ఫైనాన్స్ మత్తగజాల మధ్య సమరమే ‘పనామా పేపర్స్’! -1

[ఈ వ్యాసం మొదట ప్రజా పంధా పక్ష పత్రికలో రెండు భాగాలుగా అచ్చయింది. బ్లాగ్ లో 4 భాగాలుగా ఇస్తున్నాను. -విశేఖర్] ********* ఏప్రిల్ మొదటి వారంలో (4 తేదీ నుండి) ప్రపంచ పౌరులందరినీ ఆకట్టుకున్న వార్త ఒకటి పత్రికల్లో, ఛానెళ్లలో పతాక శీర్షికలను ఆక్రమించింది. దాదాపు ప్రతి దేశంలోనూ తమ పాలకుల అవినీతి, బంధు ప్రీతి, అధికార దుర్వినియోగాల పట్ల విసిగిపోయి ఉన్న ప్రజలకు కొత్తగా ఒక ‘అవినీతి వ్యతిరేక మెస్సయ్యా’ ప్రత్యక్షమయిన భావనను ఆ…

సైబర్ దాడుల దోషులు అమెరికా, ఇండియాలే – చైనా

హ్యాకింగ్ వివాదం సరికొత్త మలుపు తిరిగింది. హ్యాకింగ్ లాంటి సైబర్ దాడులకు అసలు కారకులు అమెరికా, ఇండియాలేనని చైనా ఆరోపించింది. గత ఐదు సంవత్సరాలనుండి ప్రపంచంలోని అనేక ప్రభుత్వాల వెబ్‌సైట్లు, ప్రముఖుల ఈ మెయిళ్ళు పెద్ద ఎత్తున హ్యాకింగ్ కి గురయ్యాయని మెకేఫీ సైబర్ సెక్యూరిటి సంస్ధ వారం క్రితం వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి, తైవాన్, ఇండియా, దక్షిణ కొరియా, వియత్నాం, కెనడా, ఏసియాన్, ఐ.ఒ.సి, తదితర 72 సంస్ధలు హ్యాకింగ్ కి గురయ్యాయని చెబుతూ, దీని వెనుక…

అమెరికా సెనేట్ వెబ్ సైట్ లోకి చొరబడ్డ హ్యాకర్లు

అమెరికా ప్రభుత్వ వెబ్ సైట్లపై మరే దేశమైనా దాడి చేసినట్లయితే దాన్ని “యుద్ధ చర్య” గా భావించి సాయుధంగానే ప్రతిస్పందిస్తామని అమెరికా ప్రకటించిన వారం రోజుల లోపే అమెరికా ఎగువ సభ లేదా పెద్దల సభ లేదా సెనేట్ కి చెందిన వెబ్ సైట్ పై హ్యాకర్లు దాడి చేసి అమెరికాకి పరోక్షంగా సవాలు విసిరారు. సెనేట్ వెబ్ సైట్ లోకి చొరబడడమే కాకుండా రహస్యం కాని మామూలు ఫైళ్ళను ఇంటర్నెట్ లో ప్రదర్శించింది. తాము సెనేట్…