2జి కుంభ కోణం: సుప్రీం కోర్టు తీర్పుకు అర్ధం ఏమిటి?

కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడానికి ఒక కారణంగా పని చేసిన 2జి కుంభకోణంలో ఎట్టకేలకు తీర్పు వెలువడింది. 2011 లో మొదటి అరెస్టు జరిగిన ఈ కేసు విచారణ 6 సంవత్సరాల లోనే పూర్తి కావడం బహుశా -భారతీయ కోర్టుల సంప్రదాయం ప్రకారం- ఒక రికార్డు కావచ్చుఁ.  2008 లో కాగ్ ద్వారా వెలుగులోకి వచ్చిన 2జి కుంభకోణం 2009 – 10 నాటికి భారీ 1.76 లక్షల కోట్ల భారీ కుంభకోణంగా దేశ ప్రజల దృష్టికి…

2జి వేలంలో 60 వేల కోట్ల ఆదాయం

ప్రధాని మన్మోహన్ సింగ్, ఐ.టి మంత్రి కపిల్ సిబాల్, ఆర్ధిక మంత్రి చిదంబరం, మాజీ ఐ.టి మంత్రి ఎ.రాజా తదితరులు వినిపించిన ‘జీరో లాస్’ (Zero loss) వాదన ఒట్టిపోయింది. సుప్రీం కోర్టు రద్దు చేసిన 122 2జి లైసెన్స్ లలో కొంత భాగానికి వేలం జరిపిన కేంద్రం 60,000 కోట్ల రూపాయలకు పైగా సంపాదించింది. వాయిదాల పద్ధతిలో చెల్లించడానికి కంపెనీలు నిర్ణయిస్తే కేంద్ర ప్రభుత్వం చేతికి తక్షణం రు. 18,273 కోట్లు ముడతాయి. స్పెక్ట్రమ్ రిజర్వ్…

ప్రధానికి సోనియా అభయ హస్తం -కార్టూన్

“ఏమీ పట్టించుకోవద్దు, అలా వెళ్తూనే ఉండండి!” – 2జి కుంభకోణంలో తన పాత్రపై మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా చేసిన ఆరోపణలకు బదులివ్వాలని ప్రతిపక్షాలు అరిచి గీపెడుతున్నా ప్రధాన మంత్రి నోరు విప్పడం లేదు. బి.జె.పి నాయకుడు యశ్వంత్ సిన్హా ముచ్చటగా మూడోసారి ఈ విషయమై ప్రధానికి లేఖ రాశారు. ‘మీ మౌనం మీ దోషిత్వాన్ని ఎత్తి చూపుతోంది’ అని ఆయన ఘాటుగా లేఖ రాశారు. అవినీతి ఆరోపణలు వచ్చినపుడు మౌనం వహించడం, విదేశీ కంపెనీలకు దోచి…

2జి కుంభకోణం: సున్నం కొట్టుడు విజయవంతం! -కార్టూన్

2జి కుంభకోణానికి కాంగ్రెస్ తలపెట్టిన ‘సున్నం కొట్టుడు’ కార్యక్రమం పూర్తయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఏ-2 ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన ‘సంయుక్త పార్లమెంటరీ సంఘం’ (సం.పా.సం – జాయింట్ పార్లమెంటరీ కమిటీ -జె.పి.సి) ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి చేతులు దులుపుకుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ తప్పేమీ లేదని, పాపం అంతా అప్పటి టెలికాం మంత్రి ఎ.రాజా దేనని ముక్తాయించిన సం.పా.సం నివేదిక ఊహించని విధంగా మాజీ ప్రధాని అతల్ బిహారీ వాజ్ పేయి ని నివేదికలో…

2జి కుంభకోణం: లక్ష 76 వేల కోట్ల కాగ్ అంచనా కూడా తక్కువేనా?

సహజ వనరు అయిన 2జి స్పెక్ట్రమ్ ను వేలం వేయకుండా స్వదేశీ, విదేశీ ప్రవేటు కంపెనీలకు ఇష్టారీతిన పంచి పెట్టడం వలన భారత ప్రభుత్వ ఖజానాకు గరిష్టంగా 1,76,645 కోట్ల నష్టం వచ్చిందని ‘కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్’ (సి.ఎ.జి) 10 నవంబర్, 2010 తేదీన నివేదిక వెలువరించింది. కాగ్ నివేదిక అంచనా వేసిన మొత్తం భారీగా ఉండడంతో పత్రికలు దానిని సంచలనం చేశాయి. అప్పటి నుండీ ఏదో ఒక రూపంలో (కేసులు, ఖండన మండన ప్రకటనలు, నీరా…

అవినీతి ‘రాజా’ కొంప ముంచిన పర్సనల్ సెక్రటరీ ‘ఆచారి’

