జారితే ఎక్కడ ఆగుతానో నాకే తెలియదు -రూపాయి

రూపాయి పరిస్ధితి కడు దయనీయంగా మారింది. రిజర్వ్ బ్యాంకు జోక్యం చేసుకున్నా వినకుండా పాతాళంలోకి వడి వడిగా జారిపోతోంది. బుధవారం, చరిత్రలోనే ఎన్నడూ లేనంత అధమ స్ధాయికి దిగజారి డాలర్ కి రు. 60.72 పైసల దగ్గర ఆగింది. సమీప భవిష్యత్తులో ఈ జారుడు ఆగే సూచనలు కనిపించడం లేదనీ మరింతగా రూపాయి విలువ పతనం కావచ్చని విశ్లేషకులు, మార్కెట్ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. రూపాయి పతనానికి కారణం గత ఆర్టికల్ లో చర్చించినట్లు ఎఫ్.ఐ.ఐ (ఫారెన్…

విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ బొనాంజా

అయినోడికి ఆకులు, కానోడికి కంచాలు! అదేమంటే జి.డి.పి వృద్ధి కోసం అని సాకులు. ఇదీ మన ప్రభుత్వ విధానం. స్వంతగా ఏడవ లేక పరాయి దేశాల పెట్టుబడిదారులను పిలిచి ‘మా దేశాన్ని అభివృద్ధి చేయండహో’ అని చాటింపు వేస్తున్నారు మన ఆర్ధిక మంత్రి చిదంబరం. ఎఫ్.ఐ.ఐ (విదేశీ సంస్ధాగత పెట్టుబడులు), క్యు.ఎఫ్.ఐ (క్వాలిఫైడ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ – అర్హిత విదేశీ పెట్టుబడులు) ల సొంతదారులు ఇప్పుడిక తమ వడ్డీ ఆదాయంపై 20 శాతం పన్ను బదులు 5…

డాలర్ నిల్వలకు ఎసరు తెస్తున్న ధనికుల బంగారం దాహం

భారత దేశ ధనికులు బంగారం పైన పెంచుకుంటున్న వ్యామోహం మన విదేశీ మారక ద్రవ్య నిల్వలకు ఎసరు తెస్తోంది. దేశంలోకి వస్తున్న విదేశీ మారక ద్రవ్యం కంటే బంగారం, చమురుల కొనుగోళ్ల కోసం దేశం బైటికి వెళుతున్న విదేశీ మారక ద్రవ్యమే ఎక్కువ కావడంతో నిల్వలు తరిగిపోతున్నాయి. ఫలితంగా భారత ఆర్ధిక వ్యవస్థకు కరెంటు ఖాతా లోటు (Current Account Deficit –CAD) రికార్డు స్థాయికి చేరుకుంది. ఒక దేశ ఆర్ధిక వ్యవస్థ మౌలిక ప్రమాణాలలో (ఫండమెంటల్స్)…

రికార్డు స్ధాయికి రూపాయి విలువ పతనం -కార్టూన్

గత కొద్ది నెలలుగా పతన దిశలో ఉన్న రూపాయి విలువ బుధవారం మరో రికార్డు స్ధాయికి పతనం అయింది. ఉదయం డాలరుకి రు. 55.52 పై లతో ప్రారంభమై సాయంత్రం 3 గంటల సమయానికి 74 పైసలు పతనమై రు. 56.13 పై లకు పతనం అయిందని ‘ది హిందూ’ తెలిపింది. మరో పక్క యూరో, యెన్ లతో పోలిస్తే రూపాయి విలువ పెరిగింది. అయితే స్వంత కారణాలవల్ల యూరో, యెన్ లు పతనం అవడమే దీనికి…

భారత పాలకుల్ని నిరాశపరుస్తూ తగ్గుదల నమోదు చేసిన ఆర్ధిక వృద్ధి రేటు

గత 2010-11 ఆర్ధిక సంవత్సరంలో జనవరి 2011 నుండి మార్చి 2011 వరకు ఉన్న చివరి క్వార్టర్ లో భారత దేశ ఆర్ధిక (జిడిపి) వృద్ధి రేటు అంతకు ముందరి ఐదు క్వార్టర్లలో అతి తక్కువ వృద్ధిని నమోదు చేసింది. ద్రవ్యోల్బణం కట్టడి కోసం రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడం వలన వినియోగం తగ్గడం, పెట్టుబడులు కూడా మందగించడం ఈ తగ్గుదలకు కారణమని విశ్లేషకు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం ఇంకా లొంగిరాక పోవడంతో మరిన్ని సార్లు వడ్డీ…