నోట్ల రద్దు: అధమ స్ధాయిలో ఫ్యాక్టరీ, సేవల జీడీపీ

  ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన డీమానిటైజేషన్ వల్ల ప్రజలు నానా కష్టాలు పడుతుండగా భారత జీడీపీ కూడా అదే పరిస్ధితి ఎదుర్కొంటున్నది. ఆర్ధిక నిపుణులు అంచనా వేసిన దానికంటే ఘోరంగా జీడీపీ వృద్ధి రేటు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.  నవంబరు నెలలో భారత సేవల రంగం వృద్ధి చెందటానికి బదులు కుచించుకుపోనున్నదని హఫింగ్టన్ పోస్ట్ నిర్వహించిన సర్వేలో తేలింది. భారత జీడీపీలో అత్యధిక వాటా -60 శాతం వరకు- సేవల రంగానిదే. కనుక మొత్తం జీడీపీ…

12.6 లక్షల కోట్లు జమ, ఇంకెక్కడి నల్ల ధనం?

ప్రధాని మోడీ అట్టహాసంగా ప్రకటించిన ‘పాత అధిక విలువ నోట్ల రద్దు’ వల్ల ఆశించిన ఫలితం అలా ఉంచి కనీస ఫలితం కూడా దక్కే సూచనలు కనిపించడం లేదు. “నల్ల డబ్బుని నిర్మూలించి డబ్బు నిల్వలను శుభ్రం చేసి, టెర్రరిజం ధన వనరులపై దెబ్బ కొట్టి, దొంగ నోట్లకు చోటు లేకుండా చేయడమే నోట్ల రద్దు లక్ష్యం” అని మొదట ప్రధాని ప్రకటించారు. ఆ తర్వాత ఈ లక్ష్యం పైన నిలబడకుండా మాటలు మార్చుతూ పోయినప్పటికీ జనం…

డీమానిటైజేషన్ గాలిలో కొట్టుకుపోయిన మోడీ అవినీతి?!

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా నరేంద్ర మోడీ అవినీతికి పాల్పడిన అంశంపై దర్యాప్తు జరపాలని సుప్రీం కోర్టు అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ ఆదాయ పన్ను శాఖకు ఫిర్యాదు లేఖ రాసిన రోజే ప్రధాని నరేంద్ర మోడీ ‘డీమానిటైజేషన్’ ప్రకటించిన సంగతి ఎంతమందికి తెలుసు? ప్రశాంత్ భూషణ్ ఎవరో తెలియనివారు / గుర్తులేనివారు ఓసారి 2జి కుంభకోణం, బొగ్గు కుంభకోణం లను గుర్తు చేసుకుంటే సరిపోతుంది. ఈ రెండు కుంభకోణాలు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కడానికి ప్రధాన కారకుడే ప్రశాంత…

వడ్డీరేట్ల కోతను ఇక మర్చిపోండి!

ఇది ‘జైట్లీ నిజం కక్కేశారు’ ఆర్టికల్ కింద వెన్నెల గారు చేసిన వ్యాఖ్య! ********* —వెన్నెల బ్యాంకుల వద్ద జమవుతున్న భారీ డిపాజిట్లతో, రుణాలపై భారీ రేట్ల కోత ఉంటుందనే అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే. వడ్డీ రేట్లు దిగొస్తాయని బ్యాంకులతోపాటు పలు రిపోర్టులు కూడా అంచనా వేశాయి. కానీ అనూహ్యంగా సెంట్రల్ బ్యాంకు ఇంక్రిమెంటల్ నగదు నిల్వల నిష్ఫత్తిని 100 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించడంతో ఇక ఇప్పుడు వడ్డీ రేట్ల కోతపై ఆశలను వదులుకోవాల్సిందేనని క్రిసిల్…

క్యాష్ తగినంత లేదు, మరిన్ని రోజులు తిప్పలే -బ్యాంకులు

  “నోట్లు  తగినంతగా నిల్వ ఉన్నాయి. జనం ఆందోళన చెందవద్దు. ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం” అని ఓ పక్క ప్రధాని, ఆర్ధిక మంత్రి, బ్యూరోక్రాట్ అధికారులు హామీలు గుప్పిస్తున్నారు. “క్యూలు తగ్గిపోయాయి, ఇక పరిస్ధితి మెరుగుపడినట్లే” అని ఆర్ధిక మంత్రి సంతోషం కూడా ప్రకటించారు. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉన్నదని పత్రికల సర్వేలు తెలియజేస్తున్నాయి. మరీ ముఖ్యంగా బ్యాంకులు కూడా అదే చెబుతున్నాయి. అనేక చోట్ల బ్యాంకులు, ఎటిఎం లలో కొత్త కరెన్సీ నోట్ల రాబడి…

జైట్లీ నిజం కక్కేశారు!

