ధర్మపురి జంటను విడదీశారు

తమిళనాడులో కులాంతర వివాహాలపై విషం కక్కుతున్న స్వార్ధ శక్తులు ఒక ఆదర్శ వివాహ జంటను విడదీయడంలో ఎట్టకేలకు సఫలం అయ్యారు. రాజకీయ ప్రయోజనాల కోసం దళితులపై విష ప్రచారానికి వెనుకాడని పట్టళి ముక్కల్ కచ్చి (పి.ఎం.కె) పార్టీ నాయకులు ఆ పాపం మూటగట్టుకున్నట్లు కనిపిస్తోంది. వన్నియార్ కుల ప్రజలను దళితులపై విద్వేషపూరితంగా రెచ్చగొట్టి ఓట్లు, సీట్లు సంపాదించడానికి అలవాటు పడిన పి.ఎం.కె నాయకుడు రాందాస్ అనేక సంవత్సరాలుగా కులాంతర వివాహాలను పచ్చిగా వ్యతిరేకిస్తూ ప్రకటనలు ఇస్తున్నాడు. మరీ…

గూఢచర్యం ప్రపంచీకరణ: ఎల్లలు లేని ఒబామా ఫోన్ ట్యాపింగ్

మొట్టమొదటి నల్లజాతి అధ్యక్షుడు బారక్ ఒబామా నల్ల చట్టాలు అమలు చేయడంలో జార్జి డబ్ల్యూ. బుష్ ని మించిపోతున్నారు. ప్రభుత్వ చెప్పు చేతల్లోని విదేశీ గూఢచర్య కోర్టు (Foreign Intelligence Surveillance Act Court -FISA Court) నుండి తనకు కావలసిన ఆర్డర్ తెప్పించుకుని అమెరికా ప్రజలతో పాటు ప్రపంచంలోని ఇతర అన్ని దేశాల ప్రజల ఫోన్ సంభాషణల పైనా గూఢచర్యం సాగించడానికి తెగబడ్డాడు. గత ఏప్రిల్ 25 తేదీన కోర్టు ఈ మేరకు ఆర్డర్ సంపాదించారని…

ఆహార భద్రతా బిల్లు: ఖోలో సెసేమ్! -కార్టూన్

ఎన్నికలలోపు ‘ఆహార భద్రతా బిల్లు’ (Food Security Bill) ను చట్టం రూపంలో తేవాలని యు.పి.ఏ ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తోంది. బి.జె.పి సహాయ నిరాకరణ వలన బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి అవకాశం దొరకలేదు. మైనారిటీలో ఉన్న యు.పి.ఏ-2 ప్రభుత్వం బి.జె.పి సహకారం లేకుండా చట్టం తేవడం అసంభవం. ఈ నేపధ్యంలో కేబినెట్ ద్వారా ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు పత్రికలు చెబుతున్నాయి. ఇంతకీ కాంగ్రెస్ కి ఎందుకింత తొందర? ఆహార భద్రతా…