ఢిల్లీ కోర్టు రూలింగ్: మోడిపై ఎఎపి గెలుపు

ఒక హెడ్ కానిస్టేబుల్ అవినీతి కేసులో ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఢిల్లీలోని ఎఎపి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎఎపి మొదటి గెలుపు నమోదు చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ద్వారా ఎఎపి ప్రభుత్వం చేతుల్లో నుండి అధికారాలు గుంజుకోవడానికి గత కొద్ది వారాలుగా మోడి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలకు ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తాజా తీర్పు కళ్ళెం వేసింది. ఢిల్లీ పోలీసులపై…