పాత నోట్లను రద్దు చేయటానికి కారణంగా ప్రధాన మంత్రి ఏం చెప్పారు? మూడు ముక్కల్లో చెప్పాలంటే: నల్ల డబ్బు,  టెర్రరిజం, దొంగ నోట్లు… వీటికి వ్యతిరేకంగా పోరాటం చేయటమే డీమానిటైజేషన్ ప్రధాన లక్ష్యం అని చెప్పారు. “జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మీరు ఈ చర్యకు అనుకూలంగా సర్దుబాటు చేసుకునే త్యాగాన్ని చేయాలి. ఎందుకంటే ఈ చర్య ద్వారా అవినీతి, నల్ల డబ్బు, దొంగ నోట్లు మరియు టెర్రరిజం.. ఈ చెడుగులపై పోరాటం ఎక్కు పెట్టాము” అని ప్రధాన…

సంఘటిత లూటీ, చట్టబద్ధ దోపిడీ -మౌనిబాబా గర్జన!

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గొంతు చాన్నాళ్ళకు వినబడింది. ‘మౌని బాబా’ గా ఇప్పటి ప్రధాన మంత్రి చేత పదే పదే ఎద్దేవా చేయబడిన మన్మోహన్ సింగ్ నోరు తెరవడమే కాదు, గాండ్రించారు కూడా. వయసు మీద పడిన మన్మోహన్ నిజానికి మోడి లాగా పెద్ద పెద్ద చప్పుళ్ళు చేయలేరు. ఆయన ఎంత చిన్నగా, మెల్లగా మాట్లాడినా ఆ మాటల్లో పదును ఉంటే దానిని గాండ్రింపుగా లెక్కించవచ్చు. తాటాకు చప్పుళ్ళ కంటే లక్ష్యానికి గురి చూసే…

నోట్ల రద్దు: రాజకీయ లక్షణం తప్ప సామాన్యుడి రక్షణం కాదు

  (గత టపా కింద తెలుగు టెకీ గారు రాసిన వ్యాఖ్య ఇది. చెతుర్లతో, విరుపులతో, క్లుప్తంగానే అయినా వివరంగా రాసిన తీరు ప్రత్యేకంగా ఉన్నందున టపాగా మార్చి ప్రచురిస్తున్నాను. -విశేఖర్)   ********* రచన: తెలుగు టెకీ / శివ రామ  పెద్ద నోట్ల చలామణి ప్రతిష్టంభన ప్రభుత్వం తమ పాలనను ప్రతిష్టాత్మకంగా భవిష్యత్తులో పదిలపరచుకునే నేపధ్యంలో వ్యాపార దిగ్గజాలతో అంతర్గత ఒడంబడికల మేలు కలయిక, సామాన్యుల పరిధిలో కీడు ప్రక్రియ.  ఈ చర్య అమలుకు…

పుండు మీద కారం, మోడీ సర్వే!

  ప్రజల అభిప్రాయానికి విలువ లేదు. సామాన్య ప్రజల కష్టాల పట్ల సానుభూతి లేదు. వ్యతిరేక అభిప్రాయం పట్ల గౌరవం లేదు. ప్రజాస్వామ్యంలో విరుద్ధ అభిప్రాయాలకు స్ధానం ఇవ్వాలన్న జ్ఞానమే లేదు. నోట్ల రద్దు వల్ల కలిగే ప్రభావంపై ముందస్తు అంచనా లేదు, అధ్యయనం అసలే లేదు. కనీసం ఏర్పాట్లు లేవు. కోట్లాది మంది శ్రామిక ప్రజల కష్టార్జితాన్ని రాత్రికి రాత్రి రద్దు చేసి పారేసి నల్ల “ధనంపై పోరాటం” అని ప్రకటిస్తే జనం ఏమై పోతారన్న…

టెర్రరిస్టుల చేతుల్లో కొత్త 2 వేల నోట్లు!

పాత 500, 1000 నోట్లు రద్దు చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి చెప్పిన కారణాల్లో ఒకటి: టెర్రరిజం ఫైనాన్స్ వనరులను దెబ్బ కొట్టడం. దొంగ నోట్లు, హవాలా డబ్బుతో సీమాంతర ఉగ్రవాదం లేదా పాకిస్తాన్ ప్రేరేపిత కాశ్మీర్ ఉగ్రవాదం పేట్రేగిపోతున్నదని, నోట్ల రద్దు ద్వారా టెర్రరిస్టు ఫైనాన్స్ వెన్ను విరిగిపోతుందని ప్రధాని పిడికిలి బిగించి మరీ చెప్పారు. ప్రధాని చెప్పడమే కాదు, నోట్ల రద్దు వలన కాశ్మీర్ లో టెర్రరిస్టు కార్యకలాపాలు హఠాత్తుగా ఆగిపోయాయని కూడా…

నోట్ల రద్దు: రాజస్ధాన్ పరిశ్రమలకు 1 లక్ష కోట్లు నష్టం!

