రు 500, రు 1000 నోట్లు రద్దు -ప్రధాని మోడి

ఎన్‌డి‌ఏ/బి‌జే‌పి/నరేంద్ర మోడి ప్రభుత్వం ఒకింత సంచలన నిర్ణయం ప్రకటించింది. రెండు పెద్ద కరెన్సీ నోట్లను ఈ రోజు అర్ధ రాత్రి నుండి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జాతిని ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో ప్రధాన మంత్రి ఈ నిర్ణయాన్ని ప్రకటించారని పత్రికలు, ఛానెళ్లు హోరెత్తిస్తున్నాయి. ఎంపిక చేసిన కొన్ని చోట్ల నవంబర్ 11 వరకు రు 500/-, రు 1000/- లను అనుమతిస్తారని ఆ తర్వాత అన్ని చోట్లా నిషేధం అమలు అవుతుందని ప్రధాన మంత్రి ప్రకటించినట్లు తెలుస్తున్నది.…