జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ వార్తా విశేషాలు

కామెంట్స్ పాలసీ

  • నిజ జీవితంలో పరిచయం లేని వ్యక్తి తారసపడినపుడు ఆ వ్యక్తి పట్ల ఎలా ప్రవర్తిస్తామో అదే విధంగా పరిచయం లేని సాటి బ్లాగర్‌తో వ్యవరించాలన్న కనీస అవగాహన బ్లాగర్లకు, వ్యాఖ్యాతలకు ఉంటుందని భావిస్తున్నాం. అటువంటివారి వ్యాఖ్యానాలనే అనుమతించగలమని సవినయంగా తెలియజేస్తున్నాం.
  • ఆధిక్యత, వెటకారం, హేళన, దూషణలతో నిండిన కామెంట్లు తొలగిస్తాము. ఈ కారణాలతో తొలగించబడిన కామెంట్లు రాసినవారు మరొకసారి కామెంట్ రాయడానికి –అది ఎలా ఉన్నప్పటికీ– అనుమతించడం సాధ్యం కాదని విన్నవించుకుంటున్నాం.
  • వ్యాఖ్యానాల్లో సభ్యత సంస్కారాలు తప్పని సరిగా ఉండేలా చూసుకోవాలని కోరుతున్నాం. చేరువగా లేమన్న ధైర్యంతో ఇస్టమొచ్చినట్లు వ్యాఖ్యానించవచ్చని భావించడం అనాగరికత అని గౌరవనీయ సందర్శకులు గమనించగలరు.
  • మరొకరి పేరుతో వ్యాఖ్యానించడం వారి ఐడెంటిటీని దొంగిలించినట్లే. అది హీన సంస్కృతి. అటువంటివారి కామెంట్లను అనుమతించలేము. అటువంటి వారి కామెంట్లు పొరబాటున ఆమోదం పొందితే మాకు తెలియ జేయండి. తొలగిస్తాము. అయితే అలాంటి వ్యాఖ్యానాలకు బ్లాగ్ రచయితల భాద్యత లేదని గుర్తించ గలరు.
  • పోస్టులో పొందుపరిచిన విషయంపై మాత్రమే పరిమితమైనంతవరకూ చర్చకు అందరూ ఆహ్వానితులే. వ్యతిరేక భావాలున్నవారూ చర్చకు ఆహ్వానితులే. చర్చాంశాన్ని దాటి వ్యాఖ్యానించడం, వ్యక్తిగత ఇస్టాయిష్టాలపై వ్యాఖ్యానించడం చేయరాదని మనవి. అటువంటి వ్యాఖ్యానాలను ఆటోమేటిగ్గా తిరస్కరిస్తాము. కారణాలను చర్చించడం సాధ్యం కాదని గమనించగలరు.
  • తెలుగులో ఉన్న ఏ బ్లాగ్‌లో నైనా దూషణలతో, హేళనలతో కామెంటు పెట్టినవారు ఈ బ్లాగ్‌లో కామెంట్ పెట్టడానికి అనర్హులు. ఏ బ్లాగర్‌తోనైనా అమర్యాదగా ప్రవర్తించినవారు ఎవరైనా ఇక్కడ కామెంట్ పెట్టినట్లయితే తెలియజేయండి. నిర్ధారించుకుని తొలగిస్తాము.
  • ఒక ప్రత్యేక భావాజాలాన్ని గానీ, కుల మతాల అధారంగా గానీ, ద్వేషిస్తూ, హేళన చేస్తూ రాసేవారి కామెంట్లను ఏ కారణం చూపకుండా తొలగిస్తామని గమనించగలరు.
  • తొలగించిన కామెంట్లను పీరియాడికల్ గా సమీక్షించి, అనవసరంగా తొలగించామని భావించినపుడు మేమే దాన్ని ప్రచురించగలము. కనుక తొలగించిన కామెంట్ల విషయంలో ఫిర్యాదులను, చర్చలను అనుమతించడం సాధ్యం కాదని విన్నవించుకుంటున్నాం.
  • తెలుగులో బ్లాగింగ్ చేసేవారి సంఖ్యను పెంచడానికి కృషి చేద్దాము. కొత్త వారిని నిరుత్సాహపరిచే కామెంట్లను నివారిద్దాం.
  • ఈ కామెంట్స్ పాలసీలో ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా మార్పు చేర్పులు చేయడానికి ఈ బ్లాగర్లకు హక్కు ఉంది.

