డ్రోన్ హత్యలు చట్టబద్ధమే -అమెరికా

డ్రోన్ హత్యలను అమెరికా సమర్ధించుకుంది. చట్టాలకు అనుగుణంగానే తాను డ్రోన్ హత్యలకు పాల్పడుతున్నానని స్పష్టం చేసింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జే కేర్ని ఈ మేరకు విలేఖరుల సమావేశం పెట్టి మరీ తమ హంతక చర్యలను సమర్ధించుకున్నాడు. అమలు చేయదగిన అన్ని చట్టాలకు అనుగుణంగానే తమ డ్రోన్ హత్యలు సాగుతున్నాయని ఆయన అన్నాడు. కానీ ఆ చట్టాలేమిటో ఆయన చెప్పలేదు. అమెరికా డ్రోన్ దాడులు అంతర్జాతీయ చట్టాలను, అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్…

అమెరికా డ్రోన్ హత్యలు యుద్ధ నేరాలే -ఆమ్నెస్టీ

పాకిస్ధాన్ లో అమెరికా సాగిస్తున్న డ్రోన్ దాడులు యుద్ధ నేరాల కిందికి వస్తాయని బ్రిటన్ కి చెందిన అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ నిర్ధారించింది. డ్రోన్ దాడులు చట్ట విరుద్ధమని వాటిలో కొన్ని యుద్ధ నేరాలు కూడానని సదరు సంస్ధ తెలిపింది. అమెరికా డ్రోన్ దాడులకు పాకిస్ధాన్ లోని కొందరు అధికారులతో పాటు ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్ ప్రభుత్వాలు కూడా సహకారం ఇస్తున్నాయని చెప్పడం ద్వారా ఆమ్నెస్టీ చిన్నపాటి సంచలనానికి తెర తీసింది. అమెరికా…

అమెరికాలో మరో మానసిక వికలాంగుడి మరణ శిక్షకు రంగం సిద్ధం

గత బుధవారం ఒక మానసిక వికలాంగుడికి మరణ శిక్ష అమలు చేసిన అమెరికా ప్రభుత్వం సోమవారం మరో మానసిక రోగికి విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేయనుంది. ఫ్రాన్సు ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితి లతో పాటు ప్రపంచ వ్యాపితంగా అనేకమంది ప్రముఖులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ వెనక్కి తగ్గడానికి అమెరికా ససేమిరా అంటోంది. మూడు విడతల మిశ్రమ డోసులో ఇంజెక్షన్స్ ఇచ్చి నెమ్మదిగా ప్రాణం తీసే మామూలు పద్ధతి కాకుండా మొదటిసారిగా ఒకే ఒక్క కొత్త విషం…

బానిసకొక బానిసకొక బానిస ఆఫ్ఘన్ మహిళ

తాలిబాన్ మత ఛాందస ప్రభుత్వ అణచివేత నుండి ఆఫ్ఘన్ స్త్రీలను విముక్తి చేస్తామని బీరాలు పలికిన అమెరికా, తన పదేళ్ళ దురాక్రమణలో సాధించిందేమీ లేదని మానవ హక్కుల సంస్ధ ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ నివేదిక వెల్లడించింది. కుటుంబ హింస భరించలేక ఇంటి నుండి పారిపోయినా, భర్త అనుమానంతో పదే, పదే స్క్రూ డ్రైవర్ తో కుళ్ళ బొడిచినా ‘నైతిక నేరానికి’ పాల్పడ్డారంటూ మళ్ళీ స్త్రీలనే ఆఫ్ఘన్ ప్రభుత్వం జైళ్ళలో పెడుతున్నదని హెచ్.ఆర్.డబ్ల్యూ నివేదిక తెలిపింది. ఎన్ని హింసలు…