‘బ్లాగింగ్’ మరియు ‘హ్యూమన్ సివిలైజేషన్’!

బ్లాగింగ్ అన్నది అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సామాన్యులకు అందుబాటులోకి వచ్చిన ఒక సాధనం. పత్రికలు, ఛానెళ్లు కొద్ది మంది వ్యక్తిగత, వృత్తిగత జర్నలిస్టులకి మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందులో ఉద్యోగం సంపాదించి అభిప్రాయాలు అనేకమందితో పంచుకోవడం, చెప్పడం అందరికీ సాధ్యం కాదు. జర్నలిజంలో ప్రవేశం లేకుండానే, జర్నలిజం చదవకుండానే అనేకమంది వివిధ అంశాలను చర్చించగల సామర్ధ్యం కలిగి ఉంటారు. అలాంటివారికి తమ అభిప్రాయాలు చెప్పుకోవడానికి బ్లాగింగ్ మంచి సాధనం. బ్లాగింగ్ అయినా, మరే సామాజిక…