంత్రి పత్రికలపై విమర్శలు కురిపించారు. పత్రికల…

పటేల్ వారసత్వం ఎవరిది? -కార్టూన్

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్! స్వతంత్ర భారతావనికి మొట్టమొదటి హోమ్ మంత్రిగా పని చేసి అనేక స్వతంత్ర సంస్ధానాలను భారత దేశంలో విలీనం కావడంలో ముఖ్యపాత్ర పోషించాడన్న కీర్తి సంపాదించిన వ్యక్తి. ఇప్పుడు ఆయన కీర్తి ప్రతిష్టలకు వారసత్వం పొందే హక్కు ఏ రాజకీయ పార్టీది అన్న మీమాంస తలెత్తింది. కాంగ్రెసా? లేక బి.జె.పి యా? ఈ రెండింటిలో ఏది హక్కుదారు? గుజరాత్ లోని పటేల్ మెమోరియల్ ట్రస్ట్ వారు పటేల్ స్మృతిలో ప్రపంచంలోనే అతి భారీ…

పటేల్ విగ్రహానికి కాణీ విదల్చని మోడి

దేశంలోని ఛానెళ్ల నిండా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహ నిర్మాణం గురించి ప్రకటనల రూపంలో మారుమోగి పోతోంది. పటేల్ విగ్రహంతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి బొమ్మ కూడా ఆ ప్రకటనల్లో కనిపిస్తోంది. విగ్రహ నిర్మాణం మొత్తం ఆది నుంచి అంతం వరకూ తానే నెత్తి మీద వేసుకుని మోస్తున్నట్లుగా సదరు ప్రకటనల్లో మోడి బిల్డప్ ఇస్తున్నారు. తీరా చూడబోతే ఈ మెమోరియల్ నిర్మాణం కోసం తన పదేళ్ళ పాలనలో నరేంద్ర మోడి ఒక్క…

మన్మోహన్ సి.బి.ఐ ని ఆహ్వానించారు -కార్టూన్

బొగ్గు కుంభకోణం విషయంలో సి.బి.ఐ తనను విచారించదలుచుకుంటే దానికి అడ్డంకులేమీ లేవని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తొట్ట తొలిసారి నిన్న ప్రకటించారు. 2జి కుంభకోణంలో అనుమానాలు కమ్ముకున్నా ‘నాకు తెలియదు, నాకు సంబంధం లేదు’ అంటూ తప్పించుకున్న ప్రధాని బొగ్గు కుంభకోణంలో ‘విచారణకు సిద్ధం’ అని ప్రకటించినందుకు దేశ ప్రజలు సంతోషించాలా లేక ఎన్ని ఆరోపణలు వచ్చినా చూరు పట్టుకుని వేలాడుతున్నందుకు సిగ్గుపడాలా? మన్మోహన్ సింగ్, భారత దేశపు అత్యున్నత నేర విచారణ సంస్ధకు సమర్పించిన…

మన్మోహన్: రాహుల్ గాంధీ బరువు తూచే యంత్రం?

అధికారం, హోదా అన్నీ ఉన్నా కూడా ఏమీ చేయని/చేయలేని వ్యక్తిని ‘ఉత్సవ విగ్రహం’గా చెప్పుకోవడం పరిపాటి!అవడానికి ప్రధమ పౌరుడే అయినా ఎలాంటి కార్యనిర్వాహక అధికారాలూ లేని, కేవలం కేంద్ర మాంత్రివర్గం ఆమోదించిన నిర్ణయాలపైన సంతకం మాత్రమే పెట్టగల రాష్ట్రపతిని ‘రబ్బర్ స్టాంప్’ గా సంభోధించడమూ తెలిసిందే. ప్రధాన మంత్రి పదవి వీటికి భిన్నం. అది భారత దేశంలో అత్యున్నత అధికారం కలిగిన పదవి. ఆ పదవిని అమెరికా కంపెనీలకు తప్ప భారత దేశ ప్రజలకు ఉపయోగించని మన్మోహన్…