‘పాత నోట్ల రద్దు – కొత్త నోట్లు ఆలస్యం’ వ్యవహారంలో రాజస్ధాన్ పరిశ్రమలకు 1 లక్ష కోట్ల రూపాయల నష్టం వాటిల్లనున్నదని రాష్ట్రానికి చెందిన పరిశ్రమల సంఘం ప్రకటించింది. ఫెడరేషన్ ఆఫ్ రాజస్ధాన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (Forti) పేర్కొన్నది. రెండు నెలల్లో (నవంబర్, డిసెంబర్) ఈ నష్టం జరుగుతుందని ఫోర్టీ అధ్యక్షుడు అనురాగ్ శర్మ చెప్పారని ద ఎకనమిక్ టైమ్స్ తెలిపింది. కరెన్సీ సంక్షోభం ప్రతి ఒక్క రంగంలోని పరిశ్రమలనూ దెబ్బ తీసిందని ఫోర్టీ తెలిపింది.…

Mr మోడీ, 2014 ఎన్నికల లెక్కలు ఎందుకు చూపరు? -ధాకరే

నరేంద్ర మోడిని పొగడ్తలతో ముంచెత్తే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధిపతి రాజ్ ధాకరే ఈ రోజు తీవ్ర విమర్శలతో ఆయనపై విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల లెక్కలు ఇప్పటికీ ఎన్నికల కమిషన్ కు సమర్పించలేని సంగతిని గుర్తు చేశాడు.  బ్లాక్ మనీ లేకుండానే మీరు 2014 ఎన్నికల్లో గెలిచారా అని ప్రశ్నించారు. పాత నోట్ల రద్దు చర్య, చెప్పిన ఫలితాన్ని ఇవ్వకపోతే దేశం అరాచకం లోకి జారిపోతుందని అందుకు నరేంద్ర మోడియే బాధ్యత…

కొత్త నోట్లు: 2011 లోనే నిర్ణయం -అధికారులు

  సాధారణ పాలనా ప్రక్రియలో భాగంగా తీసుకునే నిర్ణయాలకు మసాలాలు అద్దడం, అబద్ధాలతో హైప్ సృష్టించడం, దేశానికీ ఎదో ఒరగబెట్టేసినట్లు నానా హంగామా చేయడం, పనిలో పనిగా మోడీ చుట్టూ కృత్రిమ ప్రతిష్టను నిర్మించడం, అవేవి వీలు కాకపొతే బాధితుడి పాత్రలోకి వెళ్ళిపోయి కన్నీళ్లు కార్చి సానుభూతి కోసం ప్రయత్నించడం..!  రు 500 , రు 1000 నోట్లు రద్దు చేయటం వెనుక లక్ష్యం నల్ల డబ్బుని వెలికి తీయడం అని కదా కేంద్ర ప్రభుత్వం, ప్రధాన…

అంబానీ, ఆదానీలకు ముందే తెలుసు -బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏ

నిజాలు ఆలస్యంగా అయినా వెలుగులోకి వస్తున్నాయి. బి‌జే‌పి ప్రభుత్వం తమకు కావలసిన వాళ్ళకు ముందే సమాచారం ఇచ్చిందని ప్రతిపక్ష పార్టీలు కట్టగట్టుకుని చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రులు ఖండించే పనిలో ఉండగానే రాజస్ధాన్ బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏ అవే ఆరోపణలు చేయడం విశేషం. రాజస్ధాన్ లో కోట జిల్లాలోని లడ్ పురా నియోజకవర్గ ఎం‌ఎల్‌ఏ భవాని సింగ్ రజావత్ తనకు తెలిసిన నిజాన్ని వెళ్ళగక్కాడు. రు 500/-, రు 1000/- ల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయబోతున్న…

కొత్త నోట్లు: ఆరు నెలలు పడుతుంది -ఆర్ధికవేత్తలు

  RBI నోట్ల ముద్రణా సామర్ధ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే పాత నోట్ల స్ధానంలో కొత్త నోట్లను పూర్తి స్ధాయిలో ప్రవేశపెట్టడానికి 6 నెలల కాలం పడుతుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఆర్ధిక సలహాదారుగా పని చేసిన సౌమిత్ర చౌదరి చెప్పారు. కాగా ప్రధాని మోడీ నిర్ణయం వల్ల అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికంలో భారత జీడీపీ అర శాతం తగ్గిపోతుందని జర్మనీ ఇన్వెస్టుమెంట్ బ్యాంక్ డ్యూష్ బ్యాంక్ AG అంచనా వేసింది.  బ్యాంకుల వద్ద…