మాజీ టెలికం మంత్రి ఎ.రాజా కు పర్సనల్ సెక్రటరీ గా పని చేసిన ‘ఆచారి’, తన మాజీ బాస్ కి వ్యతిరేకంగా కీలకమైన సాక్ష్యం చెప్పినట్లుగా ఎన్.డి.టి.వి వార్తా సంస్ధ తెలిపింది. ఎ.ఆచారి గతంలొ ఎ. రాజాకు అసిస్టెంట్ పర్సనల్ సెక్రటరీగా పనిచేశాడు. ఆయన కోర్టులో సోమవారం మాజీ మంత్రికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తూ ఎ.రాజాకు, ఆయన కుట్ర పన్నాడని ఆరొపిస్తున్న కంపెనీల అధిపతులతో అనేక సంవత్సరాలుగా దగ్గరి సంబంధాలు ఉన్నాయని తెలిపాడు. తద్వారా ఎ.రాజా టెలికం…

జూనియర్ అధికారిదే పాపం అంతా, ప్రణబ్ నోట్ పై చేతులు దులుపుకున్న మంత్రివర్యులు

“2జి కుంభకోణ చోటు చేసుకున్న రోజుల్లో ఆర్ధిక మంత్రిగా వ్యవహరించిన పి.చిదంబరం, స్పెక్ట్రంను వేలం వేయడమే సరైందన్న తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లయితే కుంభకోణం జరగడానికి ఆస్కారం ఉండేది కాదు” అంటూ ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆమోదంతో ఆర్ధిక శాఖలోని డెప్యుటీ సెక్రటరీ, ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపిన నోట్ లో పేర్కొన్న సంగతి ప్రణబ్ ముఖర్జీ తనకు సంబంధం లేదనీ, అంతా ఆ జూనియర్ అధికారి చేసిందే నంటూ గురువారం విలేఖరుల సమావేశంలో ప్రకటించాడు.…

2జి కుంభకోణానికి ‘తెలంగాణ డిమాండ్’ అడ్డు చక్రం, కాంగ్రెస్ వ్యూహం

పాలక కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుభవం అపారం. ఏ బిల్లుని ఎలా ఆమోదింపజేసుకోవాలో, ఏ ఆందోళననను ఎలా తప్పించుకోవాలో, ఏ సంకటం నుండి ఎలా బైటపడాలో కాంగ్రెస్ పాలకులకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనడంలో అతిశయోక్తి లేదు. సోమవారం నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఎ ప్రభుత్వానికి పెద్ద గండంగా మారాయి. ఓవైపు తాము నిండా మునిగి ఉన్న కుంభకోణాలకు సమాధానం చెప్పుకోవలసి ఉండగా, మరొక వైపు అంతర్జాతీయ పెట్టుబడుదారులనుండీ,…

దయానిధి మారన్ హీరోగా మరో కొత్త టెలికమ్ కుంభకోణం

కరుణానిధి బంధువు, కేంద్ర మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్ ప్రధాన పాత్రధారుడుగా మరో సరికొత్త టెలికం కుంభకోణం వెల్లడయ్యింది. తెహెల్కా పత్రిక ద్వారా వెల్లడయిన ఈ కుంభకోణం విలువ 700 కోట్ల రూపాయలు. తాను కేంద్రంలో టెలికం శాఖ మంత్రిగా ఉండగా తమిళనాడులోని ఎయిర్ సెల్ అనే కంపెనీకి టెలికం లైసెన్సులు రాకుండా సంవత్సరాల తరబడి దయానిధి మారన్ అడ్డుకున్నాడని తెహెల్కా పత్రిక బైట పెట్టింది. తన మిత్రుడికి చెందిన మలేషియా కంపెనీ మాక్సిస్‌కి ఎయిర్…

కరుణానిధి నిరాహార దీక్ష ఒఠ్ఠి నాటకం -దయానిధి మారన్

శ్రీలంక తమిళులపై అక్కడి ప్రభుత్వం జరుపుతున్న కాల్పులను విరమింప జేసేలా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 2008 లో చేసిన ఒక రోజు నిరాధార దీక్ష, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని బెదిరించడం, వాస్తవానికి ప్రజల దృష్టి మరల్చడానికి ఆడిన నాటకం అని కేంద్ర మాజీ ఐ.టి మంత్రి దయానిధి మారన్ అమెరికా రాయబార కార్యాలయ అధికారులతో చెప్పిన విషయం వికీలీక్స్ బైట పెట్టిన అమెరికా డిప్లొమాటిక్ కేబుల్స్ ద్వారా వెల్లడయ్యింది.…

ఇండియాలో 2 జి అవినీతి విచారణపై నార్వే ప్రధాని కలవరం

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒత్తిడితో “2 జి కుంభకోణం” పై సి.బి.ఐ జరుపుతున్న విచారణ పట్ల నార్వే ప్రధాని స్టోల్సెన్ బర్గ్ కలవరపడుతున్నాడు. నార్వే ప్రభుత్వానికి చెందిన టెలినార్ టెలికం కంపెనీపై కూడా సి.బి.ఐ విచారణ జరుపుతుండడమే దీనికి కారణం. కేంద్ర టెలికం శాఖ మంత్రిగా పనిచేసిన ఎ రాజా అరెస్టు అయినప్పటికీ నార్వే ప్రధాని కలవరపడలేదు. రాజా తర్వాత కపిల్ సిబాల్ టెలికం మంత్రిగా రావడంతో టెలినార్ తో పాటు ఇతర ప్రవేటు టెలికం…