మతోన్మాదం ఏ రూపంలో ఉన్నా అంతిమ బాధితులు ప్రజలే

మతోన్మాదం గురించి ఆంధ్ర ప్రదేశ్ లో మళ్ళీ చర్చ జరుగుతోంది. మైనారిటీ మతోన్మాదం వార్తలకు ఎక్కడం ఈసారి ప్రత్యేకత. ‘మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ (ఎంఐఎం) పార్టీకి చెందిన యువ నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ చోట్ల ఇచ్చిన విద్వేష పూరిత ప్రసంగాలు ఈ చర్చకు ప్రేరణగా నిలిచాయి. ఆర్ఎస్ఎస్, బిజెపి లాంటి హిందూ తీవ్రవాద సంస్థలు, పార్టీల నుండి సెక్యులరిస్టు పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్ నుండి వివిధ సెక్యులర్ ముస్లిం సంస్థల వరకూ…

హైద్రాబాద్ మత కల్లోలానికి హిందువులే కారణం

మూడువారాల క్రితం హైద్రాబాద్ లో చెలరేగిన మత ఘర్షణలకు హిందువులే కారణమని పోలీసుల పరిశోధనలో తేలింది. ఇద్దరు స్ధానిక నాయకుల ప్రోత్సాహంతో హిందూ యువకులు మత కల్లోలం రెచ్చగొట్టడానికి పూనుకున్నారని పోలీసులు శనివారం తెలిపారు. మాదన్నపేట దేవాలయంలో ఆవు కాళ్ళు పడేసి, పచ్చ రంగు జల్లితే అది ముస్లింలు చేసిన పనేనని హిందువులు భావించి ముస్లింలపై దాడులకు పూనుకుంటారని పధకం వేశారని పోలీసులు తెలిపారు. ఆవు కాళ్ళను గుడిలో ఉంచి పచ్చరంగు జల్లిన హిందూ యువకులను పోలీసులు…