కాంగీ, టి.డి.పి రెంటి నుండీ ఓట్లు గుంజుకున్న వైకాపా

18 అసెంబ్లీ నియోజకవర్గాలకూ ఒక లోక్ సభ నియోజకవర్గానికీ జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చిందీ చూసినట్లయితే కాంగ్రెస్, తెలుగుదేశం రెండు పార్టీల నుండీ వైకాపా ఓట్లు గుంజుకున్నట్లు స్పష్టం అవుతోంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలకు వచ్చిన ఓట్ల కంటే చాలా తక్కువగా ఈ సారి కాంగ్రెస్ కి ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ నుండి ప్రధానంగా ఓట్లు చేజిక్కించుకున్న వైకాపా తెలుగుదేశం నుండి…