30 Comments on “కామెంట్స్ పాలసీ

  1. Bhaskar
    మే 15, 2011

    మీ అప్పీల్ చాలా బాగుంది. మీ రిక్వెస్టు వారికి కనువిప్పు కావాలని కోరుకుంటున్నాను.

  2. visekhar
    మే 15, 2011

    ఆ చాన్సే లేదు. వారి లక్ష్యం వేరు కనక అది కొనసాగుతూనే ఉంటుంది. నేను పట్టించుకోవడం లేదు.

  3. vuppula srinivas achary
    ఫిబ్రవరి 12, 2012

    Cartoon section pedite choodalani undi..daya chesi theeni gurichi alochinchagalaru..
    srinivas

  4. విశేఖర్
    ఫిబ్రవరి 12, 2012

    శ్రీనివాస్ గారూ, ఈ ఐడియా నాకు రాలేదు. కార్టూన్ కేటగిరీ ప్రారంభిస్తాను. ఐడియాకి ధన్యవాదాలు.

  5. kondalarao1
    ఫిబ్రవరి 23, 2012

    @ విశేఖర్ గారూ !
    మీ బ్లాగు ఈ రోజే చూశాను.
    మీ పాలశీలు – వినయంతో కూడిన విజ్నాపన బాగున్నాయి.
    తెలుగులో సక్రమ బ్లాగింగు కోసం మీ అభ్యర్ధన ప్రస్తుతం చాలా అవసరమైన విషయం.
    బ్లాగు నడిపే – కొత్తగా నడపాలనుకునే వాళ్ళకి మీ సూచనలు పనికివస్తాయి. ఎవరూ మారే చాన్‌సే లేదనడం కరెక్ట్ కాదు.

  6. విశేఖర్
    ఫిబ్రవరి 23, 2012

    కొండల రావు గారూ, మారే ఛాన్సే లేదు అన్నది అందరినీ ఉద్దేశించి కాదు. తమకు నచ్చని అంశాలను రాసే బ్లాగర్లపైన అమానవీయంగా, దుర్మార్గంగా దుష్ప్రచారం చేస్తున్నవారిని గురించి ఉద్దేశిస్తూ అది రాసాను. వాళ్లు తప్ప ఇతర బ్లాగర్లందరూ, ఎవరో ఒకరిద్దరు మినహా, పద్ధతుల్లో వెళ్తున్నవారే. తమకు నచ్చని అభిప్రాయాలపైన కూడా గౌరవంగా విమర్శ చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. హిందూ మతాన్ని కాపాడుతున్నామన్న భ్రమలో ఉన్న వీరు ఆ పేరుతో తోటి బ్లాగర్లపైన బూతులు రాయడం, విమర్శిస్తున్నామన్న పేరుతో వ్యక్తిగతంగా దూషించడం లాంటివి చేస్తున్నారు. వీరికి తాము చేస్తున్నదేమిటో తెలుసు. ఆవేశంలో ఉన్నపుడు దూషించినవారు ఆ ఆవేశం తగ్గాక తమ తప్పును తెలుసుకుంటారు. కనీసం ఆ ప్రయత్నం చేస్తారు.

    వీరు అలా కాదు. తమకు ఇష్టం లేని విషయాలు రాస్తున్న బ్లాగర్లను తిట్టి, రెచ్చగొట్టి, తిట్టించుకుని ఆ వంకతో రెచ్చిపోయి బూతులు రాయడం రాయించడం వీరి పని. దాన్ని వారొక కార్యక్రమంగా కొన్ని సంవత్సరాలనుండి చేస్తున్నారు. మర్యాదస్తుల ముసుగులో వాదనలకు దిగేవారే మారు పేర్లతో బూతులు రాస్తారు. ఆ బూతులు, ఇతర దూషణలను యధేచ్ఛగా తమ బ్లాగుల్లో అనుమతిస్తూ ‘మాకు మోడరేషన్ లేదు. కనుక మేము ఏం చేయలేము’ అని సాకు చూపిస్తారు. సరిగ్గా గమనిస్తే ఈ మర్యాదస్తులు ఒకటి రాసిన వెంటనే ప్రవాహం లాగా ఎనోనిమస్ పేరుతో బూతులు, ఇతర దూషణలో పోస్టు అవుతాయి. తమకు ఇష్టంలేని అంశాలను రాస్తున్నవారిని బ్లాగింగ్ నుండి తరిమివేయడమే వీరి లక్ష్యం. ఈ లక్ష్యాన్ని వీరు వివిధ రూపాల్లో, ఫ్లో చార్టుల ద్వారా కూడా ప్రకటించుకున్నారు.

