రష్యన్ హైపర్ సోనిక్ మిసైల్ ప్రయోగం విజయవంతం!
రష్యా తన ఆయుధ సంపత్తిని అమెరికాకు కూడా అందనంత ఎత్తుకు చేర్చుకుంటోంది. నాటో కూటమిని తూర్పు దిశలో రష్యా పొరుగు సరిహద్దు వరకూ విస్తరించడానికి అమెరికా కంకణం కట్టుకుంటున్న కొద్దీ రష్యా తన ఆయుధ సంపత్తిని మరింత ఆధునిక స్ధాయికి అభివృద్ధి చేస్తోంది. తాజాగా అత్యంత వేగంగా, శత్రు దేశాల రాడార్లకు దొరకని విధంగా అత్యంత రహస్యంగా ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించగల మిసైల్ ని ‘జిర్కాన్’ పేరుతో రష్యా అభివృద్ధి చేసింది. సుదీర్ఘ దూరాల వరకు ఏరో…