1962: చైనా కాదు ఇండియాయే దాడి చేసింది -మాక్స్ వెల్

1962 నాటి ఇండియా-చైనా యుద్ధంలో మొదట దాడి చేసింది ఇండియాయేనని చైనా కాదని  సీనియర్ ఆస్ట్రేలియన్ జర్నలిస్టు నెవిల్లే ప్రకటించారు. ఆనాటి యుద్ధానికి సంబంధించి ఇన్నాళ్లూ రహస్యంగా ఉన్న పత్రాలను తాను త్వరలో ప్రచురిస్తానని మాక్స్ వెల్ తెలిపారు. పత్రాలను ప్రచురించడం ద్వారా తాను “భ్రాంతిజనకమైన భారతీయ అభిప్రాయాలను పారద్రోలతానని” మాక్స్ వెల్ చెప్పడం విశేషం. 1962 నాటి యుద్ధం చైనా వల్లనే సంభవించిందని భారత దేశంలోని పాఠ్య పుస్తకాలు చెబుతాయి. హిందూ మతోన్మాద సంస్ధలు కూడా…

ఇండియా-చైనా యుద్ధం: మిలట్రీ చర్యపై ముందే హెచ్చరించిన చైనా

ఈ అక్టోబర్ 20 తేదీతో చైనా-ఇండియాల యుద్ధం ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగిన సరిహద్దు ఘర్షణలపై పత్రికలు తాజా విశ్లేషణలకు పూనుకుంటున్నాయి. టి.వి చానెళ్లు ప్రత్యేక కధనాలు ప్రసారం చేస్తున్నాయి. చైనా ముందస్తు హెచ్చరిక లేకుండా ఇండియాపై దాడి చేసిందన్నది ఈ విశ్లేషణలు, ప్రత్యేక కధనాల సారాంశంగా ఉన్నది. అప్పటి చైనా కమ్యూనిస్టు పార్టీ ఛైర్మన్ మావో జెడాంగ్ ఆదేశాలతోనే చైనా ఇండియాపై దురహంకార దాడికి దిగిందని నిన్న…