రైతుల ఆందోళన విరమణ, 11 తేదీన సంబరాలు!
హిందూత్వ అహంభావ పాలకులపై చావు దెబ్బ కొట్టిన ‘భారతీయ’ రైతులు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. రైతు సంఘాల సంయుక్త పోరాట వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేఎం) నేతలు విధించిన షరతులకు కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఆమోదం చెప్పడంతో శనివారం, డిసెంబర్ 9 తేదీన ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరవధిక ఆందోళన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు బనాయించిన కేసులన్నింటినీ బేషరతుగా ఉపసంహరించుకుంటామని కేంద్రం రాత పూర్వకంగా హామీ ఇచ్చింది.…