పశ్చిమ ఆంక్షలకు ఇరాన్ ప్రతిఘటన, ‘హోర్ముజ్’ లో ఆయిల్ రవాణా నిలిపివేతకు చర్యలు

అమెరికా, యూరోపియన్ యూనియన్ లు ఇరాన్ పై విధించిన ఆయిల్ ఆంక్షలు జులై 3 నుండి అమలులోకి రావడంతో ఇరాన్ ప్రతిఘటన చర్యలను ప్రారంభించింది. ప్రపంచంలోని ఆయిల్ రవాణాలో 20 శాతం రవాణా అయ్యే ‘హోర్ముజ్ ద్వీపకల్పం’ వద్ద పశ్చిమ దేశాల అంతర్జాతీయ ఆయిల్ రవాణా ట్యాంకర్లు వెళ్లకుండా నిరోధించడానికి చర్యలు చేపట్టింది. ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకోవడానికి వీలుగా ఇరాన్ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. దీనితో ప్రపంచవ్యాపితంగా క్రూడాయిల్ ధరలు మళ్ళీ కొండెక్కనున్నాయని విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఇరాన్…

ఫుకుషిమా కంటే ‘ఇరాన్ పై ఆంక్షలే’ మాకు పెను ప్రమాదం -జపాన్

2011 లో సంభవించిన ఫుకుషిమా అణు ప్రమాదం కంటే ఇరాన్ పై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల వల్లనే తమకు పెను ప్రమాదంగా పరిణమిస్తాయని జపాన్ భావిస్తోంది. అమెరికాలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ‘ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజన్సీ’ మాజీ డైరెక్టర్ నోబువో తనాకా ఈ మేరకు ఆందోళన వెలిబుచ్చాడు. ఇరాన్ పై విధించిన ఆంక్షల వల్ల తమ దేశానికి జరిగే గ్యాస్, ఆయిల్ సరఫరాలు ఆగిపోతాయనీ, దానివల్ల 2011 లో ఫుకుషిమా అణు ప్రమాదం వల్ల…