    వీరి లక్ష్యమే దుర్మార్గమైన లక్ష్యం కనుక వారు మారే అవకాశం ఉండదు. ఉద్దేశ్య పూర్వకంగా దూషిస్తున్నవారు తమ దూషణ తప్పు అని సవరించుకునే అవకాశాలు లేవు. దూషించడానికి తగిన అవకాశాలని దొరకబుచ్చుకుని మరీ దూషిస్తున్న వీరు మారతారా? మారరు. అదే నేను చెప్పింది. కొత్తగా బ్లాగింగ్ మొదలు పెట్టినవారికి మారవలసిన అవసరం ఎందుకుంటుంది? వారి పద్ధతిలో వారి లక్ష్యం మేరకు బ్లాగింగ్ చేసుకుంటూ పోతారు. అలా కొత్తగా వచ్చినవారు ఈ దుర్మార్గుల బారిన పడకుండా ఉండడమే మనకు కావలసింది. మీరన్నట్లు అలాంటివారికి ఇక్కడి సూచనలు ఉపయోగపడతాయని నేనూ ఆశిస్తున్నాను.

  7. Praveen Sarma
    ఫిబ్రవరి 23, 2012

    ఆరోగ్యకరంగా చర్చించడానికి హిందూత్వవాదులు ఎందుకు ఇష్టపడరో ఇక్కడ వ్రాసి ఉంది: http://robertlindsay.wordpress.com/2011/03/14/why-hindutvas-reject-the-aryan-migration-theory/

  8. kondalarao1
    ఫిబ్రవరి 26, 2012

    @ విశేఖర్ గారూ !
    మీ వివరణతో ఏకీభవిస్తున్నాను. అలాంటి వ్రాతలు ఎంతో కాలం నిలబడవు. వాటిని తిప్పికొట్టేందుకు తెలుగు బ్లాగర్లు మరింత చైతన్యవంతంగా – ఐక్యంగా పనిచేయాలి.

  9. bhanukiran
    ఏప్రిల్ 23, 2012

    శేఖర్ గారు ఈ రోజే తెలుగు వార్తలు వెబ్ సైట్ చూసాను. ఇన్నాళ్లూ ఎక్కడ ఉంది సర్ ఈ సైట్. తెలుగులో సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న మేము ఇంగ్లీషు లో ఉన్న ఆ కరెంట్ ఇష్యూస్ చదివి అర్ధం చేసుకోలేక నానా తంటాలు పడుతున్నాం. తెలుగులో కరెంట్ ఎఫయిర్స్ అనాలసిస్ కి యే మేగజైన్ సరిగా లేదు. నిజంగా we are very thankful to u. ఒక్క మాట లో చెప్పాలంటే తెలుగులో అనాలిసిస్ కి మా కొరత తీర్చారు. మన సైట్ లో నేషనల్, ఇంటర్నేషనల్, ఎకానమీ మీద అనాలిసిస్ లు చాలా బాగున్నాయి. ఎస్ & టి విషయాలపై కూడా అనాలిసిస్ ఇస్తుంటే ఇంకా బాగుంటుంది.

    thanks alot.

    భానుకిరణ్.జి

    sekar gaaru eeroje telugu vartalu website chusanu.innaallu yekkada undi sir ee site.telugu lo civils ki prepare autunna mem english lo unna aa current issues chadivi ardam cheskoleka nana tantaalu padutunnam.telugu lo current affairs analysis ki ye magazine sariga ledu.nijamga we are very thankful to u.okka mata lo cheppalante telugu lo analysis ki ma korata thiirchaaru.mana site lo national, international, economy mida analysis lu chala baguntunnai..s&t vishayala pai kuda analysis istunte inka baguntundi.
    thanks alot

    Bhanukiran.G
    khammam

  10. విశేఖర్
    ఏప్రిల్ 23, 2012

    భాను కిరణ్ గారు, మీకు ఉపయోగంగా ఉన్నందుకు సంతోషంగా ఉంది.

