కావేరీ ప్రవాహంపై అలజడి -ద హిందూ..

కావేరీ నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ (కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ -CWDT), కావేరీ నిర్వాహక బోర్డు (కావేరీ మేనేజ్మెంట్ బోర్డు -సి‌ఎం‌బి) ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినప్పుడు అది చాలా మంచి కారణాలతోనే అలా చేసింది. ఋతుపవనాల లోటు సంవత్సరాలలో వివిధ ఉప-బేసిన్ లలోని నీటి ప్రవాహాల నమూనా, సాధారణ సంవత్సరాలలోని ప్రవాహాల ఆధారంగా రూపొందించిన నీటి విడుదల సూచి (షెడ్యూలు) తో సరిపోలదు. కావేరీ బేసిన్ లోని నిల్వల స్ధాయి, వర్షాల ధోరణిలను పర్యవేక్షిస్తూ…