రక్షణ సాంకేతిక రంగంలో పెట్టుబడుల కోసం ఇండియా పన్నులన్నీ రద్దు చేయాల్సిందే -అమెరికా
రక్షణ రంగం, ఉన్నత సాంకేతిక రంగాలలో అమెరికా సహకారం కావాలంటె ఇండియా విదేశీ పెట్టుబడులపై అన్ని రకాల అడ్డంకులను ఎత్తివేయక తప్పదని అమెరికా అధికారి ఒకరు ప్రకటించాడు. ఇండియా తన రక్షణ రంగంతో పాటు ఉన్నత సాంకేతిక రంగంలో కూడా నూతన పరిజ్ఞానం కావాలని కోరుకుంటున్నదనీ, అది జరగాలంటే ముందు ఇండియా విదేశీ పెట్టుబడులపై సుంకాలను పూర్తిగా ఎత్తివేయడమే కాకుండా పెట్టుబడుల క్లియరెన్స్ కు ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ ప్రక్రియలను సరళతరం చేయవలసిన అవసరం ఉందని…