    ఇంగ్లీషు భాషలోనే చాలా విషయాలు పరిమితం కావడం వల్ల తెలుగువారికి విజ్ఞానం లభ్యం కావడం ఎంత కష్టంగా ఉందో మీ వ్యాఖ్య ద్వారా మరోసారి అర్ధం అవుతోంది. తెలుగును అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం కూడా గుర్తు చేస్తోంది. భాషా పరంగా చూసినట్లయితే చాలా ఎస్ & టి పదజాలానికి తెలుగులో పదాలు లేవు. అదేమంటే నోరు తిరగని సంస్కృతం నుండి పట్టుకొస్తారు. ఆ పదాల కంటే ఇంగ్లీషే నయం అని కూడా అనిపిస్తుంది. భాషా వేత్తలు ఈ కొరతను గుర్తించి కొత్త పదజాలాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది.

    ఎస్ & టి విషయాల కోసం మీరు చేసిన సూచనని గమనంలో ఉంచుకుంటాను.

  11. vihari
    ఏప్రిల్ 23, 2012

    hello sekar gaaru.mana site chala bagundi..national international,economy mida visleshanalu chala bagunnai.alage science&techonoly ,india &world mida kuda visleshanalu iste mana site marinta samagramga untadi.inta manchi program ki nandi palikinanduku manaspurtiga thanks

  12. విశేఖర్
    ఏప్రిల్ 23, 2012

    విహారి గారూ ధన్యవాదాలు. మీ మిత్రులకి కూడా పరిచయం చేయండి. ఇండియా అండ్ వరల్డ్ అంటే జాతీయ, అంతర్జాతీయ అంశాలనే గదా. మీ ఇతర సూచనలు గమనంలో ఉంచుకుంటాను.

  13. vihari
    ఏప్రిల్ 23, 2012

    sekar gaaru india&world ante na uddesam mana desaniki itra desalaki current ga nadustunna amsaala gurinchina visleshana ani.dayachesi gamanichagalaru.

  14. vihari
    ఏప్రిల్ 23, 2012

    already ma batch anta mana site ni tega chustuune unnaru.ma andarki chala baga nachindi.

  15. విశేఖర్
    ఏప్రిల్ 23, 2012

    విహారి గారూ, మీ భావం అర్ధం అయింది. భారత దేశానికీ, ఇతర ప్రపంచానికి ఉన్న సంబంధాలను విశ్లేషించాలన్నది మీ భావన. ఆ అంశాన్ని గూడా చాలా ఆర్టికల్స్ లో సందర్భానుసారం వివరించాను. సందర్భం వచ్చినపుడు తప్పకుండా అలాంటి విశ్లేషణ ఇస్తాను.

  16. విశేఖర్
    ఏప్రిల్ 23, 2012

    అలాగాండి. మీ బ్యాచ్ వారిని కూడా అభిప్రాయాలు రాయమని చెప్పండి.

  17. kesav463
    ఏప్రిల్ 24, 2012

    a very useful site for all..thnx fr bringing into light.

  18. Sampath Kumar
    ఏప్రిల్ 25, 2012

    Shekar Garu, we are very thankful to provide such a blog for use APPSC Group-I aspirants also.
    Sampath Kumar
    Karimnagar

  19. విశేఖర్
    ఏప్రిల్ 25, 2012

    సంపత్ గారూ, ధన్యవాదాలు. బ్లాగ్ ని తరచుగా సందర్శించండి. మీ మిత్రులకు కూడా తెలియజేయండి.

  20. pothuluri
    ఏప్రిల్ 29, 2012

    requested vishekher garu,
    we r preparing for civils sir, if u dont mind i request you write the eitorial and open page from the hindu.thanks sir,….

  21. విశేఖర్
    ఏప్రిల్ 29, 2012

    పోతులూరి గారూ, ఇదే కోరికను మరో చోట వ్యక్తం చేసారు. అక్కడే మిమ్మల్ని అడిగాను. మీరు చూసినట్లు లేదు. హిందూ ఎడిటోరియల్, ఓపెన్ పేజి లను రోజూ అనువాదం చేయమనా మీ ఉద్దేశ్యం. అదే అయితే రోజూ పేజీలకి పేజీలు అనువాదం చెయ్యడం సాధ్యం కాదు కదా. ఎడిటోరియల్ అనువాదం చేయడం పేటెంట్ హక్కుల ఉల్లంఘన కూడా అవుతుంది.

  22. pothuluri
    ఏప్రిల్ 29, 2012

    patent ullangana enduku authundi sir alantappudu meru post chesthunna articles ullangana kada?

