2012లో జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ -వర్డ్ ప్రెస్ రివ్యూ

2012 సంవత్సరం ప్రారంభంలో చేసినట్లే 2013 సంవత్సరం ప్రారంభానికి కూడా “జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ” బ్లాగ్ ను వర్డ్ ప్రెస్ వారు సమీక్షించారు. వర్డ్ ప్రెస్ బ్లాగర్లకు ఆ సంస్ధ ఇస్తున్న నూతన సంవత్సర కానుక కాబోలు! గత నాలుగైదు నెలలుగా మునుపటిలా ఎక్కువగా టపాలు రాయలేకపోతున్నాను. దానికి మూడు కారణాలు. ఒకటి: వార్తకంటే విశ్లేషణపై కేంద్రీకరించాలని నిర్ణయించడం; రెండు: ఆర్ధరైటిస్ సమస్య వలన కంప్యూటర్ ముందు ఎక్కువగా కూర్చోలేకపోవడం; మూడు: పుస్తక పఠనంపై మరింత కేంద్రీకరణ పెంచడం.…