క్లుప్తంగా… 08.05.202

జాతీయం జ్యువెలర్స్ పన్ను ఉపసంహరించిన ప్రణబ్ నగల వ్యాపారుల ఒత్తిడికి ఆర్ధిక మంత్రి తలొగ్గాడు. జ్యువెలర్స్ వ్యాపారుల తరపున తీవ్ర స్ధాయిలో జరిగిన లాబీయింగ్ ముందు చేతులెత్తేశాడు. బ్రాండెడ్ మరియు అన్ బ్రాండెడ్ నగల దిగుమతులపై పెంచిన 1 శాతం పన్ను ఉపసంహరించుకున్నాడు. పన్ను ఉపసంహరణతో పాటు పన్ను పెంపు ప్రతిపాదిస్తూ చేసిన అనేక చర్యలను సరళీకరించాడని పత్రికలు తెలిపాయి. జ్యూవెలరీ రంగంలో విదేశీ పెట్టుబడుల ఆహ్వానాన్ని మరో సంవత్సరం పాటు వాయిదా వేసుకున్నట్లు కూడా తెలుస్తోంది.…

ఇరాన్ ఆయిల్: అమెరికా ఒత్తిడికి ఇండియా ప్రతిఘటన

ఇరాన్ నుండి ఆయిల్, గ్యాస్ దిగుమతులను మరింతగా తగ్గించాలని అమెరికా తెస్తున్న ఒత్తిడిని భారత ప్రభుత్వం ప్రతిఘటిస్తున్నట్లుగా విదేశాంగ మంత్రి ప్రకటన సూచిస్తోంది. ఇరాన్ పై అమెరికా విధించిన ఆంక్షలను భారత దేశం అమలు చేయాలంటే గల్ఫ్ ప్రాంతంలో నివశిస్తున్న భారతీయుల భద్రత కూడా పరిగణించాలని హిల్లరీ క్లింటన్ కి చెప్పినట్లు విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ పత్రికలకు తెలిపాడు. గల్ఫ్ ప్రాంతంలో భారత దేశానికి కీలకమైన భద్రతా ప్రయోజనలు ఉన్నాయని ఆయన అమెరికా అతిధికి గుర్తు చేశాడు.…

ఇరాన్ ఆయిల్ దిగుమతులు ఇండియా తగ్గించాల్సిందే -హిల్లరీ హుకుం

ఇండియా, ఇరాన్ నుండి చేసుకుంటున్న ఆయిల్, గ్యాస్ దిగుమతులను తగ్గించుకోవాల్సిందేనని అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ హుకుం జారీ చేసింది. ఇరాన్ దిగుమతులను ఇప్పటికే గణనీయంగా తగ్గించుకున్నందుకు హర్షం వ్యక్తం చేసిన హిల్లరీ, అది చాలదనీ, ఇంకా తగ్గించుకోవాలని కోరింది. ‘ఇరాన్ ఆయిల్, గ్యాస్ దిగుమతులను తగ్గించుకునేది లేదని’ జనవరిలో పెట్రోలియం మంత్రి జైపాల్ రెడ్డి చేసిన ప్రకటన ఒట్టిదేనని హిల్లరీ హర్షం స్పష్టం చేసింది. ఆ రకంగా బహిరంగంగానే ఇండియాకి ఆదేశాలిస్తున్న హిల్లరీని ‘అదేమని’…