  23. విశేఖర్
    ఏప్రిల్ 29, 2012

    పోతులూరి గారూ, నేను వార్తలను పూర్తిగా అనువాదం చేయడం లేదు. ఒక్క రిపోర్టింగ్ మాత్రమే తీసుకుంటున్నాను. అది కూడా ఒక పత్రిక నుండి కాకుండా వివిధ పత్రికల రిపోర్టింగ్ చూసి ఉమ్మడి అంశాలను ప్రస్తావిస్తూ దానికి నా విశ్లేషణ జోడిస్తున్నాను. అది అందరూ చేసే పనే. ఎవరు ఆర్టికల్స్ రాయాలన్నా వార్తా పత్రికల వార్తలే ఆధారం. కనుక అది ఉల్లంఘన కాదు. మీరడుగుతున్నది ప్రతి రోజూ అనువాదం చేయమని. ఏదైనా ఒక రోజు ఎడిటోరియల్ నాకు నచ్చి అనువాదం చేసుకుంటె అది కూడా ఉల్లంఘన కాకపోవచ్చు. ప్రతి రోజూ రెగ్యులర్ గా అనువాదం చేయడం అంటె అది ఉల్లంఘనే అవుతుంది.

    మరొక విషయం. మీ కోరిక సాధ్యాసాధ్యాలకు కూడా సంబంధించినది. హిందూ ఎడిటోరియల్, ఓపెన్ పేజి అనువాదం చేయడం పెద్ద శ్రమ. నా జాబ్ మానేసి అనువాదం చేస్తూ కూర్చున్నా అది సాధ్యం కాదు. బ్లాగ్ నిర్వహణ ఇక మూలన పడుతుంది.

  24. pothuluri
    ఏప్రిల్ 29, 2012

    thanks sir……

  25. గౌతమ్ మేకా
    జూన్ 23, 2012

    చిన్న సవరణ, మీరు వివరించింది పేటెంట్ ఉల్లంఘన కాదు, కాపిరైట్ (copyright) ఉల్లంఘన.
    http://www.lawmart.com/forms/difference.htm

  26. విశేఖర్
    జూన్ 23, 2012

    గౌతం గారూ, మీరిచ్చిన లింక్ ఉపయోగంగా ఉంది. ధ్యాంక్స్.

  27. knmurthy
    జూలై 16, 2012

    Dear visekhar jee
    how r u ?? pl.read the item”" రెడ్ లైట్ ‘ మల్లెల’ బతుకులింతేనా ?? “”which was published in my blog jaijainayaka. I request u to give link to your valueble readers with your comments.

    thanks and regards

    KNMURTHY

  28. maradana ramalingeswara rao
    ఫిబ్రవరి 23, 2013

    telugu typing is becoming difficult.If possible you are requested to make telugu typing more user friendly.

  29. gowri shankar
    ఏప్రిల్ 08, 2013

    vsekhar garu can i have your mobile no. please
    i need to talk to you. and my no. is ….

  30. విశేఖర్
    ఏప్రిల్ 08, 2013

    గౌరి శంకర్ గారు నేను సెల్ ఫోన్ పెద్దగా వాడను. మీరు చెప్పదలచుకున్నది ఈమెయిల్ ద్వారా చెప్పండి. (మీకు మెయిల్ ఇచ్చాను.)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Connecting to %s

తెలుగులో వ్యాఖ్యలు రాయాలా?

తెలుగులో వ్యాఖ్య రాయడానికి ఈ కింద లింక్ క్లిక్ చేయండి.

lekhini.org.

వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు

Thirupalu on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
విశేఖర్ on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
విశేఖర్ on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
prem on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
Nivas on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
Thirupalu on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
విశేఖర్ on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
Thirupalu on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
prem on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
prem on ద్రవ్యోల్బణం తగ్గెను, వడ్డీ రే…
suresh on అవినీతిని సహించరట! -కార్ట…
విశేఖర్ on అవినీతిని సహించరట! -కార్ట…
suresh on అవినీతిని సహించరట! -కార్ట…
Praveen Nakkavanipal… on పిల్ల ఫిక్సింగ్ ముఠా అణచివేతలో…
moola on సాంకేతిక పురోగతితో ఫోటోగ్రఫీ ప…

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

మరో 546గురు చందాదార్లతో చేరండి

కూడలి

కేటగిరీలు

బ్లాగ్ గణాంకాలు

  • 397,786 సార్లు

క్యాలెండరు

మే 2013
సో మం బు గు శు
« ఏప్రి    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

బ్లాగ్మిత్రులు

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 546గురు చందాదార్లతో చేరండి

%d bloggers like this: