టాప్ క్రెడిట్ రేటింగ్ AAA ను కోల్పోయిన అమెరికా

భయపడిందే జరిగింది. నెలల పాటు రుణ పరిమితి పెంపు కోసం, బడ్జెట్ లోటు తగ్గంపు కోసం సిగపట్లు పట్టుకుని చివరిదాకా తేల్చలేకపోయినందుకు అమెరికా ట్రెజరి జారీ చేసే రుణ బాండ్ల (సావరిన్ డెట్ బాండ్లు) రేటింగ్‌ను స్టాండర్డ్ & పూర్ రేటింగ్ సంస్ధ తగ్గించింది. అమెరికా దీర్ఘకాలిక క్రెడిట్ రేటింగ్ ను AAA నుండి AA+ కు తగ్గించింది. ప్రపంచ దేశాలు జారీ చేసే ట్రెజరీ బాండ్లలో అమెరికా బాండ్లకే అత్యధిక రేటింగ్ ఉంది. ట్రెజరీ బాండ్లు…